వార్తా విభాగం

వార్తలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ

ఆలయాల వద్ద పటిష్ట నిఘా గ్రామ రక్షక దళాలతో పోలీసుల సమన్వయం అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారమివ్వండి  కడప : జిల్లాలో ఉన్న  దేవాలయాలు, ప్రార్థనా మందిరాల భద్రతపై పోలీసుల పటిష్ట నిఘాతో పాటుగా రాత్రి వేళ పెట్రోలింగ్ , ఆకస్మిక తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్.పి అన్బురాజన్ ఈ రోజు  (సోమవారం) మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటుగా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలపాలన్నారు. […]పూర్తి వివరాలు ...

చరిత్ర పర్యాటకం పల్లెలు

ముత్తులూరుపాడు

ముత్తులూరుపాడు (ఆంగ్లం : Muttulurupadu or Muthulurupadu) – కడప జిల్లా ఖాజీపేట మండలంలోని ఒక ఊరు. ఈ ఊరు ఖాజీపేట, మైదుకూరుల నడుమ చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారి పై నుండి 2 కి.మీల దూరంలో ఉంది. స్థానికులు ఈ ఊరి పేరును ‘ముత్తులపాడు’ లేదా ‘ముత్తులుపాడు’ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఊర్లో పోస్టాఫీసు, రెండు మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలు, పశువైద్యశాల ఉన్నాయి. ముత్తులూరుపాడులో వివిధ కులాలకు, మతాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి  […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం వ్యాసాలు

ఆయనను మర్చిపోతే ‘‘సాహిత్య విమర్శ’’ను మరిచిపోయినట్లే !

సాహితి లోకంలో రారాగా సుప్రసిద్ధులైన రాచమల్లు రామచంద్రారెడ్డిగారి పరిచయభాగ్యం నాకు 1977లో ‘ఈనాడు’ పత్రికలో సబ్‌ఎడిటర్‌ ట్రెయినీగా పని చేస్తున్నప్పుడు కలిగింది. మా బ్యాచ్‌లో మేము పదిమంది దాకా ఉండేవాళ్ళం. వార్తల్ని ఇంగ్లీషు నుండి తెలుగులోకి ఎలా అనువదించాలో ఆర్నెల్ల పాటు మాకు శిక్షణ ఇచ్చారు. అనువాదం ఎంత సంక్లిష్టమైనదో అప్పుడే నేను తెలుసుకున్నాను. రా.రా.మాకు శిక్షణ గురువు. తాను సంపాదకీయాలు రాస్తూనే వార్తల్ని ఎలా అనువదించాలో మాకు నేర్పించారు. ఆయన నిండైన విగ్రహం నాకింకా బాగా […]పూర్తి వివరాలు ...

కైఫియత్తులు పర్యాటకం పల్లెలు

నంద్యాలంపేట

నంద్యాలంపేట (English: Nandyalampeta) – వైఎస్‌ఆర్ జిల్లా, మైదుకూరు మండలానికి చెందిన ఒక పల్లెటూరు. ఈ ఊరు మైదుకూరు – బద్వేలు రహదారిపైనున్న ‘గుడ్డివీరయ్య సత్రం’ సమీపంలో ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామం 2856 ఇళ్లతో, 11457 మంది జనాభాతో 5090 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5900, ఆడవారి సంఖ్య 5557. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3230 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 463. నంద్యాలంపేట గ్రామంలో ప్రధాన […]పూర్తి వివరాలు ...

అన్నమయ్య సంకీర్తనలు

జయమాయ నీకు – అన్నమయ్య సంకీర్తన

అన్నమయ్య సంకీర్తనలలో పెద్దముడియం నృసింహుడు రాగము: సాళంగనాట రేకు: 0324-1 సంపుటము: 11-139 ॥పల్లవి॥ జయమాయ నీకు నాపె సరసములూ నయగారి ముడుయము నారసింహా ॥చ1॥మోము చూచి నీతోడ ముచ్చట లాడ వలసి కోమలి నీ తొడమీఁదఁ గూచున్నది ఆముకొని అట్టె మాట లాడ వయ్య ఆపెతోడ నామాట విని యిట్టె నారసింహా ॥చ2॥మన్నన నీ యలుకల మంకు దెలవ వలసి చన్ను లురమునఁ బెట్టి సత మైనది చెన్నుఁడ వాపె చనవు చెల్లించ వయ్య యిట్టె […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

‘తాళ్ళపొద్దుటూరు’లో ఏమి జరుగుతోంది?

2004లో రిజర్వాయర్ తొలి సామర్థ్యం 16.850 TMC, మునక గ్రామాలు 14. 2007లో పెంచిన రిజర్వాయర్ సామర్థ్యం 26.85 TMC, మునక గ్రామాలు 22. ———————————- పులివెందుల నియోజకవర్గంలో ఎండిపోతున్న చీనీ చెట్లకు ఆరునెలల్లో నీళ్లిస్తామని, అంతవరకు తాను గడ్డం కూడా తియ్యనని శపథం చేసిన అప్పటి తెదేపా నాయకుడు, శాసనమండలి ఉపాధ్యక్షుడు (ఇప్పుడు కూడా ఈయన “అధికార పార్టీ”లోనే ఉన్నాడు) రెండుమూడేళ్ళుగా గడ్డంతోనే తిరుగుతున్నాడని జాలిపడి, గడ్డం తీయించడానికి తొందరపడి 2017లో గండికోట రిజర్వాయర్ నుంచి […]పూర్తి వివరాలు ...

రహదారులు సమాచారం

కడప జిల్లాలోని జాతీయ రహదారులు

జాతీయ రహదారులకు గతంలో ప్రాధాన్యతా క్రమంలో ఇస్తూ వచ్చిన నంబర్లలో ఏవో కొన్ని ప్రధానమైన జాతీయ రహదారుల నంబర్లు తప్ప మిగతావి కొంత గందరగోళంగా తయారయ్యాయనే చెప్పాలి. ఏదైనా ఒక జాతీయ రహదారిని తీసుకుని దానితో కలుస్తున్న లేదా దాన్నుంచి విడిపోయిన ఇతర జాతీయ రహదారుల నంబర్లేమిటని చూస్తే చాలా సందర్భాలలో అవి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండేవి. అందువల్ల గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమయ్యేది. దాంతో పదేండ్ల కిందట 2010లో రోడ్డు రవాణా & జాతీయ రహదారుల […]పూర్తి వివరాలు ...

కైఫియత్తులు చరిత్ర

పెద్దముడియం చరిత్ర

పెద్దముడియం కడప జిల్లాలోని ఒక మండల కేంద్రం. చాళుక్య సామ్రాజ్య స్థాపకుడు విష్ణువర్ధనుడు పుట్టిన ఊరు మన కడప జిల్లాలో ఉందని తెలుసా ? ఒక సారి పెద్దముడియం గ్రామం చరిత్ర చూడండి. పూర్వం త్రిలోచన మహారాజు ( ముక్కంటి కడువెట్టి ) గంగానదిలో స్నానం చేయడానికి కాశీ నగరానికి వెళ్ళినపుడు, చాలా మంది బ్రాహ్మణులు రాజు సహాయార్థం వేచి ఉంటారు. రాజు స్నానాదికాలు పూర్తి చేసుకున్న తర్వాత వారికి దానాలు చేస్తు ఉన్నపుడు, 18 గోత్రాలకి సంబధించిన […]పూర్తి వివరాలు ...

error: