మంత్రి డిఎల్.రవీంద్రారెడ్డిపై ముఖ్య మంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి బర్తరఫ్ వేటు వేశారు. ఇప్పటి వరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మంత్రిగా డిఎల్ బాధ్యతలు నిర్వర్తించారు. డిఎల్‌ను బర్తరఫ్ చేస్తూ శనివారం గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి సిఫార్సు చేయగా, ఆ వెనువెంటనే గవర్నర్ ఆమోదముద్ర వేయడం జరిగి పోయాయి. కిరణ్ కుమార్ రెడ్డితో విభేదాల కారణంగానే డిఎల్‌ని మంత్రి వర్గం నుంచి తప్పించినట్లు సమాచారం. డిఎల్ మంత్రిగా ఉంటూనే పదే పదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని, సోనియా […]పూర్తి వివరాలు ...
తెలంగాణకు చెందిన ఆర్ విద్యా సాగర్ రావు కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ గా పని చేసి పదవీ విరమణ పొందారు. వారు మంచి మేధావి, వక్త కూడా. వివిధ పత్రికలకు వ్యాసాలు రాయడంలోనూ సిద్ధహస్తులు. వారు ఈ మధ్య సినిమాలలో నటిస్తున్నారు కూడా. తెరాసకు సలహాదారుగా కూడా వారు వ్యవహరిస్తున్నారు. రావు గారు ‘నమస్తే తెలంగాణా’ దిన పత్రికలో నీళ్ళు నిజాలు అని ఒక శీర్షిక నిర్వహిస్తున్నారు. ఈ శీర్షికలో వారు రాసిన వ్యాసాలలో సీమపై […]పూర్తి వివరాలు ...
కుందూ – పెన్నా వరద కాలువకు నీరు ఇస్తే కెసి ఆయకట్టు పాలిట మరణ శాసనంగా మారుతుందని మైదుకూరు రైతు సేవా సంఘం అధ్యక్షుడు డి.ఎన్.నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కుందూ – పెన్నా వరద కాలువకు నీరు ఇస్తే కెసి రైతాంగానికి నీరు సరఫరా ఉండదని రైతులను ఆదుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రొద్దుటూరుకు తాగునీరు సరఫరా చేయాలని మైదుకూరు రైతు సేవా సంఘం అధ్యక్షుడు డి.ఎన్.నారాయణ కోరారు. జిల్లా కెసి కాలువ ఆయకట్టు స్థిరీకరణ […]పూర్తి వివరాలు ...
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ అనేది ఏమిటి? నీలం సంజీవరెడ్డి సాగర్ (శ్రీశైలం ప్రాజెక్టు) నుండి రాయలసీమకు సరఫరా చేసే నీటిని జలాశయం నుండి కాలువలోకి తీసుకునే నీటి నియంత్రణా వ్యవస్థే, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ (Pothireddypadu Head Regulator). నీటి సరఫరాను నియంత్రించే వీలు కలిగిన నాలుగు తూములు ఇక్కడ ఉన్నాయి. ఆ పేరు ఎలా వచ్చింది ? పోతిరెడ్డిపాడు అనే గ్రామం వద్ద దీనిని నిర్మించారు కనుక దీనికి ఆ పేరు వచ్చింది. గుంటూరు రహదారి నుండి 4 […]పూర్తి వివరాలు ...
రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది.ఆమాటకు వస్తే అన్ని విషయాలలోను పరస్పర వైరుధ్యాలతో మన సమాజం కొట్టుమిట్టాడుతోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని నెత్తికెత్తుకుని లబ్ది పొందాలని చూస్తున్న కొందరు రాజకీయ నాయకులు తామే హజారే తర్వాత హజారేలమంటూ బాగానే హడావుడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా అవినీతి నిర్మూలనకు కరెన్సీ నోట్లు రద్దు చేయాలంటూ పాటలు మొదలు పెట్టారు.పాపం ఈ ఆలోచన రిజర్వ్ బ్యాంకు వారికి కానీ ఆర్ధిక వేత్త అయిన మన ప్రధానుల వారికి కానీ […]పూర్తి వివరాలు ...
వైకాపా చీఫ్, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా అని మొన్న సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్‌పై విచారణ సమయంలో సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూశారు. ఐతే సుప్రీంకోర్టు బెయిల్ పిటీషన్‌ను తోసిపుచ్చింది. దీంతో పార్టీ శ్రేణులంతా నిరాశ చెందాయి. కానీ జగన్ అభిమానులు, ముఖ్యంగా యువత సామాజిక సైట్ ఫేస్ బుక్‌లో జగన్‌కు బెయిల్ వస్తుందనీ, నెక్ట్స్ సీఎం జగనే అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. జగన్ బయటకొస్తే వార్ వన్ సైడేననీ… […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ శాసనమే ప్రప్రథమ మనడానికి అందులో వాడిన ప్రాచీన లిపి-భాషలే ప్రమాణం. పోగొట్టుకున్నాం! ఈసారి పోయింది అట్లాటి ఇట్లాటి వస్తువు కాదు. తెలుగు భాషకు వెలుగు పూలు పూయించిన తొలి తెలుగు శాసనం… తెలుగు భాషకు […]పూర్తి వివరాలు ...
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు సీబీఐని ప్రశ్నించే దమ్ము, ధైర్యం లేదని రాజంపేట శాసన సభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శించారు. రాజంపేటలో మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డికి బెయిల్ రాకుండా కాంగ్రెస్, టీడీపీ మోకాలొడ్డుతున్నాయన్న ఆయన సీబీఐ కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థ అని, ఇప్పటికే ప్రజల్లో దానిపై చులకన భావం ఏర్పడిందన్నారు. చివరకు సీబీఐ పనితీరును అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రశ్నించడం తెలిసిందేనన్నారు. బెయిల్ రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా సీబీఐ పనిచేస్తున్నదన్నారు. సీబీఐ సర్కారు పంజరంలో చిలుక అని ఆయన […]పూర్తి వివరాలు ...
కడప నగరంలో పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుని సిటీ బస్సులు నడపాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ నిర్మల అన్నారు. శుక్రవారం నగరం, పురపాలక సంస్థ కమిషనర్లు, అర్టీసీ, ఇతర ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కడప నగరంతో పాటు ప్రొద్దుటూరు పురపాలకలో కూడా సిటీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అందుకు పురపాలక సంస్థల అధికారులు సహకరించాలన్నారు. విద్యుత్, తాగునీటి సరఫరా, భూసేకరణ, రోడ్లు వెడల్పు, ఆక్రమణలు, తదితరాలపై సమీక్షించడం […]పూర్తి వివరాలు ...