వార్తా విభాగం

ప్రసిద్ధులు వ్యాసాలు

కార్వేటినగరం ఓ మధుర జ్ఞాపకం – నటి టి.జి.కమలాదేవి

[divider](తవ్వా విజయ భాస్కర రెడ్డి, ఐ. ప్రవీణ్ కుమార్)  తెలుగు సినీ పరిశ్రమలో అప్పటికీ , ఇప్పటికీ నటీనటుల అనుబంధాల్లో అనేక మార్పులు వచ్చాయని సీనియర్‌ నటి టిజి కమలాదేవి పేర్కొన్నారు. మారిన సినీ వాతావరణంలో తాను ఇమడలేకపోయానని, అందుకే క్రీడలపైనా, నాటకాల పైనా ఏకాగ్రత చూపానని ఆమె చెప్పారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘నా బాల్యం’ శీర్షిక కోసం కమలాదేవిని చెన్నైలోని ఆమె నివాసంలో కలిసినపుడు ఆమె తన బాల్య  స్మృతులను ఇలా పంచుకున్నారు….పూర్తి వివరాలు ...

వార్తలు

కేసీ కెనాల్ ఆయకట్టు పరిరక్షణ సమితి ఏర్పాటు

జీవో 233 రద్దుకు  డిమాండ్ నంద్యాల : కర్నూలు – కడప సాగునీటి కెనాల్ (కేసీ) దుస్థితిపై ఆయకట్టు రైతులు గళమెత్తారు. గురువారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమాఖ్య, కర్నూలు జిల్లా వరి ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కేసీ కెనాల్ సాగునీటి భవితవ్యంపై రైతు సదస్సు నిర్వహించారు. రైతుసంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి కర్నూలు, కడప జిల్లాలకు చెందిన వివిధ రైతు సంఘాల నాయకులు, రైతులు […]పూర్తి వివరాలు ...

చరిత్ర ప్రత్యేక వార్తలు

కడప జిల్లాలో బృహత్ శిలాయుగంనాటి ఆనవాళ్లు

కడప: వైఎస్సార్ కడప జిల్లాలో బృహత్ శిలాయుగం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. జిల్లాలోని సుండుపల్లె మండలం రాయవరం పంచాయతీ పరిధిలోని దేవాండ్లపల్లికి ఉత్తరాన మూడు కిలోమీటర్ల దూరంలో బృహత్ శిలాయుగం నాటి సమాధులు బయటపడ్డాయి. ఇవి క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నాటివని భావిస్తున్నారు. దాదాపు 20 బృహత్ శిలాయుగం సమాధులను దేవాండ్లపల్లి వద్ద యోగివేమన విశ్వవిద్యాలయం అధ్యాపక బృందం గుర్తించింది. యోగివేమన విశ్వవిద్యాలయానికి చెందిన చరిత్ర, పురావస్తు, భూగర్భశాస్త్ర శాఖల ప్రొఫెసర్లు చాలా కాలంగా బృహత్ శిలాయుగం […]పూర్తి వివరాలు ...

సమాచారం

మా కడప జిల్లాలో వాడుకలో ఉండిన కొలతలు

అలనాడు కడప జిల్లాలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఆంగ్ల ప్రామాణిక కొలతల స్థానంలో స్థానికమైన ప్రత్యేకమైన కొలతలు వినియోగించేవారు. ఆర్ధిక సరళీకరణలు/ప్రపంచీకరణ మొదలయ్యే (1991 ) వరకు కూడా జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈ స్థానిక కొలతలు వినియోగంలో ఉండేవి. ప్రసార, ప్రచార మాధ్యమాల ఉధృతి కారణంగా మాండలిక సొబగులలో భాగమైన ఈ పదాలు (కొలతలు) కనుమరుగయ్యాయి. ఇప్పటికీ అక్కడక్కడా ముసలి వారు ఈ పదాలను ఉచ్చరించటం కన్పిస్తుంది. స్థానికత, కడప మాండలికం ఉట్టిపడే ఆ కొలతల […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

తిరువీధుల మెరసీ దేవదేవుడు – అన్నమాచార్య సంకీర్తన

తిరువీధుల మెరసీ దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను ….. తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు  సిరుల రెండవనాడు శేషుని మీద మురిపాల మూడవనాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగవనాడు పువ్వుగోవిలలోను …….. గ్రక్కుననైదవనాడు గరుడునిమీద యెక్కెనునారవనాడు యేనుగుమీద చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను యిక్కువదేరును గుఱ్ర మెనిమిదవనాడు ……. కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు పెనచి పదోనాడు పెండ్లిపీట యెనసి శ్రీవేంకటెశు డింతి యలమేల్మంగతో వనితల నడుమను వాయనాలమీదను….పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పెదయౌబళపు కొండ పెరిగీనిదే – అన్నమాచార్య సంకీర్తన

పెదయౌబళపు కొండ పెరిగీనిదే వదలకకొలిచితే వరములిచ్చీని పదివేలశిరసుల పలునరసింహము గుదిగొన్న చేతుల గురుతైనది ఎదుటపాదాలు కన్నులెన్నైన కలిగినది యిది బ్రహ్మాండపుగుహ నిరవైనది ఘనశంఖచక్రాదుల కైదువలతోనున్నది మొనసి రాకాసి మొకములగొట్టేది కనకపుదైత్యుని కడుపుచించినది తనునమ్మిన ప్రహ్లాదుదాపును దండైనది శ్రీవనిత తొడమీద జేకొని నిలిపినది దేవతలు గొలువ గద్దెపై నున్నది శ్రీవేంకటాద్రియందుఁజెలగి భోగించేది భావించి చూచితేను పరబ్రహ్మమైనదిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇటు గరుడని నీ వెక్కినను – అన్నమాచార్య సంకీర్తన

composer : Rallapalli Ananta krishna sarma , kedara ragam ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గన బగిలె  ఎగసినగరుడని యేపున’ధా’యని జిగిదొలకచబుకు చేసినను నిగమాంతంబులు నిగమసంఘములు బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు గోపించినను సరుస నిఖిలములు జర్జరితములై తిరువున నలుగడ దిరదిర దిరిగెపూర్తి వివరాలు ...

కథలు

యీటి రంగే పచ్చనేమో సామీ! (కథ) – యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి

మాయింట్లో నువాక్రాను, మోనోక్రోటోపాసు, ఎండ్రీను డబ్బాలు శానా వుండేటియ్యి. వంకాయలు, బెండకాయలూ పండిస్తా వున్యాములే. వాఁటితోపాటు జాలాట్లో నాలుగు టమాటాచెట్లు, గెనాల మింద గోగాకు, చిన్న పెడలో మిరపజెట్లు గూడా. అప్పుడు మాయింట్లో కూరలేం జేచ్చాన్యామో మల్లా జెప్పాల్నా! నూనొంకాయ, వంకాయపులుసు, బెండకాయపులుసు, వంకాయ్ తాళింపు, బెండకాయ్ తాళింపు, వంకాయ-బెండకాయ-టమాటా పుల్లగూర, టమాటాగుజ్జు, గోగాకు ఊరిమిండి, అన్నీ కలిపికొట్టి యింగో పుల్లగూరా, యిట్ట యెన్నిజేసినా నాకు మాత్రం యిష్టంగా ముద్ద దిగేదిగాదు. అన్నిట్లో వం, బెం, టం, […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘ఎంజే’ ఇక లేరు

మైదుకూరు : పేద ప్రజల గొంతుక  తానై నిరుపేదల, కార్మికుల, మహిళల హక్కులకోసం వారి పక్షాన అవిశ్రాంత పోరు సల్పిన రాయలసీమ పౌరహక్కుల సంఘం కన్వీనర్ ఎంజే సుబ్బరామిరెడ్డి(60) గురువారం కన్నుమూశారు. వీరు ఎంజేగా సుపరిచితులు. నమ్మిన సిద్ధాంతాల కోసం బతికిన ఎంజే మరణించాడన్న వార్త అయన సన్నిహితులకే కాక, రైతులు, పేద ప్రజలందరినీ కలతకు గురిచేసింది. రెండు వారాల కిందట రేణిగుంట రైల్వే స్టేషన్‌లో  గాయపడిన ఎంజే స్విమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.పూర్తి వివరాలు ...

error: