॥పల్లవి॥ఇప్పుడిటు కలగంటి నెల్ల లోకములకు-నప్పఁడగు తిరువేంకటాద్రీశుఁ గంటి॥చ1॥అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటిప్రతిలేని గోపురప్రభలు గంటిశతకోటి సూర్యతేజములు వెలుఁగఁగఁ గంటిచతురాస్యుఁ బొడగంటి చయ్యన మేలుకంటి॥చ2॥కనకరత్నకవాటకాంతు లిరుగడఁగంటిఘనమైన దీపసంఘములు గంటిఅనుపమమణిమయమగు కిరీటము గంటికనకాంబరము గంటి గక్కన మేలుకంటి॥చ3॥అరుదైన శంఖచక్రాదులిరుగడఁ గంటిసరిలేని అభయహస్తము గంటినితిరు వేంకటాచలాధిపునిఁ జూడఁగఁ గంటిహరిఁ గంటి గురుఁ గంటి నంతట మేలుకంటి రాగము: భూసాళం రేకు: 0006-03 సంపుటము: 1-38 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥మనసిజ గురుఁడితఁడో మఱియుఁ గలఁడో వేద-వినుతుఁ డీతఁడు గాక వేరొకఁడు గలఁడోis-aber.net॥చ1॥అందరికి నితఁడెపో అంతరాత్ముఁడనుచు-నందు రితఁడో మఱియు నవల నొకఁడోనందకధరుఁడు జగన్నాథుఁడచ్చుఁతుడు గో-విందుఁ డీతఁడుగాక వేరొకఁడు గలఁడో॥చ2॥తనర నిందరికిఁ జైతన్యమొసఁగిన యాతఁ-డొనర నితఁడో మఱియు నొకఁడు గలఁడోదినకరశతతేజుఁడగు దేవదేవుడు, త-ద్వినుతుఁ డితఁడుగాక వేఱొకఁడు గలఁడో॥చ3॥పంకజభవాదులకుఁ బరదైవ మీతఁడనిఅంకింతురితఁడో అధికుఁడొకఁడోశాంకరీస్తోత్రములు సతతమునుఁ గైకొనెడి-వేంకటవిభుఁడో కాక వేరొకఁడు గలఁడో రాగము: శ్రీరాగం రేకు: 0006-02 సంపుటము: 1-37 పూర్తి వివరాలు ...
॥పల్లవి॥వైష్ణవులుగానివార లెవ్వరు లేరువిష్ణుప్రభావ మీవిశ్వమంతయుఁ గాన॥చ1॥అంతయు విష్ణు మయం బట మరి దేవ-తాంతరములు గలవననేలాభ్రాంతిఁ బొంది యీ భావము భావించి-నంతనే పుణ్యులవుట దప్పదుగాన॥చ2॥యెవ్వరిఁ గొలిచిన నేమిగొరఁత మరియెవ్వరిఁ దలచిన నేమిఅవ్వలివ్వల శ్రీహరిరూపుగానివా-రెవ్వరు లేరని యెరుకదోచినఁ జాలు॥చ3॥అతిచంచలంబైన యాతుమ గలిగించు-కతమున బహుచిత్తగతులైయితరులఁ గొలిచిన యెడయక యనాథ-పతితిరువేంకటపతి చేకొనుఁగాక రాగము: ధన్నాసి రేకు: 0006-01 సంపుటము: 1-36 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ-వాని నన్నొకయింత వదలక నను నేలవలదా॥చ1॥అపరాధిఁగనక నన్నరసి కావుమనిఅపరిమితపుభయ మంది నీకు శరణంటిఁగాకనెపములేక నన్ను నీకుఁ గావఁగ నేలఅపవర్గరూప దయాంబుధి తిరువేంకటాధిపా॥చ2॥ఘనపాపిఁ గనక నీకరుణ గోరి నీ-వనవరతము నాయాతుమ విహరించుమంటిఁ గాకయెనసి నన్నుఁ గాచు టేమి యరుదు నీకు-ననఘుఁడ పరమతత్త్వానంద తిరువేంకటాధిప రాగము: సామంతం రేకు: 0005-06 సంపుటము: 1-35 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య [&పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇన్నియుఁ గలుగు టేజన్మముననైనఁజెన్నలర హరిసేవ సిద్దించుకొరకు॥చ1॥అరయ వేదాధ్యయన మది బ్రహ్మశుద్దికొర-కిరవైనశాస్త్రంబు లెరుకకొరకుతరి యజ్ఞములు రుణోత్తారమయ్యెడికొరకుసరిలేనిదానములు జన్మములకొరకు॥చ2॥మమకారదూరంబు మనసు గెలుచుటకొరకుసమవివేకంబు శాంతములకొరకుఅమరశ్రీతిరువేంకటాధ్రీశుమనసు నీ-జముగెలుచు బ్రహ్మవిజ్ఞానంబుకొరకు రాగము: నాదరామక్రియ రేకు: 0005-05 సంపుటము: 1-34 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పరమపాతకుఁడ భవబంధుఁడ శ్రీ –హరి నినుఁ దలఁచ నే నరుహుఁడనా॥చ1॥అపవిత్రుఁడ నే నమంగళుఁడఁ గడు-నపగతణ్యుఁడ నలసుఁడనుకపటకలుషపరికరహృదయుఁడ నే-నపవర్గమునకు నరుహుఁడనా॥చ2॥అతిదుష్టుఁడ నే నధికదూషితుఁడహతవివేకమతి నదయుఁడనుపతిలేని రమాపతి మిముఁదలఁచలేనతులగతికి నే నరుహుఁడనా॥చ3॥అనుపమవిషయపరాధీనుఁడ నే-ననంతమోహభయాతురుఁడవినుతింపఁగ దిరువేంకటేశ ఘను-లనఘులుగాక నే నరుహుఁడనా రాగము: సామంతం రేకు: 0005-04 సంపుటము: 1-33 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎంతటివారలు నెవ్వరును హరిఁజింతిచక నిశ్చింతులు గారు॥చ1॥అతిజితేంద్రియులు ననశనవ్రతులు-నతుల తపోధనులగువారుచతురానన గురుస్మరణము దొరకకతతి నూరక పుణ్యతములుగారు॥చ2॥అనఘులు శాంతులు నధ్యాత్మతతులు-ననుపమ పుణ్యులు యాజకులువనజోదరు ననవరతముఁ దలఁచకవినుతి స్మృతికిని విభుదులుగారు॥చ3॥దురిత విదూరులు దుర్మతిహీనులునిరతానందులు నిత్యులునుతిరువేంకటగిరిదేవుని గొలువకపరమార్గమునకు బ్రహ్మలు గారు రాగము: గుండక్రియ రేకు: 0005-03 సంపుటము: 1-32 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎన్ని లేవు నా కిటువంటివికన్నులెదుట నిన్నుఁ గనుగొనలేనైతి॥చ1॥అరయ నేఁజేసిన యపరాధములు చూచికరుణించి వొకడైనాఁ గాచునాకరచరణాదులు కలిగించిననిన్నుఁబరికించి నీసేవాపరుఁడ గాలేనైతి॥చ2॥యేతరినై నేనెఱిఁగి సేసినయట్టి-పాతక మొకఁడైనా బాపునాఆతుమలోనుండి యలరి నీవొసఁగిన-చేతనమున నిన్నుఁ జెలఁగి చేరనైతి॥చ3॥శ్రీవేంకటేశ నేఁ జేసిన యితరుల-సేవ కొకఁడు దయసేయునానీవే యిచ్చినయట్టి నే నీశరీరముతోడనీవాఁడ ననుబుద్ధి నిలుపనేరనైతి రాగము: గౌళ రేకు: 0005-03 సంపుటము: 1-31 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఆలాగుపొందులును నటువంటికూటములుయీలాగులౌట నేఁడిదె చూడనయితి॥చ1॥అడియాసచూపులకు నాసగించితిఁగానివెడమాయలని లోను వెదకలేనైతికడువేడుకలఁ దగిలి గాసిఁ బొందితిఁగానియెడలేనిపరితాప మెఱఁగలేనైతి॥చ2॥చిరునగవుమాటలకుఁ జిత్తగించితిఁగానితరితీపులని లోనుఁ దలఁపలేనైతివరుస మోహపుఁ బసలవలలఁ జిక్కితిఁగానిగరువంపుఁ బొలయలుక గానలేనైతి॥చ3॥శ్రీవేంకటేశ్వరునిఁ జింత సేసితిఁగానిదేవోత్తమునిలాగుఁ దెలియలేనైతియీవైభవముపై నిచ్చగించితిఁగానియీవైభవానంద మిది పొందనైతి రాగము: ఆహిరి రేకు: 0005-02 సంపుటము: 1-30 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరిపూర్తి వివరాలు ...