కడప: అడ్డగోలుగా సీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నతెదేపా సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీమ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి కోస్తా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేదానికి 23.08.2014న పద్మావతి మహిళా వైద్య కళాశాల (తిరుపతి) ప్రవేశాలకు సంబంధించి ‘జీవో 120’ని విడుదల చేసింది. ఈ సంవత్సరం కొంతమంది రాయలసీమ విద్యార్థులు కోర్టు గడప ఎక్కడంతో రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కన పట్టి బరితెగించి, అడ్డగోలుగా తెదేపా ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో 120 వ్యవహారం వెలుగులోకి వచ్చింది. […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి 25 వరకు జనవిజ్ఞానవేదిక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి తవ్వా తెలియచేశారు. శుక్రవారం స్థానిక గ్రంధాలయంలో జవివే జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి ఆయన సభ్యత్వ నమోదు గోడపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ… శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జనవిజ్ఞానవేదికలో సభ్యులుగా చేరాలని పిలునిచ్చారు. సామాజిక అంశాల విశ్లేషణ, అధ్యయనాలను శాస్త్రీయ, హేతువాద దృక్పధంతో ప్రజానీకంలో ఆలోచనలుగా […]పూర్తి వివరాలు ...
ఇటీవల తిరుపతి నగరంలో భూమన్ అధ్యక్షతన ‘రాయలసీమ సమాలోచన’ సదస్సు జరిగింది. ఆ సదస్సుకు ‘రాయలసీమ విమోచన సమితి’ వ్యవస్థాపకులు డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి గారు పంపిన సందేశం: డియర్ భూమన్, సభలో చదివేందుకు సందేశం పంపమన్నావు . గుండె కోతను వెల్లి బోసుకోవడం తప్ప, నా దగ్గర సందేశాలు ఏమున్నాయని? గమ్యం చేర్చే రైలు ప్లాట్ ఫారం దాటి పోయిన తరువాత గోడున ఏడిస్తే తిరిగొచ్చేది కాదు. రేపో మాపో అలాంటి రైలు కోసం కాచుకోను౦డక రాయలసీమకు […]పూర్తి వివరాలు ...
త్వరలో అందుబాటులోకి 47కి.మీ రైలు మార్గం ప్రొద్దుటూరు: ఎర్రగుంట్ల-నొస్సం మార్గంలో సోమవారం రైల్వే అధికారులు ప్రత్యేక రైలును నడిపించి తనిఖీ చేశారు. పూర్తయిన రైల్వేపనులను దక్షిణ మధ్య రైల్వే భద్రతా కమీషనరు(సిఆర్ఎస్) డి.కె.సింగ్ పరిశీలించారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో ఆయన ఎర్రగుంట్లకు చేరుకున్న ఆయన ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లోని రికార్డులు పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లోని బ్యాటరీ, ఐపీఎస్, ఈఎల్‌సీ, ఓఎఫ్‌సీ గదులను పరిశీలించారు. ఎర్రగుంట్ల నుంచి రైల్వేసిబ్బందితో కలిసి ట్రాలీలో తనిఖీకి వెళ్లారు. ఎర్రగుంట్ల-నొస్సం మధ్యలోని 47 […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: విద్యార్థులు పాఠశాల దశ నుండే సామాజిక స్పృహ కలిగి ఉండాలని ఇటీవలే ఐఏఎస్‌కు ఎంపికైన జిల్లా వాసి విజయభాస్కర్‌రెడ్డి పాతకోట పేర్కొన్నారు. స్థానిక రామేశ్వరంలోని పురపాలక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సత్తిబాబు అధ్యక్షతన ఈ రోజు (శుక్రవారం) విజయభాస్కర్‌కు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… తెలుగుతో పాటు ఆంగ్ల భాష పైన కూడా విద్యార్థులు పట్టు సాధించాలని సూచించారు. సివిల్ సర్వీసు లాంటి పోటీ పరీక్షలను ఎదుర్కోవాలంటే విద్యార్థులు వార్తా […]పూర్తి వివరాలు ...
కడప: చాలా రోజుల తర్వాత జిల్లాలోని పలు ప్రాంతాలలో మాంచి వాన కురిసింది. బేస్తవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న వానకు తూములు దునికి నీళ్ళు వీధుల వెంబడి ప్రవహించాయి. కడప నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. జిల్లలో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముద్దనూరులో కురుస్తోన్న భారీ వర్షానికి కాయలవంక, పుల్లేరు వంక వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వాన కారణంగా ప్రజలకు తాగునీటి సమస్యల నుండి కొంతమేర ఉపశమనం కలగనుంది. పొలతల […]పూర్తి వివరాలు ...
ఉక్కు పరిశ్రమను కడపలోనే ఏర్పాటు చేయాల ఉక్కు పరిశ్రమను తరలించడం చట్టాన్ని ఉల్లంఘించడమే! కడప: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడప జిల్లా పట్ల రాజకీయ కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్, శాసనమండలి సభ్యుడు డాక్టర్ గేయానంద్ ధ్వజమెత్తారు. సీమ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర […]పూర్తి వివరాలు ...
పోలీసు బలగాలతో నిండిన నగరం పలువురు నేతల గృహనిర్భందం కడప : నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థినిలు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, అనుంబంధ విభాగాలు చేపట్టిన బంద్ విజయవంతమైంది. బంద్‌ను విచ్చిన్నం చేయడానికి ప్రభుత్వ ఆదేశానుసారం కడపలోనే తిష్ట వేసిన డిఐజీ రమనకుమార్ బందోబస్తు కోసమని మూడు జిల్లాల నుండి పోలీసు బలగాలను రప్పించారు. పోలీసు యంత్రాంగం మంగళవారం అర్థరాత్రి […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: దోమకాటు వలన వ్యాప్తి చెందే జబ్బుల గురించి ప్రజలలో అవగాహన కలిగించేందుకు జనవిజ్ఞాన వేదిక కడప జిల్లా కమిటీ ‘దోమకాటు – మనిషికి చేటు’ పేర రూపొందించిన కరపత్రం ఆవిష్కరణ బుధవారం పట్టణంలో జరిగింది. స్థానిక రవి నర్సింగ్ హోంలో జరిగిన ఈ కార్యక్రమంలో డా.రామ్మోహన్ రెడ్డి, డా.చంద్రమోహన్ లు మాట్లాడుతూ… ఒక్క డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడే కాకుండా ఇతర జ్వరాలు వచ్చినపుడు కూడా రక్తకణాల (ప్లేట్లెట్స్) సంఖ్య తగ్గుతుందని, ఈ విషయంపైన ప్రజలు అవగాహన్ […]పూర్తి వివరాలు ...