ఈ ఊరు కడప జిల్లా సిద్దవటం తాలూకాలో లో వుంది. అన్నమయ్య మేనమామ గారి ఊరు మాడుపూరు.ఇక్కడి స్వామి చెన్న కేశవ స్వామి. అన్నమయ్య సంకీర్తనలపై పరిశోధన చేసిన శ్రీ మల్లెల శ్రీహరి గారు మాడుపూరు చేన్నకేశవునిపై ఇదొక్క సంకీర్తన మాత్రమె అందుబాటులో ఉన్నట్లు తేల్చారు.పూర్తి వివరాలు ...
అన్నమాచార్యుని గురించి ఆయన మనవడు తాళ్లపాక చినతిరుమలాచార్య రాసిన సంకీర్తన ఇది … రాగం-సాళంగనాఁట ప : అప్పనివరప్రసాది అన్నమయ్యా అప్పసము మాకె కలఁ డన్నమయ్యా చ : అంతటికి నేలికైన ఆదినారాయణుఁ దన యంతరంగాన నిలిపీ నన్నమయ్యా సంతసానఁ జెలువొందె సనకసనందనాదు లంతటివాఁడు తాళ్ళపా కన్నమయ్యా &పూర్తి వివరాలు ...
నాటక, సినిమా రంగాలలో మేటి నటిగా, వితరణశీలిగా పేరుగాంచిన పసుపులేటి కన్నాంబ జన్మదినం గురించి విభిన్న అభిప్రాయాలుండేవి. కొందరు 1910 అని, కొందరు 1912, 1913 అని రాశారు. 1949 అక్టోబర్‌లో, పెనుపాదం, ఆమెతో జరిపిన ఇంటర్వ్యూలో కన్నాంబ 1911- అక్టోబర్ 5వ తేదీ అని తేల్చారు. ఆమె కోడలు కళావతి, కన్నాంబ జీవిత విశేషాలను విశదపరచారు. కన్నాంబ, కడపలో లోకాంబ, వెంకట్రామయ్య గార్లకు జన్మించారు. వెంకట్రామయ్య ప్రభుత్వ గుత్తేదారు. ఆ దంపతుల ఏకైక సంతానమైన కన్నాంబ, […]పూర్తి వివరాలు ...
పాతాళభైరవి… మాయాబజార్… మిస్సమ్మ… జగదేకవీరుని కథ… గుండమ్మ కథ…. ఈ అయిదు సినిమాలూ మనకు రాలేదనే అనుకుందాం. అప్పుడేంటి పరిస్థితి? జస్ట్! ఒక్కసారి ఊహించుకోండి. కిరీటం కోల్పోయిన ఛత్రపతిలా, జాబిల్లి లేని గగనంలా, పరిమళం తెలియని జాజిపూల మాలలా… తెలుగు సినిమా కనిపించదూ! ఎవరైనా ఒక్క మేలు చేస్తేనే మనం గుండెల్లో పెట్టి పూజించేసుకుంటాం. మరి ఇంత మేలు చేసిన బి.నాగిరెడ్డి రుణం ఎలా తీర్చుకోవాలి? ఓ విజయా సంస్థనీ- ఓ చందమామనీ – తెలుగు సినిమాకి […]పూర్తి వివరాలు ...
అన్నమాచార్యుడు – తొలి తెలుగు వాగ్గేయ కారుడు, పద కవితా పితామహుడు. బాషలో, భావంలో- విలక్షణత్వాన్ని, వినూత్నత్వాన్నీ చేర్చి పాటకు ప్రాణ ప్రతిష్ట చేసినాడు. తన పల్లవీ చరణాలతో వేంకటపతిని దర్శించిన అన్నమయ్య ఒంటిమిట్ట కోదండ రామయ్యను ఇలా కీర్తిస్తున్నాడు.. జయ జయ రామా సమరవిజయ రామా భయహర నిజభక్తపారీణ రామా జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా అలసుగ్రీవునేలినాయోధ్యరామాపూర్తి వివరాలు ...
Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మిక సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించినాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించినాడు. కడప గడపలో నడయాడిన ఆ భాగవతోత్తముడు దేవుని కడప […]పూర్తి వివరాలు ...
కడప : ప్రొద్దుటూరు పట్టణంలో నవంబరు 2వ వారంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన (Science fair) నిర్వహించనున్నట్లు డీఈవో కె.అంజయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాదు ఎస్‌సీఈఆర్‌టీ డైరక్టర్ నవంబరు 2వ వారంలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించాలని ఆదేశించారన్నారు. కావున ప్రధానోపాధ్యాయులందరూ వారి పాఠశాలల నుంచి ఒక ఉపాధ్యాయుడిని, ఇద్దరు విద్యార్థులను, ఒక ఎగ్జిబిట్‌తో పంపాలని కోరారు.పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: జిల్లా అభివృద్ధికి, తాగునీటి ఎద్దడి నివారణకు కావాల్సిన నిధులను మంజూరు చేయాలని జిల్లాలోని ముగ్గురు మంత్రులమయిన సీ.రామచంద్రయ్య, అహ్మదుల్లా, తాను ఎన్నో సార్లు కలిసి విన్నవించినా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించడంలేదని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు. తమిళనాడు గవర్నర్ రోశయ్యను కలిసేందుకు శుక్రవారం ప్రొద్దుటూరుకు వచ్చిన డీఎల్ ఈ మ్లేరకు విలేకరులతో మాట్లాడారు.పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారికి చేయించిన వజ్రకిరీట సంప్రోక్షణ కార్యక్రమంలో శుక్తరవారం తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. 10.50 గంటలకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రొద్దుటూరు చేరుకున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఇతర ప్రముఖులు ఆయనకు హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు.పూర్తి వివరాలు ...