వార్తా విభాగం

సంకీర్తనలు

వెలయునిన్నియును వృధా వృధా

॥పల్లవి॥వెలయునిన్నియును వృధా వృధాతలఁపున శ్రీహరిఁ దడసినను॥చ1॥ఎడయలేనిపుణ్యము లెన్నియైనావిడువక సేయుట వృధా వృధాబడిబడి నే శ్రీపతి నాత్మలోఁదడవక యితరము దడవినను॥చ2॥యెరవులతపముల నెంతైనావిరవిరవీఁగుట వృధా వృధాహరినచ్యుతుఁ బరమాత్మునినిమరచి తలఁచక మఱచినను॥చ3॥దైవము నెఱఁగక తమకమునవేవేలైన వృధా వృధాశ్రీవేంకటగిరిచెలువునినిసేవించక మతిఁ జెదరినను రాగము: రామక్రియ రేకు: 0014-02 సంపుటము: 1-84 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, రామక్రియపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

చెల్లుఁగా కిటు నీకే చింతింపఁగా పూరి –

॥పల్లవి॥చెల్లుఁగా కిటు నీకే చింతింపఁగా పూరి –పుల్ల మేరువుసేయ భూమిలో నిపుడు॥చ1॥చెలఁగి నే మునుసేసినచేఁత లుండఁగామలసి నేఁ దిరుగుతిమ్మట లుండఁగాతొలఁగఁదోసి తప్పుడుతోడనే లోహంబువెలయ బంగారుగావించినగతిని॥చ2॥బిగిసి నామైనున్న పెనుకట్లుండఁగాజగడగాండ్లు పగచాటఁగనుజిగిగలచేఁతిముసిఁడికాయయగునన్నుమొగిఁ గల్పకము ఫలముగఁ జేయవసమా॥చ3॥పొదిలిన యింద్రియంబులు వెంట రాఁగామదివికారము నే మరుగఁగానేవదలకు వేంకటేశ్వర నన్ను నిదే నీ –పదపంకజములు చేర్పఁగ నిది వసమా రాగము: ఆహిరి రేకు: 0030-01 సంపుటము: 1-182 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎందుఁ బొడమితిమో యెఱఁగము మా-

॥పల్లవి॥ఎందుఁ బొడమితిమో యెఱఁగము మా-కందువ శ్రీహరికరుణేకాకgo॥చ1॥ఏఁటిజన్మమో యెఱఁగము పర-మేఁటిదో నే మెఱఁగముగాఁటపుకమలజుఁ గాఁచినయీనాఁటకుఁడే మానమ్మినవిభుఁడు॥చ2॥యెవ్వారు వేల్పులో యెఱఁగము సురలెవ్వరో నే మెఱఁగమురవ్వగు శ్రీసతిరమణుఁడు మా-కవ్వనజోదరుఁ డంతరియామి॥చ3॥యింకానేఁటిదో యెఱఁగము యీ –యంకెలబాముల నలయముజంకెల దనుజులఁ జదిపినతిరు-వేంకటేశుఁడు మావిడువనివిభుఁడు రాగము: ముఖారి రేకు: 0014-01 సంపుటము: 1-83 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎంత విభవము గలిగె నంతయును నాపదని

॥పల్లవి॥ఎంత విభవము గలిగె నంతయును నాపదనిచింతించినది గదా చెడనిజీవనము॥చ1॥చలముఁ గోపంబుఁ దనుఁ జంపేటిపగతులనితెలిసినది యదిగదా తెలివితలకొన్నపరనింద తనపాలి మృత్యువనితొలఁగినది యదిగదా తుదగన్నఫలము॥చ2॥మెఱయు విషయములే తనమెడనున్నవురులుగాయెఱిఁగినది యదిగదా యెరుకపఱివోనియాస దనుఁ బట్టుకొను భూతమనివెఱచినది యదిగదా విజ్ఞానమహిమ॥చ3॥యెనలేని తిరువేంకటేశుఁడే దైవమనివినఁగలిగినదిగదా వినికిఅనయంబు నతని సేవానందపరులయిమనఁగలిగినదిగదా మనుజులకు మనికి రాగము: ధన్నాశి రేకు: 0029-06 సంపుటము: 1-181 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ధన్నాశిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పాపములే సంబళమెపుడూ యీ-

॥పల్లవి॥పాపములే సంబళమెపుడూ యీ-యాపదఁబడి నే నలసేనా॥చ1॥ఎన్నిపురాణము లెటువలె విన్నామన్న మనువు దిమ్మరితనమేనన్ను నేనే కానఁగలేనట నావిన్న వినుకులకు వెఱచేనా॥చ2॥యెందరు వెద్దల నెట్లఁ గొలిచినానిందల నామతి నిలిచీనాకందువెఱిఁగి చీకటికిఁ దొలఁగనటఅందపుఁబరమిఁక నందేనా॥చ3॥తిరువేంకటగిరిదేవుఁడే పరమనిదరి గని తెలివిఁక దాఁగీనాతిరముగ నినుఁ జింతించినచింతేనిరతము ముక్తికి నిధిగాదా రాగము: శంకరాభరణం రేకు: 0013-06 సంపుటము: 1-82 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శంకరాభరణంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

మనసున నెప్పుడు మానదిది

॥పల్లవి॥మనసున నెప్పుడు మానదిదిదిన బాధెటువలె దీఱీనో॥చ1॥చిత్త వికారము జీవుల పాపముతత్తరపరచక తడయ దిదికత్తులభొనీ కాయపు వయసున-నెత్తినమదమున కేదిగతో॥చ2॥అసలుఁగంబ మీయాశాదోషమువిసిగిన నూరక విడువ దిదివసులమూఁట మోవఁగఁ బడవేయఁగవసము గాని దెటువలెనౌనో॥చ3॥పాము చెలిమి రంపపుసంసారముగాములమోఁచిన గంప యిదికామించుచు వేంకటపతిఁ దలఁపకయేమరివుండిన నేమౌనో రాగము: లలిత రేకు: 0029-05 సంపుటము: 1-180 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, లలితపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అప్పులవారే అందరును

॥పల్లవి॥అప్పులవారే అందరునుకప్పఁగఁ దిప్పఁగఁ గర్తలు వేరీ॥చ1॥ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁజిక్కులు సిలుగులుఁ జింతలునేదిక్కెవ్వరు యీ తీదీపులలోదిక్కుముక్కులకు దేవుఁడెఁకాక॥చ2॥యేది దలంచిన నేకాలంబునుసూదులమూఁటల సుఖములివికాదన నౌననఁ గడ గనిపించఁగపోదికాఁడు తలఁపునఁ గలడొకఁడే॥చ3॥యెన్నఁడు వీడీ నెప్పుడు వాసీబన్నిన తమతమ బంధములువున్నతి సేయఁగ వొప్పులు నెరపఁగవెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు రాగము: దేసాళం రేకు: 0013-05 సంపుటము: 1-81 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, దేసాళంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అయ్యోపోయఁ బ్రాయముఁ గాలము

॥పల్లవి॥అయ్యోపోయఁ బ్రాయముఁ గాలముముయ్యంచు మనసున నే మోహమతినైతి॥చ1॥చుట్టంబులా తనకు సుతులుఁ గాంతలుఁ జెలులువట్టి యాసలఁ బెట్టువారే కాకనెట్టుకొని వీరు గడు నిజమనుచు హరి నాత్మఁబెట్టనేరక వృధా పిరివీకులైతి॥చ2॥తగుబంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులునువగలఁ బెట్టుచుఁ దిరుగువారే కాకమిగుల వీరలపొందు మేలనుచు హరినాత్మఁదగిలించ లేక చింతాపరుఁడనైతి॥చ3॥అంత హితులా తనకు నన్నలునుఁ దమ్ములునువంతువాసికిఁ బెనఁగువారే కాకఅంతరాత్ముఁడు శ్రీవేంకటాద్రీశుఁ గొలువ కిటుసంత కూటముల యలజడికి లోనైతి రాగము: సామంతం రేకు: 0029-04 సంపుటము: 1-179 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఆదిమపూరుషుఁ డచ్యుతుఁడచలుఁడనంతుఁడమలుఁడు

॥పల్లవి॥ఆదిమపూరుషుఁ డచ్యుతుఁడచలుఁడనంతుఁడమలుఁడుఆదేవుఁ డీతఁడేపోహరి వేంకటవిభుఁడుplavix prixopenplavix surveillance biologique॥చ1॥ఏకార్ణవమై ఉదకములేచిన బ్రహ్మాండములోఁబైకొని యుండఁగ నొక వటపత్రములోపలనుచేకొని పవళింపుచు నొక శిశువై వడిఁదేలాడిన-శ్రీకాంతుఁ డీతఁడేపో శ్రీవేంకటవిభుఁడు॥చ2॥అరుదుగ బలిమద మడఁపఁగ నాకసమంటిన రూపముసరుగన భూమింతయు నొక చరణంబున గొలచిపరగిన పాదాంగుటమున బ్రహ్మాండము నగిలించినపరమాత్ముఁ డీతఁడేపో పతి శ్రీవేంకటవిభుఁడు॥చ3॥క్షీరపయోనిధి లోపల శేషుఁడు పర్యంకముగాధారుణియును సిరియునుఁ బాదము లొత్తఁగనుచేరువఁదను బ్రహ్మాదులు సేవింపఁగఁ జెలుఁవొందెడినారాయణుఁ డితఁడే వున్నత వేంకటవిభుఁడు రాగము: శంకరాభరణం రేకు: 0013-04 సంపుటము: 1-80 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...

error: