శ్రీశైలం జలాశయం నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.గోవర్ధనరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదివరకు కర్నూలు ముంపునకు గురయ్యేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులే కారణమని, దీంతో ప్రజలు భారీగా నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Saturday, July 16, 2011
కడప : జిల్లాలోని నిరుద్యోగ యువత రాజీవ్‌యువశక్తి పథకం దరఖాస్తులను ఈ నెల 18వ తేదీలోపు పంపుకోవాలని స్టెప్ సీఈవో డి.మహేశ్వరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తేలిపారు. స్వయం ఉపాధి పొందేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి చిన్న పరిశ్రమలు లేక సర్వీసింగ్ కేటగిరి పరిధిలోకి వచ్చే యూనిట్లు నెలకొల్పేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు.పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Friday, July 8, 2011
విద్యపై ఎపిపిఎస్సి మాజీ సభ్యుడు బిఆర్కెరాజు తీర్మానం ప్రవేశపెట్టారు. విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చాలని ఆయన కోరారు. అందుకోసం రాజ్యాంగ సవరణ తీసుకురావాలన్నా రు. విద్యారంగంలో సమూల మార్పులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతుందని చెప్పారు. డిగ్రీ తరువాత భవిష్యత్‌పై మరింత దృష్టి పెట్టాలన్నారు. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన అన్నారు. విద్యారంగంలో సమగ్ర ఆలోచన, విధానల రూపకల్పనకు పార్టీ తరపున ప్రత్యేక సదస్సు నిర్వహించవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, June 19, 2011
జమ్మలమడుగు : ప్రముఖ టివి యాంకర్ ఉదయభాను, ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్‌లు అదివారం మండల పరిదిలొని గండికొట పరిసర ప్రాంతాల్లొ హల్చల్ చేశారు. మా టివి నిర్మాణ సారధ్యంలొ స్టైల్ సురేష్ దర్శకత్వ పర్యవేక్షణలొ ధండర్ స్టార్ రియాలీటి షొ కు సంభందించిన ఎపొసిడ్ చిత్రీకరణ చేశారు. ఈ సందర్బంగా స్దానిక గండికొట ప్రాంతంలొని అత్యంత రమణీయమైన లొయ ప్రాంతంలొ రియాలిటి షొ కు సంభందించిన కొండను త్రాడుతొ పట్టుకొని పైకి వెళ్ళే వాటికి సంభందించి చిత్రీకరించారు.పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Friday, June 17, 2011
కడప : ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసిన వారి జాబితాలో తాజాగా కందుల సోదరులు చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బొత్సను కలిసి అభినందలు తెలిపారు. ఈ సందర్భంగా కందుల శివానందరెడ్డి, రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లాకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి పాటుపడిన వారికి డీసీసీ పదవి కట్టబెట్టాలని కోరారు. కడప అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు కృషి చేయాలని కోరారు. దీనికి స్పందించిన బొత్స స్థానిక సంస్థల ఎన్నికల్లో […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Friday, June 17, 2011
ఇడుపులపాయ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇడుపులపాయలో జూలై 8, 9 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ ముఖ్యనేతలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో అభిమానులు తరలిరానున్నారు. ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లను గురువారం వైఎస్ కొండారెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్‌ఛైర్మన్ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పరిశీలించారు.పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, June 16, 2011
కడప : రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బీపీ ఆచార్య బుధవారం రాత్రి కడప పెద్ద దర్గాను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు దర్గా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పూలచాదర్‌ను స్వయంగా తెచ్చి దర్గాలోని ప్రధాన గురువుల మజార్ వద్ద సమర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించుకుని ప్రార్థనలు చేశారు.పూర్తి వివరాలు ...
సంపాదకుడు
Saturday, June 11, 2011
కడప : జిల్లా పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ జెడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్లను ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికలు నిర్వహించనున్నారు. జెడ్పీటీసీల రిజర్వేషన్లు షెడ్యూలు తెగలు : చిట్వేలు (మహిళ) షెడ్యూలు కులాలు : కోడూరు (మహిళ), వేముల (జనరల్), .పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, June 5, 2011
ఇవి ప్రొద్దుటూరు బండెద్దులు… కడప జిల్లా కోడెద్దులు…. రంకేసి కాలు దువ్వితే ఎంతటి బండయినా పరుగులు తీయాల్సిందే! గాడి వదలి పోటీకి వెళితే బహుమతులు వాటి సొంతమే. విజేతలుగా ఇల్లు చేరి యజమానుల మోజు తీర్చే ఈ ఎద్దులు వారికి కన్నకొడుకులతో సమానం. ఈ బండలాగుడు ఎద్దులపై దోమ వాలినా వారిని కుట్టినట్లే బాధపడతారు. భీముడనే ఓ ఎద్దు ఇటీవల ఆకస్మిక మృతి చెందగా, దాని సంస్మరణ జరుపుతున్నారంటే వీటిపై యజమానులకుండే మమకారం వేరే చెప్పాల్సిన అవసరం […]పూర్తి వివరాలు ...