“ఏమ్మే, పొద్దు బారెడెక్కిండాది, వాన్ని లేపగూడదా, కొంచింసేపు సదువుకోనీ” అంటి నా పెండ్లాంతో. “సలికాలం గదా,ఇంగ రోంతసేపు పొణుకోనీలేబ్బా” అనె ఆయమ్మి. “నోరు మూసుకోని చెప్పిండే పని చెయ్,నువ్వే వాన్ని సగం చెడగొడతాండావ్” అంటి గదమాయిస్తా. “అట్లయితే నువ్వే లేపుకోపో” అంటా ఇంట్లేకెల్లిపాయ నా బాశాలి. “రేయ్ , టయిం ఏడు గంటల పొద్దయితాంది,ఇంగా నిగుడుకోనే పొణుకోనేవుండావే, లెయ్ వాయ్” అని మా పిల్ల నాకొడుకు పిర్రల మింద వొగటంటిస్తి. “ఏం నాయినా” అంటా వాడు కండ్లు నలుపుకుంటా లేసి కుచ్చుండె. […]పూర్తి వివరాలు ...
సీమ సినుకయ్యింది ముసురు మొబ్బయ్యింది దారి ఏరయ్యింది ఊరు పోరయ్యింది సినుకు సినుకే రాలి సుక్క సుక్కే చేరి ఊరి వంకై పారి ఒక్కొక్కటే కూరి పెన్నేరుగా మారి పోరు పోరంట ఉంది పోరు పెడతా ఉంది సీమ సినుకయ్యింది ముసురు మొబ్బయ్యింది దారి ఏరయ్యింది ఊరు పోరయ్యింది మెడలు వంచాలంది మడవ తిప్పాలంది మడమ తిప్పకు అంది తడవ మనదే అంది కడవ పగలాలంది అడుగు మడుగయ్యింది గొడవ దడి చేరింది సీమ సినుకయ్యింది ముసురు […]పూర్తి వివరాలు ...
ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా ప్రసారమైన సీతాకల్యాణం హరికథ కడప.ఇన్ఫో వీక్షకుల కోసం…. గానం చేసినవారు : శ్రీ రాజయ్య శర్మ భాగవతార్ గారు క్రింద ప్లే బటన్ నొక్కడం ద్వారా హరికథ వినవచ్చును. గమనిక : ఈ కథను వినుట ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో కొన్నిసార్లు సాధ్యపడక పోవచ్చు. మీరు ఒకవేళ ఫైర్ ఫాక్స్ వినియోగిస్తున్నట్లయితే దయచేసి గూగుల్ క్రోం లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఈ పుటను తెరవండి. పూర్తి వివరాలు ...
ఒరే అబ్బీ..ఒరే సిన్నోడా పొగబండీ..ల్యాకపాయ ఒరే సంటోడా..ఒరే సన్నొడా ఎర్ర బస్సూ కరువైపాయ అబ్బ పాలెమాలినా.. జేజికి బాగ లేకపొయినా గుంతల దోవలే దిక్కైపాయ తాతల కాలం నుంచీ పొగబండ్లని ఇనడమేకానీ ఎక్కిన పాపాన పోల్యా ఉత్తర దిక్కు రైలు యెల్తాంటే సిత్తరంగా ముక్కున ఎగసూడ్డమే కానీ కాలు మింద కాలేసుకోని కూచ్చోని రోంత దూరమన్నా పోయింది ల్యాకపాయ మా సిన్నాయన ఒకసారి కనకదుర్గమ్మ తిన్నాలకు పోయుండ్య పొగబండ్లతోనే పైన మోడాలు ఆడ్తాండయంట ఊరూరికీ పొగబండ్లలోనే జనాలంతా […]పూర్తి వివరాలు ...
రాజధాని వాడికి రాళ్ళ గంప మనకు సాగు నీళ్ళు వాడికి కడగండ్లు మనకు స్మార్ట్ సిటీలు వాడికి చితి మంటలు మనకు వాటర్ బోర్డ్ వాడికి పాపర్ బ్రతుకులు మనకు ఎయిమ్స్ వాడికి ఎముకల గూల్లు మనకు అన్నపూర్ణ వాడికి ఆకలి చావులు మనకు పోలవరం వాడికి కరువు శాపం మనకు యూనివర్సిటీలు వాడికి యురేనియం సావులు మనకు కాసుల పంట వాడికి మాసిన సదువు మనకు కనక వర్షం వాడికి కూనీ సంస్కృతి మనకు ఉండేదంతా […]పూర్తి వివరాలు ...
జానమద్ది హనుమచ్ఛాస్త్రి జగమెరిగిన బ్రౌన్ శాస్త్రిగా మూడు పదుల పుస్తకాలు వెలువరించి, అరువదేండ్ల సాహిత్య జీవితం గడిపి 90 ఏండ్ల పండు వయస్సులో మొన్న (28 ఫిబ్రవరి) తనువు చాలించారు. విషయం, వివేకం, విచక్షణ ప్రోది చేసుకున్న ఆయన క్రమశిక్షణతో, సమయపాలనతో జీవన గమనం సాగించారు. జీవితంలో చివరి మూడు నెలలు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు. దానికి ముందు చిర్రుని చీది ఎరగని ఆరోగ్యం వారిది. ‘దురూహలకు, దురాలోచనలకు నా మనస్సులో స్థానం ఉండదు.. ఇదే నా […]పూర్తి వివరాలు ...
కథానిక, నవల, నాటకం ఏదైనా తెలుగు సాహిత్యం సామాజిక చైతన్యానికి- రుగ్మతలు రూపుమాపటానికి ఉపయుక్తమవుతుందని తెలుగు శాఖ సహ ఆచార్యుడు తప్పెట రామప్రసాద్రెడ్డి వివరించారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో ’21వ శతాబ్ది తెలుగు సాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సులో శుక్రవారం ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. మూఢాచారాలను రూపుమాపేందుకు సాహిత్యం ఆయుధమన్నారు. 21వ శతాబ్ది సాహిత్యం మరింత పదునైన ఆయుధంగా రూపుదిద్దుకొంటోందని సంతృప్తి వ్యక్తం చేశారు. సమాజం మరింత పురోభివృద్ధి చెందటానికి తనవంతు పాత్ర […]పూర్తి వివరాలు ...
యోగివేమన విశ్వవిద్యాలయంలో ’21వ శతాబ్ది తెలుగు సాహిత్యం.. తీరుతెన్నులు’ అనే అంశంపై జాతీయ సదస్సు రెండో రోజు సి.వి.రామన్ విజ్ఞాన భవన్లో కొనసాగింది. ఈ సదస్సులో తెలుగుశాఖ సమన్వయకర్త ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ సంప్రదాయాలను, విలువలను జీవన మార్గాలనే మార్చివేసేంతగా సాహిత్యం ప్రభావం చూపిందన్నారు. రైతులు నేత కార్మికులు ఇతర వృత్తి కారులు జీవన విద్వంసానికి గురయ్యారన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికరంగం మనిషిని మనిషిగా బతకనీయకుండా చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. పేదలు- ధనికులకు మధ్య పెరుగుతున్న అంతరం […]పూర్తి వివరాలు ...
యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో ’21వ శతాబ్దిలో తెలుగు సాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై జాతీయ సదస్సు సి.వి.రామన్ విజ్ఞాన భవన్లోని సదస్సుల గదిలో బుధవారం మొదలైంది. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ సమాజ కోణం నుంచి సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆచార్య కుసుమకుమారి మాట్లాడుతూ వికీపిడియా వంటి వెబ్సైట్లు వేల పుటల్ని సాహిత్య అభిమానులకు అందిస్తున్నాయని వివరించారు. అలాంటి మాధ్యమాలను తెలుగు రచయితలు, పరిశోధకులు తప్పక ఉపయోగించుకోవాలన్నారు. […]పూర్తి వివరాలు ...