పులివెందుల: చిరంజీవి పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నసందర్భంలో కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ డి.ఎల్.రవీంద్రరెడ్డి గురించి ప్రస్తావిస్తుండగా ప్రజలనుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయింది.కొందరు కోడిగుడ్లు చెప్పులు విసిరారు. వై.ఎస్.కు డి.ఎల్ సన్నిహితుడని చెప్పబోతుండగా జనం దానికి నిరసనగా చేతులు ఊపుతూ కనిపించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.పోలీసులు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు చెందినకార్యకర్తలు ఈ పని చేశారని భావించి వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. పులివెందుల రోడ్ షోలో జరిగిన ఈ ఘటన కారణంగా కొంత ఉద్రిక్తత […]పూర్తి వివరాలు ...
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే ప్రకటించినట్లు ఉప ఎన్నికలు సోనియా- వైఎస్ రాజశేఖరరెడ్డి మధ్య జరుగుతు న్నాయా?… సోనియా, రాహుల్ ఫొటోలు పెడితే ఓట్లు పడవని కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్ధి భయపడుతున్నారా? సోనియా కంటే వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోకే ఎక్కువ ఓట్లు పడతాయని భావిస్తున్నారా? తాజాగా జరుగుతున్న ప్రచార తీరు గమనిస్తే ఈ అనుమానం నిజమనిపించక తప్పదు. కడప జిల్లాలో జరుగుతున్న పార్లమెం టు- శాసనసభ ఉప ఎన్నికల ప్రచారంలో సోని యా- […]పూర్తి వివరాలు ...
కడపలో గాంధీజీ విశ్రాంతి తీసుకుంటున్న రోజున (1934(౧౯౩౪) జనవరి 1 (౧)) కొందరు స్థానిక హరిజనులు ఆయనను కలుసుకొని వివిధ విధాలైన అంతరాలతో ఉన్న వర్ణ వ్యవస్తను గురించి సంభాషించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఆ సంభాషణ కడప జిల్లా హరిజనుల చైతన్యాన్ని, ముక్కుసూటితనాన్ని వ్యక్తీకరించింది. గాంధీజీకి, కడప హరిజన మిత్రులకు మధ్య జరిగిన ఆ సంభాషణ మీ కోసం … హరిజన మిత్రులు: నేటి వర్ణ వ్యవస్థ ఉండవలెనని మీ అభిప్రాయమా? పోవలెనని అభిప్రాయమా? గాంధీజీ: […]పూర్తి వివరాలు ...
ఋషులదెట్టి జాతి ఇంపుగా వెలసిన బ్రహ్మకిష్టులైరి బ్రహ్మలైరి తుదిని ఎవ్వరైన సొదమునుటేనయా! విశ్వదాభిరామ వినురవేమ ఋషులకు కూడా కులభేదాలు అంటగడితే ఎలా? అంటున్నాడు వేమన ఈ పద్యంలో. ఋషుల కులం, వంశం, తెగ, వర్గం, పుట్టుక లాంటి వాటిని గురించి ఆలోచించడం శుద్ధ అనవసరం.పూర్తి వివరాలు ...
జిల్లాలో ప్రచారం చేస్తున్న తెదేపా నాయకులకు జిల్లా ప్రజానీకం తరపున కొన్ని ప్రశ్నలు. 1.పోతిరెడ్డిపాడు నీళ్లన్నీ కడపకు తరలించుకుపోతున్నారంటూ తెదేపా నాయకులు ఆరోపణలు చేసిన విషయం వాస్తవం కాదా? 2.ఆ రోజు తెదేపా తరపున కడప పై అక్కసు వెళ్ళగక్కిన (ఉదా: రేవంత్ రెడ్డి, దేవినేని ఉమ, యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు…) నేతలే ఇవాళ జిల్లాలో ప్రచారం చేయటం విడ్డూరం కాదా? 3.ఆ రోజు కడప జిల్లా అభివృద్ధిని దోపిడీతో పోల్చిన ఈ తెదేపా నాయకులు జిల్లాలో […]పూర్తి వివరాలు ...
కడప : ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయమ్మలకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఎంపీ సబ్బం హరి కడపకు రానున్నారు. ఇప్పటికే ఆయన జగన్‌కు మద్దతుగా ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నా…ఎన్నికలు సమీపించేముందు వాతావరణాన్ని మరింత వేడెక్కించాలని ఆయన భావించారు. జగన్, విజయమ్మలకు ఫ్యాన్‌గుర్తు వచ్చిన శుభసందర్భంలో శుక్రవారం ఆయన కడపకు ప్రయాణం కానున్నారు.పూర్తి వివరాలు ...
హైదరాబాద్: కడప లోకసభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ‘సీలింగ్ ఫ్యాన్’ను ఎన్నికల కమిషన్ కేటాయించింది. దాంతో జగన్, వైఎస్ విజయమ్మలకు కామన్ సింబల్ లభించింది. ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కేటాయించడం పట్ల వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.పూర్తి వివరాలు ...
పోరుమామిళ్ల: రాష్ట్రంలో రెండవ సారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానకి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషే కారణమంటే ఒప్పుకోనని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి కృషి ప్రభుత్వ ఏర్పాటులో ఎంతైనా ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి మహిధర్ రెడ్డి అన్నారు. బుధవారం పోరుమామిళ్ల పట్టణంలోని మాజీ శాసన సభ్యుడు వి శివరామక్రిష్ణారావు స్వగృహంలో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో బద్వేలు తాలుకా ఎన్నికల ఇన్‌ఛార్జిగా రాలేదని నాయకుల మధ్య సమన్వయ కర్తగా మాత్రమేవచ్చానన్నారు. ప్రస్తుతం ఏ పార్టీకి […]పూర్తి వివరాలు ...
కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఒక్కొక్క గండాన్ని అధిగమించి ముందుకు సాగుతున్నారు. కడప పార్లమెంట్ సీటుకు రాజీనామా చేసినప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాటన్నింటిని ఎదుర్కొంటూ జగన్ నామినేషన్ ఘట్టానికి చేరుకున్నారు. ఆయన నామినేషన్ల సందర్బంగా సమర్పించిన అఫిడవిట్‌లో తప్పులున్నాయంటూ ఆయన ప్రత్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. అనేక ఆస్తులను ఆయన చూపించలేదని అందువల్ల ఆయన్ని ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేకుండా అనర్హుణ్ని చేయాలని వారు డిమాండ్ చేశారు.పూర్తి వివరాలు ...