వార్తా విభాగం

వార్తలు

ఈ రోజే మున్సి’పోల్స్’

కడప జిల్లాలో నేడు నగర పాలకం, పురపాలకంలో ఎన్నికల జరగనున్నాయి. కడప నగర పాలకంలో 50 డివిజన్లలో 311 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున 47 మంది, వైకాపా తరపున 50 మంది, సిపియం తరపున 12 మంది, బిజెపి తరపున 7మంది, సిపిఐ తరపున ఇరువురు, కాంగ్రెస్ తరపున 8 మంది, ఎంఐఎం, బిఎస్‌పి, లోక్‌సత్తా, స్వతంత్ర అభ్యర్థులను కలుపుకొని 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కడప నగర పాలకంలో […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు రాజకీయాలు

కడప జిల్లాపై బాబు గారి చిన్నచూపు

చంద్రాబాబు నాయుడు – ఉమ్మడి ఆం.ప్ర రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా – పదేళ్లు ప్రతిపక్ష నేతగా వెలిగిన వ్యక్తి. తెదేపాను కనుసైగతో శాసించగలిగిన తిరుగులేని సారధి. ఈ పందొమ్మిదేళ్ళ బాబు గారి హయాంలో వారి సారధ్యంలోని తెదేపా ద్వారా కడప జిల్లాకు ఒనగూరిన గుర్తుంచుకోదగిన ప్రయోజనాలు ఇవీ. వీటిల్లో సిమెంటు రోడ్లు వెయ్యటం, ఇంకుడు గుంటలు తవ్వటం, నిధులివ్వకుండా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చెయ్యటం, కాలువలు ఆధునీకరించడం లాంటి పెద్ద పెద్ద పనులు గుర్తుకొస్తాయి – బహుశా ఇవన్నీ […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

ఎంపీ టికెట్ ఇస్తే నిధుల వరద పారిస్తా!

ఇటీవలే కాంగ్రెస్ నుండి తరిగి తెలుగుదేశంలో చేరిన కందుల రాజమోహన్‌రెడ్డి కడప లోక్‌సభ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా  పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తెదేపా అధినేత చంద్రబాబును కలిసి ఈ విషయమై విన్నవించినట్లు ఆయన తెలిపారు. కడపలోని తన ఇంట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మంచి నాయకుడు అవసరమన్నారు. బాబు సిఎం అయితే రాష్ట్రాభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం రాజకీయాలు

సదువుకుంటే వైకాపాకు ఓటేయొద్దా!

ఎన్నికల పోరు సమీపిస్తున్న సందర్భంలో రాజకీయాలపై, పరిణామాలపై ఆసక్తి కాస్త అధికంగానే ఉంటుంది. టీ టైములో లేదా భోజన సమయంలో కలిసినప్పుడు సహోద్యోగుల మధ్య రాజకీయ చర్చలు నడవటం సర్వసాధారణం. ఈ చర్చలలో ఒక్కొక్కరివి ఒక్కో అంచనాలు. ఒక్కొక్కరివి ఒక్కో రకమైన అభిప్రాయాలు. ఈ మధ్య కాలంలో ఒక వింతైన, గమ్మత్తైన వాదన ఒకటి మేధావులుగా  చలామణీ అవుతున్న ఒక వర్గం నోట   తరచూ  వినిపిస్తోంది  – అదేమంటే  ‘సదువుకున్న వాళ్ళెవరైనా వైకాపాకు ఓటేస్తారా?’ అని. ఇంకొంచెం గట్టిగా […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు వార్తలు

అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు ప్రారంభం

సంకీర్తనాచార్యులు అన్నమయ్య 511వ వర్థంతి ఉత్సవాలు గురువారం ఆయన జన్మస్థలి తాళ్లపాక గ్రామం (రాజంపేట మండలం)లో తితిదే ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య ధ్యానమందిరంలో గోష్టి గానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నమయ్య చిత్రపటాన్ని గ్రామ పురవీధుల్లో వూరేగించారు. అంతకు ముందు అన్నమయ్య మూలవిరాట్ వద్ద గ్రామపెద్దలు, తితిదే అధికారులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. చివరగా నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తితిదే అధికారులు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

బాబు పాలనలో ప్రజలకు ఇక్కట్లు

తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారని వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుర్తు చేశారు. నాటి పాలనలో విసిగిపోయే వైఎస్‌కు అధికారం అప్పగించి.. ఎన్నో మేళ్లు పొందారని ఆమె కడపలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వివరించారు. వివిధ కూడళ్లలో ఆమె రోడ్‌షోలు నిర్వహించారు. బిల్టప్, రామకృష్ణ పాఠశాల కూడలి, చెన్నూరు బస్టాండు, కృష్ణ చిత్రమందిరం, అప్సర కూడలి, ఆలంఖాన్‌పల్లెలో కార్యక్రమం కొనసాగించారు. ఆయా ప్రాంతాల్లో ఆమె చంద్రబాబుపై గురిపెట్టి ప్రసంగించారు. తెదేపా వ్యవస్థాపకుడు […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

రేపటి నుండి నారాయణస్వామి శతారాధనోత్సవాలు

ఈనెల 27,28 తేదీలలో (గురు,శుక్రవారాలలో) బ్రహ్మంగారిమఠం మండలంలోని ఓబులరాజుపల్లె నారాయణస్వామి 100వ ఆరాధనోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మంగారిమఠంలోని సాలమ్మ మఠం, బొమ్మువారి మఠాలలో ఈ ఆరాధనోత్సవాలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు ఈ ఆరాధనోత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదానం, సంస్కృతిక,ఆధ్యాత్మిక కార్యక్రమాలను, భజనలను నిర్వహిస్తున్నారు. బ్రహ్మంగారి మఠం సమీపంలోని శ్రీ నారాయణ స్వామి మఠం ఆధ్యాత్మిక భావనలతో వెలుగొందింది. కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం మిట్టపల్లె, గంగిరెడ్డిపల్లె గ్రామంలో నర్రెడ్డి గంగిరెడ్డి, రామాంబ దంపతులకు 1834 లో […]పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు

విజయానంద్ ఐఏఎస్

1992వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కె విజయానంద్ వివరాలు. విజయానంద్ కడపజిల్లా, రాజుపాలెంకు చెందినవారు. ఎంటెక్ పట్టభద్రుడైన విజయానంద్ యొక్క పూర్తి వివరాలు - ఫోటోల సహితంగా. పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు

జవహర్‌రెడ్డి ఐఏఎస్

పేరు : జవహర్‌రెడ్డి కె.ఎస్ పుట్టిన తేదీ : 02/06/1964 వయస్సు : 49 సంవత్సరాల 9 నెలలా 28 రోజులు (ఈ రోజుకి) తల్లిదండ్రులు : కీ.శే కె.ఎస్ ఈశ్వరరెడ్డి, కీ.శే కె.ఎస్ లక్ష్మీదేవమ్మ విద్యార్హత : పశువైద్య శాస్త్ర పట్టభద్రులు  (శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం) స్వస్థలం : కొండాపురం (కడప జిల్లా) వృత్తి : ఐఏఎస్ అధికారి (1990 బ్యాచ్) ప్రస్తుత హోదా : ముఖ్య కార్యదర్శి, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ నిర్వహించిన హోదాలు : 14/10/2009 – మార్చి 2014 వరకు కార్యదర్శి – ఆం.ప్ర ముఖ్యమంత్రి కార్యాలయం […]పూర్తి వివరాలు ...

error: