1400 – జిల్లాలోని ప్రైవేటు వ్యక్తుల దగ్గరున్న తుపాకులు ప్రాణాపాయం, ఆత్మరక్షణ కోసమని జిల్లాలోని చోటా మోటా నాయకులు, పలువురు వ్యక్తులు అధికారిక లెక్కల ప్రకారం 1400 తుపాకులు కలిగి ఉన్నారు. ఇందులో 77 తుపాకులు బ్యాం కులకు భద్రత కల్పిస్తున్న సిబ్బంది కలిగి ఉన్నారు. వీటిని మొత్తం సంఖ్య నుండి మినహాయిస్తే 1323 తుపాకులు అనధికార వ్యక్తులు అధికారికంగా (లైసెన్స్) కలిగి ఉన్నారు. వీటిలో అధిక భాగం రాజకీయాలతో సంబంధం కలిగిన వ్యక్తుల చేతిలో ఉండడం […]పూర్తి వివరాలు ...
కేతు విశ్వనాథరెడ్డి గురించి సొదుం జయరాం “జ్ఞాపకశక్తికీ నాకూ చుక్కెదురు. విశ్వం, నేనూ ఎప్పుడు దగ్గరయ్యామో నాకు సరిగ్గా గుర్తు లేదు. ఇద్దరం ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూల్లో చదువుకున్నాం. కానీ ఆ రోజుల్లో మా ఇద్దరికీ స్నేహం అయినట్టు లేదు. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్న రోజులలో రా.రా గారు కడపకొచ్చారు. ఆయన ఎక్కడెక్కడి వాళ్ళను ఒకచోట చేర్చారు. గజ్జల మల్లారెడ్డి, కేతు విశ్వనాధరెడ్డి, ఆర్వీఆర్, రామప్ప, బండి గోపాల్ రెడ్డి, వై.సి.వి.రెడ్డి, కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, గోవిందరెడ్డి, రామ్మోహన్ […]పూర్తి వివరాలు ...
SRK4TWU9MY4B కేంద్ర ప్రసార శాఖ నుంచి కడప నగరానికి చెందిన స్వచ్ఛంధ సంస్థ ‘దాదాస్’కు ఎఫ్ఎం కమ్యూనిటీ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అనుమతి లభించింది. ప్రస్తుతం ట్రాన్స్‌మీటర్, వెర్లైస్ ఆంటెన్నాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. రాయలసీమలో తిరుపతి, కర్నూలు, అనంతపురంలలో ఎఫ్ఎం రేడియో స్టేషన్ ఏర్పాటై ప్రసారాలు జరుగుతున్నాయి. ఆకాశవాణి కడప కేంద్రానికి అనుబంధంగా ఎఫ్.ఎం స్టేషన్ ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఈ ప్రతిపాదన గురించి పట్టించుకోని ప్రభుత్వం కనీసం ఎఫ్.ఎం కమ్యూనిటి స్టేషన్ […]పూర్తి వివరాలు ...
పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న బడులకు ఎన్నికల రోజు, ముందు రోజు సెలవుగా ప్రకటించి, బడిని ఎన్నికల సిబ్బందికి అప్పగించాలని జిల్లా విద్యాధికారి అంజయ్య ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చారు. ఇద్దరు ఉపాధ్యాయులకు ఓట్లకు సంబందించిన విధులుంటే ఆ బడులకు కూడా రెండు రోజులు సెలవులు ఉంటాయన్నారు. ఎన్నికలు లేని ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు విధులు లేకుంటే పాఠశాలలు యధాతథంగా నిర్వహించాలన్నారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి పాఠశాలలు మామూలుగా కొనసాగించాలన్నారు. ఈ నిబంధనలు 23, 27, 31 […]పూర్తి వివరాలు ...
జూలై 26,27,28 తేదిలలో కడప నగరంలో తపాల బిళ్ళలు మరియు నాణేలు ప్రదర్శన జరుగనుంది.ఇందుకు సంబంధించి నిర్వాహకులు ఒక ప్రకటనను విడుదల చేశారు. TTD కళ్యాణ మంటపం లో మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో వివిధ దేశాల తపాలా బిళ్ళలు మరియు నాణేలు ప్రదర్శించ బడతాయి. ప్రవేశం ఉచితం. తపాలా బిళ్ళలు, నాణేల సేకరణ కర్తల కొరకు స్టాంప్స్ మరియు కాయిన్ డీలర్స్ 20 పైగా స్టాల్ లు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్బంగా విద్యార్దులకు […]పూర్తి వివరాలు ...
పిల్లల్ని బడికి పంపడానికిపెద్దలు తాయిలం పెడతారు. అయితే మేఘనాథ్ తండ్రికి.. బడే తాయిలం అయింది! ‘పశువుల పని పూర్తి చేస్తేనే… ఇవాళ నీకు బడి…’ అని తండ్రి పెట్టే ఆశకు, చదువుపై ఉన్న ఇష్టానికి మధ్య… గొడ్ల చావిడిలో ఆయన బాల్యం నలిగిపోయింది! అదిగో అలా పడింది ఈశ్వర్‌రెడ్డి మనసులో… తన పిల్లల చదువు… తన చదువులా తాయిలం కాకూడదని. చదువే సర్వస్వం అన్నాడు. చక్కగా చదివించాడు. అందుకే… సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించిన మేఘనాథ్ సక్సెస్‌స్టోరీలో […]పూర్తి వివరాలు ...
యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య బేతనభట్ల శ్యామ్‌సుందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాళ్లు, డీన్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… విశ్వవిద్యాలయంలోని కుటుంబసభ్యులందరినీ కలుపుకుని తన శాయశక్తులా అభివృద్ధికి కష్టపడి పనిచేస్తానని తెలిపారు. యోగి వేమన పేరుతో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయంలో పనిచేయడం అదృష్టమన్నారు. ఆయన ప్రబోధనలను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధికి పాటుపడతామన్నారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు సంపూర్ణ శక్తిసామర్థ్యాలను వినియోగించి విశ్వవిద్యాలయానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ […]పూర్తి వివరాలు ...
హీరో నందమూరి కల్యాణ్‌రామ్ ఈ రోజు (సోమవారం) కడప నగరంలోని అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. దర్గాలో ప్రార్థనలు నిర్వహించి అనంతరం గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ దర్గాను దర్శించుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, కుదరడంలేదని, ఇప్పుడు స్వామి అనుగ్రహం కలగడంతో దర్శించుకున్నానని కల్యాణ్‌రామ్ పేర్కొన్నారు. తాను నటించి, నిర్మించిన చిత్రం ‘ఓం’ ఈనెల 19న విడుదల కానుందని ఆయన తెలిపారు.పూర్తి వివరాలు ...
యోగివేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) నూతన ఉపకులపతిగా ఆచార్య డా. బి. శ్యాంసుందర్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఈయన నాగార్జున విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు పలు కీలకపదవులు నిర్వహించారు. ఆరునెలలుగా ఖాళీగా ఉన్న వైస్ చాన్స్‌లర్ పదవికి పలువురు పోటీపడ్డారు. ఆచార్య శ్యాంసుందర్ నియామకానికే గవర్నర్ మొగ్గుచూపడంతో వైవీయూ మూడో వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఆచార్య శ్యామ్‌సుందర్ […]పూర్తి వివరాలు ...