॥పల్లవి॥వేదవేద్యులు వెదకేటిమందుఅదినంత్యములేని ఆమందు॥చ1॥అడవిమందులుఁ గషాయములు నెల్లవారుకడగానక కొనఁగానుతొడిఁబడ నొకమందు దొరకె మాకు భువి-నడియాలమైనట్టి ఆమందు॥చ2॥లలితరసములుఁ దైలములు నెల్లవారుకలకాలము గొనఁగానుచెలువైన దొకమందు చేరె మాకు భువి-నలవిమీఱినయట్టియామందు॥చ3॥కదిసినజన్మరోగముల నెల్లవారుకదలలేక వుండఁగానుఅదన శ్రీతిరువేంకటాద్రిమీఁదిమందుఅదివో మాగురుఁడిచ్చె నామందు రాగము: దేసాక్షి రేకు: 0001-02 సంపుటము: 1-2 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
॥పల్లవి॥వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదుకలికిమరుఁడు సేసినాజ్ఞ కడవఁగరాదురా॥చ1॥అంగడి కెత్తినట్టిదివ్వె లంగనముఖాంబుజములుముంగిటి పసిఁడికుంభములును ముద్దులకుచయుగంబులుయెంగిలిసేసినట్టితేనె లితవులైన మెఱుఁగుమోవులులింగములేని దేహరములు లెక్కలేని ప్రియములు॥చ2॥కంచములోని వేఁడికూరలు గరువంబులుఁ బొలయలుకలుయెంచఁగ నెండలోనీడలు యెడనెడకూటములుతెంచఁగరాని వలెతాళ్ళు తెలివిపడనిలేఁతనవ్వులుమంచితనములోని నొప్పులు మాటలలోనిమాటలు॥చ3॥నిప్పులమీఁద జల్లిననూనెలు నిగిడితనివిలేనియాసలుదప్పికి నేయిదాగినట్లు తమకములోనితాలిమిచెప్పఁగరానిమేలు గనుట శ్రీవేంకటపతిఁ గనుటలుఅప్పనికరుణగలిగి మనుట అబ్బురమైనసుఖములు రాగము: సామంతం రేకు: 0001-01 సంపుటము: 1-1 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఒక్కఁడే అంతర్యామి వుపకారి చేపట్టుతక్కినవి యిన్నియును తలఁపు రేఁచెడిని॥చ1॥యెఱుఁగుమీ జీవుఁడా యింద్రియాలు సొమ్ము గావుగుఱియై మాయలలోనఁ గూడించే వింతెమఱవకు జీవుడా మనసు చుట్టము గాదుతెఱఁగొప్ప ఆసలానే తిప్పెడి దింతె॥చ2॥తెలుకో జీవుఁడా దేహమును నమ్మరాదువలసితే నుండుఁ బోవు వన్నెవంటిదితలఁచుకో జీవుడా ధనము దనిచ్చ గాదుపలులంపటములచేఁ బరచెడి దింతె॥చ3॥సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదుబిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతెయిమ్ముల శ్రీవేంకటేశ డితనిమూలమే యింతనెమ్మిఁ దానే గతియంటే నిత్యమవు నింతే రాగము: రామక్రియ రేకు: 0099-06 సంపుటము: 1-500 Tags: Annamacharya […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎట్టయినా జేయుము యిఁక నీచిత్తముకిట్టిననీ సంకీర్తనపరుఁడ॥చ1॥కొందరు జ్ఞానులు కొందరు భక్తులుకొందరు వైరాగ్యకోవిదులుయిందరిలో నే నెవ్వఁడఁ గా నిదెసందడి హరి నీశరణాగతుఁడ॥చ2॥జపితలు గొందరు శాస్త్రులు గొందరుప్రపత్తిఁ గొందరు బలువులువుపమించఁగ ని న్నొకఁడా గా నిందుకపురుల నీడీంగరీఁడ నేను॥చ3॥ఆచార్యపురుషులు అవ్వలఁ గొందరుయేచినసమయులై యేర్పడిరికాచేటి శ్రీవేంకటపతి నే నైతేతాచి నీదాసులదాసుఁడను రాగము: మలహరి రేకు: 0099-05 సంపుటము: 1-499 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥అంచితపుణ్యులకై తే హరి దైవ మవుఁగాకపంచమహపాతకులభ్రమ వాప వశమా॥చ1॥కాననియజ్ఞానులకు కర్మమే దైవముఆనినబద్ధులకు దేహమే దైవముమాపననికాముకులకు మగువలే దైవముపానిపట్టి వారివారిభ్రమ మాన్పవశమా॥చ2॥యేమీ నెఱఁగనివారి కింద్రియములు దైవముదోమటిసంసారి కూరదొర దైవముతామసుల కెల్లాను ధనమే దైవముపామరుల బట్టినట్టి భ్రమఁ బాపవశమా॥చ3॥ధర నహంకారులకు తాఁదానే దైవముదరిద్రుఁడైనవారికి దాత దైవముయిరవై మాకు శ్రీవేంకటేశుడే దైవముపరులముంచినయట్టి భ్రమఁ బాపవశవమా రాగము: దేసాక్షి రేకు: 0099-04 సంపుటము: 1-498 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ముంచినవేడుకతోడ మొక్కుటగాకకంచములోపలికూడు కాలఁదన్న నేఁటికి॥చ1॥వేదార్థములు నీవేవిహరించినసుద్ధులేకాదని అవునని కొన్ని వాదములేలయేది నీవు సేసినాను యిన్నియును నియ్యకోలేసోదించనేఁటికి యందు సొట్టు లెంచఁనేటికి॥చ2॥కర్మము లిన్నియును నీకైంకర్యసాధనాలేఅర్మిలిఁ దారతమ్యము లడుగనేలనిర్మితము నీ దింతే నెరసు లెంచంగనేలధర్మమందు నింక గజదంతపరీక్షేఁటికి॥చ3॥భక్తియింతా నొక ఘంటాపథము నీశావలేయుక్తిఁ బాత్రాపాత్రములు యూహించనేలము క్తికి శ్రీవేంకటేశ మూలము నీపాదములుసక్తులయి నమ్ముటగాక చలపదమేఁటికి రాగము: సాళంగనాట రేకు: 0099-03 సంపుటము: 1-497 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కనినవాండాఁ గాను కాననివాఁడాఁ గానుపొనిఁగి వొరులకైతే బోధించే నేను॥చ1॥ధరణిఁ గర్మము గొంత తగినజ్ఞానము గొంతసరికి సరే కాని నిశ్చయము లేదువొరిమె యెంచిచూచితే నొకటివాఁడాఁగానుసరవి దెలియ కేమో చదివేము నేము॥చ2॥యీతల నిహము గొంత యింతలోఁ బరము గొంతచేతులు రెండు చాఁచే చిక్కుట లేదుయీ తెరువులో నొకటి నేరుపరచుకోలేనుకాతరాన కతలెల్లా గఱచితి నేను॥చ3॥దైవిక మొకకొంత తగుమానుషము గొంతచేవలుచిగురువలెఁ జేసేనుయీవల శ్రీవేంకటేశుఁ డిది చూచి నన్నుఁ గాచెభావించలేక యిన్నాళ్ళు భ్రమసితి నేను రాగము: బౌళి రేకు: 0099-02 సంపుటము: 1-496 Tags: […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥తెలిసిన బ్రహ్మపదేశ మిదేసులభ మనుమ నిదే చూచీఁగాక॥చ1॥పుట్టించినహరి పూరి మేపునాగట్టిగా రక్షించుఁగా కతఁడుకట్టడిజీవుడు కానక నోళ్లుతెట్టఁదెరువునకు తెఱచీఁ గాక॥చ2॥అంతరాత్మ తనునట్టే మఱచేనాచింత లో బెరరేఁచీఁగాకపంతపు జీవుఁడు భ్రమసి సందుసుడిదొంతులు దొబ్బుచుఁ దూరీఁగాక॥చ3॥నొసల వ్రాసినవి నోమించుఁగా కతఁ-డెసగిన శ్రీవేంకటేశ్వరుఁడువిసుగక జీవుడు వీరిఁడిమాయలనరురసురయి తా నలసీఁగాక రాగము: శ్రీరాగం రేకు: 0099-01 సంపుటము: 1-495 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇందిరాపతిమాయలు యింతులు సుండీమందలించి హరి గొల్చి మనుదురుగాని॥చ1॥అతివలచూపులే ఆయాలు దాఁకీఁ జుండీజితమైనపులకల జిల్లులౌఁజుండీరతిపరవశములు రాఁగినమూర్ఛలు సుండీమతిలోఁ దప్పించుక మనుదురుగాని॥చ2॥మెఱయించేచన్నులే మించుఁబెట్లుగుండ్లు సుండీమెఱుఁగువమోవులే మచ్చు మేపులు సుండీమఱి మంచిమాటలు మాయపుటురులు సుండీమఱవక తప్పించుక మనుదురుగాని॥చ3॥బలుసంసారపుపొందు పాముతోడిపొత్తు సుండీవెలలేనివలపులు విషము సుండీయెలమితో శ్రీవేంకటేశ్వరుమఱఁగు చొచ్చిమలయుచు సొలయుచు మనుదుచుగాని రాగము: ముఖారి రేకు: 0098-06 సంపుటము: 1-494 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, […]పూర్తి వివరాలు ...