వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి1, 2015న ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో నిర్వహిస్తున్న పోతన భాగవత పద్యార్చనకు వేలాదిగా తరలిరావాల్సిందిగా 9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు నిర్వాహకులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక తితిదే కల్యాణమండపంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను తితిదే ధర్మప్రచార మండలి సభ్యులతో కలిసి పోతన సాహితీ పీఠం సభ్యులు విద్వాన్ కట్టా నరసింహులు ఆవిష్కరించి ప్రసంగించారు. లోకహితాన్ని తెలిపిన పోతన భాగవత పద్యాలను విద్యార్థులకు పరిచయం చేసే కార్యక్రమం ఇదన్నారు. తెలుగు వికాసాన్ని కోరుకునే తల్లిదండ్రులు, పవిత్ర భారతీయ […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలో 48 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సగటు వర్షపాతం లేని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తిస్తూ రాష్ట్ర రెవిన్యూ విభాగం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో కరవు పీడిత మండలాలుగా గుర్తించినవి ఇవీ…. రామాపురం, చక్రాయపేట, సింహాద్రిపురం, పెనగలూరు, గాలివీడు, వీరబల్లి, జమ్మలమడుగు, కడప, తొండూరు, పుల్లంపేట, లక్కిరెడ్డిపల్లె, అట్లూరు, వేంపల్లె, బద్వేలు, గోపవరం, చిన్నమండెం, రాయచోటి, పులివెందుల, […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా మంగంపేట బైరైటీస్(ముగ్గురాయి) గనులను ప్రయివేటు సంస్థలకు ధారాదత్తం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అత్యంత విలువైన, అరుదైన బైరైటీస్ గనులను ప్రయి’వేటు’కు అప్పగించడమంటే అక్షరాలా లక్ష కోట్ల రూపాయల సంపదను వారి చేతిలో అప్పనంగా పెట్టడమే. ప్రయివేటీకరణపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ మంగంపేట గనుల చుట్టూ ఏదో తతంగం నడుస్తోందన్నది మాత్రం సుస్పష్టంగా తెలుస్తోంది. బైరైటీస్ మార్కెట్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో ఆరు నెలల క్రితం అధికారంలోకొచ్చిన […]పూర్తి వివరాలు ...
మంగంపేట: ముగ్గురాళ్ళ విషయంలో కొంత మంది స్వార్థం కోసం అందరినీ బలిచేసే కార్యక్రమాలు జరుగుతున్నాయనీ తెదేపా రైల్వేకోడూరు నియోజకవర్గ బాధ్యుడు కస్తూరి విశ్వనాధనాయుడు ఆరోపించారు. 15న మిల్లర్లు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నాకు పిలుపు ఇచ్చిన నేపధ్యలో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంగంపేట పరిధిలోని బడా బయ్యర్లు చిన్నచిన్న మిల్లుల నుంచి రాయిని పొడి గొట్టకుండా నేరుగా అధిక ధరలకు అమ్మడం ప్రారంభించారన్నారు. ఏపీఎండీసీ […]పూర్తి వివరాలు ...
కడప: నగరంలో ఈ నెల 12న జరుగనున్న హిందూ శంఖారావం సభలో వీహెచ్‌పీ నేత ముస్లిం, మైనార్టీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా చూఒడాలని కోరుతూ ముస్లిం మైనార్టీల ప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించినారు. ఈ సందర్భంగా వారు హిందూ శంఖారావం పేరుతో జరుగు సమావేశానికి తాము వ్యతిరేకం కాదన్నారు. ముస్లింలను వ్యతిరేకించే విధంగా తొగాడియా వ్యాఖ్యలు చేయకుండా ఆపాలని వారు విజ్ఞప్తి చేశారు. భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ పెద్దలు […]పూర్తి వివరాలు ...
కడప: నగరంలో నిత్యం రద్దీగా ఉండే బీకేఎం వీధిలోభారీగా సూపర్ కాయితం సిత్తుల నిల్వలు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న సంచుల విలువ రూ.20 లక్షలు ఉంటుందని నగరపాలక అధికారులు తెలిపారు. ప్లాస్టిక్‌సంచుల నిల్వల గుట్టును నగర మేయర్ సురేష్ బాబు రట్టు చేయటం విశేషంగా కనిపిస్తోంది. నగర మేయర్ సురేష్‌బాబు, నగరపాలక సంస్థ కమిషనరు కొంతకాలంగా ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టటానికి చర్యలు తీసుకుంటున్నారు. బీకేఎం వీధిలోని టోకు వ్యాపారులు భారీ స్థాయిలో ప్లాస్టిక్ సంచులను మార్కెట్లలోకి విడుదల […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని ఆ పార్టీ నేత, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కడపకు వచ్చిన ఆయన సోమవారం బీజేపీ నాయకుడు ప్రభాకర్ నివాసగృహంలో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనను చూస్తున్న ప్రజలు బీజేపీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. పలు పార్టీల నాయకులు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ ప్రశ్నిస్తుందని, వ్యక్తిగత విమర్శలకు […]పూర్తి వివరాలు ...
కడప: కడప జిల్లాలో పుట్టి తెలుగుజాతికి వేగుచుక్కలుగా వెలుగొందిన అన్నమయ్య, వేమన, పోతులూరి వీరబ్రహ్మంలు సమాజిక రుగ్మతలపై ఆనాడే తమ కలాలను ఝులిపించి, గలమెత్తారని, వీరిలో వేమన తన ధిక్కారస్వరాని బలంగా వినిపించారని ఆదివారం కడపలో జర్గిన “వేగుచుక్కలు” పుస్తక పరిచయ సభలో వక్తలు కొనియాడారు. యోగివేమ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యాపకురాలు రచయిత్రి ఎంఎం వినోదిని రచించిన వేగు చుక్కలు పుస్తకావిష్కరణ సభ జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం వేదికగా జరిగింది. […]పూర్తి వివరాలు ...
కడప: రాజీవ్ గాంధీ వైద్య విద్యాలయం(రిమ్స్)లో త్వరలో 10 పడకలతో కార్డియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డెరైక్టర్ అరుణకుమారి తెలిపారు.శుక్రవారం రిమ్స్ సంచాలకుని కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడిన ఆమె ఈ మేరకు వెల్లడించారు.అలాగే చిన్న పిల్లల వైద్యానికి సంబంధించి మరో విభాగాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. అరుణకుమారి శుక్రవారం రిమ్స్‌లోని పలు వార్డులను పరిశీలించారు. అనంతరం ఓపీ విభాగానికి వచ్చి అక్కడ మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాలలో తన […]పూర్తి వివరాలు ...