వర్గం: హాస్యగీతాలు (పసలకాపర్లు పాడుకొనే పాట) పాడటానికి అనువైన రాగం : తిలకామోద్ స్వరాలు (ఆదితాళం) పొద్దన్నె లేసినాడు కాదరయ్యా వాడు కాళ్ళు మగం కడిగినాడు కాదరయ్యా(2) కాళ్ళు మగం నాడు కాదరయ్యా వాడు పంగనామం పీకినాడు కాదరయ్యా పంగనామం పీకినాడు కాదరయ్యా వాడు సద్ది సంగటి తిన్యాడు కాదరయ్యా సద్ది సంగటి తిన్యాడు కాదరయ్యా వాడు బుట్టి సంకన పెట్టినాడు కాదరయ్యా బుట్టి సంకన పెట్టినాడు కాదరయ్యా వాడు పల్లె దావ పట్టినాడు కాదరయ్యా పల్లె […]పూర్తి వివరాలు ...
వర్గం: ఇసుర్రాయి పదాలు యితనాల కడవాకి యీబూతి బొట్లు యిత్తబోదము రాండి ముత్తైదులారా గొర్తులేయ్యీమను గుంటకలెయ్యీ కొటార్లు తోలమను కోల్లైనగూసే గొరుదోలే రామనకు గొడుగు నీడల్లు బిల్లల మలతాడు బిగువు తాయితులు యిత్తేటి సీతమకు యిరజాజి పూలు నూగాయి సరిపెండ్లు నూటొక్కమాడా గొర్తి ఎద్దులకేమో కొమ్ము కుప్పుల్లూ పచ్చల్ల పణకట్లు పట్టు గౌసేన్ లూ అక్కిడేసే రంబాకూ అంచుచీరల్లూ నాలుబడిగల రైక నాను తీగల్లు గుంటక లచ్చుమయకు గోటంచు పంచా పులిగోరు తాయితులు బొమ్మంచు సెల్లా గుంటకెద్దులకేమొ […]పూర్తి వివరాలు ...
వర్గం : జట్టిజాం పాట అనువైన రాగం: నాదనామక్రియ స్వరాలు (తిశ్రగతి) ఏమిసేతురా బగమతి గురుడా మొగుడు ముసలివాడు బెమ్మరాతర రాసిన వానికి తగులును నా ఉసురు అందరి మొగుళ్ళు సెరువుకు పోయి శాపల్ తెచ్చాంటే అమ్మమ్మో.. నా లడీసు మొగుడూ కాలవకు పోయి కప్పలు తెచ్చిండే ||ఏమి సేతురా|| అందరి మొగుళ్ళు బీదరు పోయి బిందెలు తెచ్చాంటే నా లడీసు మొగుడూ బీదరు పోయి బిత్తర పోయొచ్చిండే ||ఏమి సేతురా|| అందరి మొగుళ్ళు పంచల్ కట్కోని […]పూర్తి వివరాలు ...
1876-78 సంవత్సరాలలో వచ్చిన కరువును ‘దాతు కరువు’ లేదా ‘డొక్కల కరువు’ లేదా ‘పెద్ద కరువు’ లేదా ‘ముష్టి కరువు’ గా వ్యవహరిస్తారు. తెలుగు సంవత్సరమైన ‘దాత’ లో వచ్చినందున ఈ కరువును ‘దాతు కరువు’ అని వ్యవరించేవారు. కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా కడుపు మాడ్చుకునేవాళ్ళు. దాంతో సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి ఎముకలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు(ఎముకల గూళ్ళు) మాత్రమే కనపడటం వలన […]పూర్తి వివరాలు ...
దొరవారి నరసింహ్వరెడ్డి! నీ దొరతనము కూలిపోయె రాజా నరసింహ్వ రెడ్డి! || దొర || రేనాటి సీమలోనా రెడ్డోళ్ళ కులములోనా దొరవారీ వమిశానా ధీరుడే నరసింహ్వ రెడ్డి || దొర || కొయిల్ కుంట్లా గుట్టలెంటా కుందేరూ వొడ్డూలెంటా గుర్రమెక్కీ నీవు వస్తే కుంపిణీకీ గుండె దిగులూ || దొర || కాలికీ సంకెండ్లు వేసీ చేతీకీ బేడీలు వేసీ పారాతో పట్టి తెచ్చీ బందికానులొ పెట్టిరీ || దొర || కండ్లకూ గంతాలు గట్టీ నోటినిండా […]పూర్తి వివరాలు ...
వర్గం : కోలాటం పాట బళ్ళారి జిల్లరా … బళ్ళారి జిల్లరా ఆదోని తాలూకురా రాసెట్టి వీరన్న కొడుకే రాయల వాడే రామయ్య రామా రామా కోదండరామా భై రామా రామా కోదండరామా రాసెట్టి వీరన్నకయితే ఎంతమంది కొడుకుల్లు ఒగరి పేరు రామయ్య ఒగరి పేరు సుబ్బయ్య అందరికంటే చిన్నావాడు అందగాడూ విశ్వనాధు పన్నెండామడ గడ్డలోన పేరుగల్ల రామయ్య ||రామా|| రామయ్య నేస్తులైన ఎంతమంది ఉన్నారు కొంగనపల్లి కిష్టరావు కోసిగానుమప్ప రా ||రామా|| బుద్ధిశాలి రామయ్య బూమ్మింద […]పూర్తి వివరాలు ...
వర్గం: భిక్షకుల పాట అనువైన రాగం : సావేరి స్వరాలు (ఏక తాళం ) ఉత్తరాది ఉయ్యాలవాడలో ఉన్నది ధర్మం సూడరయా నేటికి బుడ్డా యంగలరెడ్డి ధర్మ పెబువని పాడరయా దానపరుడూ యంగళరెడ్డి ధర్మదేవత బిడ్డడయా పచ్చి కర్వులో పాసెమూ పోసేను బెమ్మదేవుడే ఆయనయా ||ఉత్తరాది|| యెచ్చుగానూ పుణ్యాత్ముడు రెడ్దని యంగళరెడ్డిని ఎంచరయా యంగళరెడ్డి దానపరుడని శానామంది పొగిడిరయా ||ఉత్తరాది|| గుడ్డోల్లకు కుంటోళ్లకు గురుతుగా బండ్లే సేయించేనయా దొడ్డా బుద్ది కలిగిన పెద్ద దొరకు దండామని తెలిపిరయా […]పూర్తి వివరాలు ...
వర్గం: హాస్య గీతాలు దాని సొమ్మేమైన తింటీనా దానెబ్బ గంటేమైన తింటీనా దీని సొమ్మేమైన తింటీనా ఈళ్ళ నాయన గంటేమైన తింటీనా దాని సొమ్మేమైన తింటీనా దానెబ్బ గంటేమైన తింటీనా దీని సొమ్మేమైన తింటీనా ఈళ్ళ నాయన గంటేమైన తింటీనా తెలిసీ తెలియక అమ్మ ఇల్లరికం నేనొస్తి(2) డబ్బాశ కోసమై అత్తింట్లో నేనుంటే ఆ..డబ్బాశ కోసమై అత్తింట్లో నేనుంటే కసువూలూడ్సమని బోకుల్దోమమనే ఆ..కసువూలూడ్సమనె బోకుల్దోమమనె వడ్లు దంచమనె మంట బెట్టమనె వంట సేయమనె ఆ..ఈ ఇంటి పనులంటే […]పూర్తి వివరాలు ...
కోడి పిల్లో… అబ్బో కోడి పిల్లా.. ఆ మాటలంటదే కోడిపిల్ల ఆ.. మాటలంటదే ఆ..లాగనంటదే ఆ..మైన అంటదే ఆ.. లయ్యబడ్తదే కోడిపిల్ల! కోయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి కైలాసం నేనూ పోయినానంటదే ఆ మాటలంటదే కోడిపిల్ల!! దిబ్బమీదికొంచబోయి … బొచ్చు గిచ్చు ఈకుతాంటే (౩) అహా.. సిలంకూరి సిన్నప్ప.. శవరం సేసినానంటదే (2) ఆ మాటలంటదే ఆ..లాగనంటదే ఆ మైన అంటదే ఆ లయబడ్తదే కోడిపిల్ల! కోయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి కైలాసం నేనూ పోయినానంటదే ఆ […]పూర్తి వివరాలు ...