ఆదివారం మధ్యాహ్నం సిద్దల బోనాలు పట్టడంతో ప్రారంభమైన మల్లూరమ్మ జాతర సోమవారం పగలు కనుల పండువగా సాగింది. రాత్రికి మొక్కుబడిదారులు ఏర్పాటు చేసిన 17 చాందినీ బండ్లు సోమవారం తెల్లవారుజాముకు జాతరకు చేరుకున్నాయి. బండ్ల ముందు ట్రాక్టర్లలో వీధి నాటకాలు, చెక్కభజనలు, కోలాటాలు చేశారు. ఇవి భక్తులను అలరించాయి. వేల సంఖ్యలో ప్రజలు రావడంతో గుడి దగ్గర రద్దీగా మారింది. ఒక్కో బండికి ఒక చుట్టే తిరగాలని పోలీసులు చెప్పడంతో ప్రశాంతంగా ప్రదక్షిణలు సాగాయి. సోమవారం పగలు తిరునాళ్ల […]పూర్తి వివరాలు ...
కడప నగరంలోని అమీన్ పీర్ (పెద్ద) దర్గాలో హజరత్ సూఫిసర్ మస్త్షా చిల్లాకష్ ఖ్యాజా సయ్యద్ షా ఆరీపుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్టిపుల్ ఖాదిరి ఉరుసు ఉత్సవాలు సోమవారం ముగిశాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం కిటకిట లాడింది. పానక ప్రసాదం భక్తులకు అందించారు. అఖిల భారత స్థాయి 71వ ముషాయిరా (కవి సమ్మేళనం) తిలకించడానికి వచ్చిన భక్తులు, శిఘ్యలతో ప్రాంగణం కళకళలాడింది. ముషాయిరాలో దేశస్థాయిలోని ప్రముఖ కవులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ […]పూర్తి వివరాలు ...
చిన్నమండెం మండల పరిధిలోని కేశాపురం గ్రామం దేవళంపేటలో వెలసిన పాలేటమ్మ ఆలయం వద్ద 18వ తేదీ మంగళవారం నుంచి రెండు రోజులు తిరునాళ్ల నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పేరెన్నికగన్న పాలేటమ్మకు చిన్నమండెం, కలిబండ, పడమటికోన, బోనమల, కేశాపురం, జిల్లా సరిహద్దు గ్రామాల్లో ఆదివారం నుంచే బోనాలు సమర్పిస్తారు. మంగళవారం ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం సిద్దల బోనాలు సమర్పించడంతో తిరునాళ్ల ప్రారంభమవుతుంది. మొక్కులు ఉన్నవారు […]పూర్తి వివరాలు ...
అనంతపురం గ్రామంలో రెండు రోజుల పాటు జరిగిన గంగమ్మ జాతర సోమవారం సాయంత్రం ఘనంగా ముగిసింది. శనివారం తెల్లవారు జామున అనంతపురం గంగమ్మ ఆలయానికి చేరుకోవడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం కుర్నూతల గంగమ్మ ఆలయానికి రాగానే నిండు తిరునాళ్ల ప్రారంభమైంది. సోమవారం మైల తిరునాళ్ల నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు హుండీ ఆదాయాన్ని లెక్కించి, జాతర నిర్వహణ ముసిగిందని ప్రకటించారు. గత మూడు రోజుల పాటు అనంతపురం గ్రామం జనసంద్రంగా మారింది. […]పూర్తి వివరాలు ...
చింతకొమ్మదిన్నె గంగ జాతర ఆది, సోమవారాల్లో నిర్వహించనున్నారు. మహాశివరాత్రి అనంతరం రెండురోజుల తరువాత ఈ జాతరను అనాదిగా నిర్వహిస్తున్నారు. జాతరకు రాయలసీమ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. గంగ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా, వాహనాల రాకపోకలు అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చింతకొమ్మదిన్నె నుంచి అమ్మవారిని ఆనవాయితీ ప్రకారం అలంకరించి మేళతాళలతో కొత్తపేట గంగమ్మ ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ ఆవరణలో […]పూర్తి వివరాలు ...
అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగమ్మ ఆలయం రాయలసీమలోనే ప్రసిద్ధి – శనివారం నుంచి అమ్మవారి జాతర ప్రారంభం కానుంది. రాయలసీమ ప్రాంతం నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనార్థం రానున్నారు. మూడు రోజులు జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తిరుణాల్ల నేపధ్యం … అనంతపురం గ్రామానికి చెందిన తిమ్మిరెడ్డి ఉత్తారెడ్డి పొలం గట్టుకు కావాల్సిన కంప కొట్టి తొడుగేశారు. తీసుకెళ్లేందుకు కాడెద్దులతో కదిలించగా కదలలేదు. ఆ రాత్రి అమ్మవారు స్వప్నంలోకి వచ్చి […]పూర్తి వివరాలు ...
కడప నగరానికి కూతవేటుదూరంలో గల సికెదిన్నె మండలంలోని కొత్తపేట వద్ద గల గంగమ్మతల్లి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలే కాక, జిల్లా నలుమూలల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని, అ మ్మవారికి తమ మొక్కులు చెల్లించి బోనాలు సమర్పించుకుంటున్నారు. దీంతో ప్రతి ఆదివారం ఆలయం వద్ద భక్తుల రద్దీ పెరిగి పండుగ వాతావర ణం నెలకొంటుంది. ఇక్కడి వచ్చి అనేక మంది […]పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు: పట్టణంలోని పలగాడి వీధిలో కొలువై ఉన్న సయ్యద్ షా బడే గౌస్ పీరాఖాద్రి (పెద్ద ఆస్థానముల ) వారి 81వ ఉరుసు మహోత్సవాలు సెప్టెంబర్ 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రస్తుత పీఠాధిపతి సయ్యద్ షా గౌస్ పీరాఖాద్రి తెలిపారు. ఇందులో భాగంగా 18 వ తేదీ బుధవారం నిషాన్, 19 వతేదీ గురువారం గంధం, 20 వ తేదీ శుక్రవారం ఉరుసు, 21 వ […]పూర్తి వివరాలు ...
వేంపల్లె: మండల పరిధిలోని తాటిమాకులపల్లెలో ఈ నెల 29న జిల్లాస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు యోగానంద గురివిరెడ్డి స్వామి ఆశ్రమ నిర్వహణ కమిటీ తెలిపింది. గురివిరెడ్డిస్వామి మొదటి ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని వీటిని నిర్వహిస్తున్నారు. మొదటి బహుమతి కింద రూ.30116, ద్వితీయ బహుమతి కింద రూ.20116, తృతీయ బహుమతిగా రూ.10116, నాల్గో బహుమతిగా రూ.5116 నగదు అందించనున్నట్లు కమిటీ అధ్యక్షుడు పి.వి.మొహన్రెడ్డి తెలిపారు.పూర్తి వివరాలు ...