జూన్ 7న తొలి విమాన సర్వీసు టికెట్ ధర రూ.1234 కడప: కడప – బెంగుళూరు నగరాల మధ్య వారానికి రెండు సార్లు విమానాన్ని నడిపేందుకు ఎయిర్ పెగాసస్ విమానయాన సంస్థ సిద్ధమైంది. కేంద్రవిమానయాన శాఖ అధికారులు ప్రతిపాదించిన ప్రకారం 7న కడప విమానాశ్రయం ప్రారంభమైతే ఆ రోజు నుంచే విమానాలు నడిపేందుకు ఎయిర్ పెగాసస్ సంస్థ సిద్ధమైంది. మొదటి విమానం జూన్ 7వ తేదీ ఉదయం 10 గంటల 40 నిముషాలకు బెంగుళూరు నుండి బయలుదేరి […]పూర్తి వివరాలు ...
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతి రాజుతో, ఏఏఐ అధికారులతో మే 19న డిల్లీలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వారంలో కడప విమానాశ్రయంలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని, అనంతరం ఒక వారంలో కడప నుంచి విమానాలు నడుస్తాయని పత్రికలకు చెప్పారు. కడప విమానాశ్రయాన్ని ఏప్రిల్ 30న పరిశీలించిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దక్షిణ ప్రాంత రీజినల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నరసింహమూర్తి మే 10 నుంచి […]పూర్తి వివరాలు ...
కడప: వైఎస్ఆర్ జిల్లాకు కడప జిల్లాగానే పేరు మార్చాలని ఆదివారం కడపలో జరిగిన తెదేపా మినీ మహానాడులో ఆ పార్టీ నేతలు తీర్మానించారు. కడపకు ఎంతో ఘనచరిత్ర ఉందని, జిల్లాలో ఎంతోమంది కవులు, కళాకారులు, మహనీయులు, పుట్టారని, అలాంటి వారి పేర్లను మరచి జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లా అన్న పేరు పెట్టడం దురదృష్టకరమని పలువురు తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన మినీమహానాడులో నూతన అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకురాగా వైఎస్ఆర్ పేరు […]పూర్తి వివరాలు ...
98.54 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రధమ స్థానం 484 మందికి పదికి పది జిపిఏ కడప : మూడేళ్లుగా ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ వచ్చిన కడప జిల్లా.. ఈ ఏడు పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు 98.54 శాతం ఉత్తీర్ణత సాధించి కడప జిల్లాను ప్రధమ స్థానంలో నిలిపినారు. జిల్లా వ్యాప్తంగా 35,366 మంది పరీక్షలకు హాజరవ్వగా 34,848 మంది ఉత్తీర్ణులయ్యారు. దాంతో […]పూర్తి వివరాలు ...
కడప: మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియమితులయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి అన్ని జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమించగా.. కడప జిల్లా బాధ్యతలను గంటాకు అప్పగించినట్లు సమాచారం. విశాఖ నగరంలోని భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభ్యుడిగా గెలుపొందారు.పూర్తి వివరాలు ...
మైదుకూరు: తెదేపా మైదుకూరు నియోజకవర్గ భాద్యులు పుట్టా సుధాకర్‌యాదవ్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యునిగా రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. సుధాకర్ గత ఎన్నికల్లో తెదేపా తరఫున మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. సుధాకర్‌యాదవ్ నియామకంపై జిల్లాకు చెందిన పలువురు తెదేపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి సుధాకర్ యాదవ్ వియ్యంకుడు. యనమల సిఫార్సు ఆధారంగానే సుధాకర్ తితిదే […]పూర్తి వివరాలు ...
కడప : ప్రవాసాంధ్రుల సంఘం ‘తానా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా కడప జిల్లాకు చెందిన వేమన సతీష్ ఎంపికయ్యారు. ప్రస్తుత కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు జరిగిన ఎన్నికలలో సతీష్ 5120 ఓట్ల ఆధిక్యత సాధించి కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సతీష్ ఇప్పటికే తెదేపా తరపున క్రియాశీలకంగా పని చేస్తున్నారు. తానా ఆధ్వర్యంలో చేపట్టే సామాజిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాలలో సతీష్ కడప జిల్లాను కూడా భాగం చేస్తారని ఆశిద్దాం. తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వేమన సతీష్ గారికి అభినందనలు!పూర్తి వివరాలు ...
మొన్న పద్దెనిమిదో తేదీ ఈనాడులో వచ్చిన వార్తాకథనంలో రాష్ట్రంలో పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చెయ్యడానికి ఎంపిక చేసిన 11 ప్రాంతాల జాబితా ఇచ్చారు: పైడి భీమవరం – శ్రీకాకుళం జిల్లా అచ్యుతాపురం – విశాఖపట్నం జిల్లా నక్కపల్లి – విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం – విశాఖపట్నం జిల్లా కాకినాడ – తూర్పుగోదావరి జిల్లా కంకిపాడు – కృష్ణా జిల్లా గన్నవరం – కృష్ణా జిల్లా జగ్గయ్యపేట – కృష్ణా జిల్లా కొప్పర్తి – కడప జిల్లా ఏర్పేడు-శ్రీకాళహస్తి […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: సినిమా నటుడు జయప్రకాశ్‌రెడ్డి ప్రదర్శించిన అలెగ్జాండర్ నాటకం ఆహూతులను కడుపుబ్బా నవించింది. స్థానిక జార్జిక్లబ్ సభాభవనంలో ప్రొద్దుటూరు నాటక కళాపరిషత్ 18వ వార్షికోత్సవం ముగింపు సభ ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయప్రకాశ్‌రెడ్డి అలెగ్జాండర్ నాటకాన్ని ప్రదర్శించినారు. ఇందులో పదవీ విరమణ పొందిన మేజర్ పాత్రను పోషించిన జయప్రకాశ్‌రెడ్డి ఆద్యంతం నాటకాన్ని రక్తి కట్టించారు. కుటుంబ వివాదాల నడుమ ఒంటరి జీవితం గడపాలని నిర్ణయించుకున్న మేజర్ నామజిక రుగ్మతలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఒక […]పూర్తి వివరాలు ...