వై.ఎస్.ఆర్ జిల్లాలోని మండల కేంద్రమైన సిద్ధవటంలో ఉన్న శత్రుదుర్భేద్యమైన కోట ఆ నాటి స్మృతులను నేటికీ కళ్లకు కట్టినట్టు ఆవిష్కరిస్తుంది. రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ సిద్ధవటం కోట మన చారిత్రక సంపదల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. పూర్వకాలంలో సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో సిద్ధులు ఎక్కువగా నివసిం చేవారట. వారు నివాసం ఉండే వట వృక్షాలు (మఱ్ఱి చెట్లు) విస్తారంగా ఉండేవట. అందుకే ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతుంటారు. […]పూర్తి వివరాలు ...
కడప : జిల్లాలోని పలు మండలాల్లో ఈనెల 16 నుంచి ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త మార్కారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.శిబిరాలకు వివిధ ఆసుపత్రులకు చెందిన ప్రత్యేక వైద్యులు హాజరై చికిత్సలు చేస్తారన్నారు.పూర్తి వివరాలు ...
లింగాల మండలం కోమన్నూతల గ్రామంలోని రెండు పోలింగ్ బూత్‌ల్లో టీడీపీకి 25ఓట్లు వచ్చాయి. … ఇటీవల ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబుపై రాళ్ళు విసిరి ఈ గ్రామస్తులు వార్తల్లోకెక్కారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు లింగాల మండలం కోమన్నూతల గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగన్ అవినీతిపై మాట్లాడుతుండగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాబు ప్రసంగానికి అడ్డుతగలడం, తెలుగు దేశం, వై.ఎస్.ఆర్ కార్యకర్తల మద్య మాటల యుద్దం,చంద్రబాబు వాడివాడి వాగ్దానాలు సందించడం తో రెచ్చిపోయిన […]పూర్తి వివరాలు ...
ఇంట గెలవని వారు రచ్చగెలుస్తారా అనేది సామెత. ఇక్కడ డీఎల్, మైసూరా మాత్రం సొంతింట్లో చీదరింపునకు గురయ్యారు. ఓటర్లు వారికి వ్యతిరేకంగా ఓట్లు వేసి తిరస్కరించారు. వారిద్దరూ తమ సొంత నియోజక వర్గాల్లో మెజారిటీ తెచ్చుకోకపోవటం అటుంచి కనీసం జగన్‌కు వచ్చిన ఓట్లకు దరిదాపుల్లో కూడా లేరు. మైదుకూరు నియోజకవర్గంలో డీఎల్‌కు 25,432 ఓట్లు వస్తే అదే నియోజక వర్గంలో జగన్‌కు 95,579 దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ కంటే 71,147 ఓట్లు ఆధిక్యం! తెదేపా అభ్యర్థి మైసూరాకు […]పూర్తి వివరాలు ...
కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభనియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సైకిల్ పంక్చర్ అయ్యింది. ఫ్యాన్ హోరుకు సైకిల్ ఎదురు నిలువలేకపోయింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రం తెదేపా నియోజకవర్గ బాధ్యులు రామసుబ్బారెడ్డి డిపాజిట్ దక్కే స్థాయిలో ఓట్లు సాధించగలిగారు. కడప, మైదుకూర్, బద్వేల్ నియోజకవర్గాల్లో తెదేపా అత్యంత దయనీయమైన స్థితికి పడిపోయింది.పూర్తి వివరాలు ...
పులివెందుల : పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఘన విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంతో కొనసాగిన విజయమ్మ ఆమె తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై 81వేల 373 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ విజయమ్మ భారీ మెజార్టీ సాధించి రికార్డు బద్దలుకొట్టారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన బిటెక్ రవి(ఎం.రవీంద్రనాధ్ రెడ్డి) […]పూర్తి వివరాలు ...
కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి రాష్ట్ర స్థాయిలో రికార్డు మెజార్టీతో ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిపై ఆయన భారీ ఆధిక్యత సాధించారు. జగన్మోహన్ రెడ్డి 545672 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయనకు అన్ని నియోజకవర్గాలలో అరవై వేలకు పైగా ఓట్ల మెజార్టీ రావడం విశేషం. కడప లోక్ సభ పరిధిలోని ఏడు […]పూర్తి వివరాలు ...
జిల్లాలోని లింగాల మండలం దొండ్లవాగు గ్రామానికి చెందిన చప్పిడి సుష్మారెడ్డి సివిల్స్‌లో 96వ ర్యాంకు సాధించారు. సుష్మా సోషియాలజి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక సబ్జెక్ట్‌లు ఎంచుకొని ఈ ర్యాంకు సాధించారు. కడప నిర్మల స్కూల్‌లో 9, నాగార్జున హైస్కూల్‌లో 10వ తరగతి చదువుకున్నారు. విజయవాడ నలంద కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి వరంగల్‌లో రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఇంజినీరింగ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనెజ్‌మెంట్‌ను కోల్‌కతాలో పూర్తిచేశారు. ప్రస్తుతం చెన్నయ్‌లో ఐఆర్‌ఎస్ ట్రైనింగ్ చేస్తున్నారు. సాధారణ కుటుంబంలో […]పూర్తి వివరాలు ...
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రెండు లక్షల మెజార్టీ వస్తే తమ ఆస్తులు రాసిస్తామని చెప్పిన మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్యే వీరశివారెడ్డి సవాలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెసేకు ఓటమి తధ్యం అని ప్రచారం ఊపందుకున్న ప్రస్తుత సమయంలో…ఆ సవాలుకు డీఎల్, వీరశివా కట్టుబడి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు. వారు ఉప్పూ, కారం తిని ఉంటే, చీము నెత్తురు, కడప పౌరుషం ఉంటే ఆస్తులు రాసిస్తామనే మాటకు కట్టుబడి […]పూర్తి వివరాలు ...