జిల్లాలో 20.75 లక్షల ఓటర్లున్నారు.త్వరలో జిల్లా వ్యాప్తంగా పురపాలక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 30 శాతంగా ఉన్న యువతరం ఓట్లు మన నేతల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. తొలుత కడప కార్పొరేషన్ , పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి, బద్వేలు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. కడప పార్లమెంట్ పరిధిలో కడప కార్పొరేషన్‌తోపాటు పులివెందుల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు , బద్వేలు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.. ఇక అసెంబ్లీల వారీగా వస్తే బద్వేలు […]పూర్తి వివరాలు ...
చాపాడు మండలంలోని పల్లెల వివరాలు – గణాంకాలు మరియు చాయాచిత్రాల (ఫోటోల) సహితంగా. ఒక్కో గ్రామానికి సంబందించిన చరిత్ర, సంస్కృతి, వ్యక్తులు మరియు దర్శనీయ స్థలాల వివరాలు. ఆయా గ్రామాల పేర్ల పైన క్లిక్ చెయ్యడం ద్వారా సదరు గ్రామ వివరాలు చూడవచ్చు. [feed url=”https://kadapa.info/villages/category/chapadu/feed/” number=”30″ ] కడప జిల్లాలోని మిగతా గ్రామాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.పూర్తి వివరాలు ...
భీమవరం బుల్లోడు చిత్ర యూనిట్ శుక్రవారం కడపకు వచ్చింది. స్థానిక రవి థియేటర్‌లో వారు అభిమానులతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర నటీ నటులు సునీల్, ఎస్తేర్ డ్యాన్స్ చేసి అలరించారు. ఈ సందర్భంగా అభిమానుల నుండి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు పోలీసులు చిత్ర యూనిట్ కు భద్రత కల్పించారు.పూర్తి వివరాలు ...
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే వెనుకబడిన రాయలసీమ అదే వెనుకబాటుతనాన్ని నేటిదాకా భరించక తప్పింది గాదు. ఈ సమైక్య ద్రోహం నుంచీ బయటపడటానికి మార్గం ఏమిటి?… సీమాంధ్ర కాదు. రాయల తెలంగాణ కాదు. మరి ప్రత్యేక రాయలసీమా? ఔను! మూడు వందల టీఎంసీల జల రాయలసీమ మాత్రమే!! సమైక్యాంధ్ర ఉద్యమం తెలంగాణ వేర్పాటువాదానికి వ్యతిరేకమైన ఉద్యమం. ప్రపంచంలో ఉద్యమాలు అనేకం ఉన్నాయి గానీ సమైక్యాంధ్ర వంటి ప్రతి ఉద్యమం ఎక్కడా కనబడదు. సమైక్యాంధ్ర ఉద్యమం లేకుండా, తెలంగాణ ఉద్యమం […]పూర్తి వివరాలు ...
ప్రపంచంలోనే అరుదైన కలివికోడి కదలికలను గుర్తించేందుకు సిద్దవటం రేంజీకి అదనంగా మరో 46 డిజిటల్ కెమేరాలు మంజూరయ్యాయి. వీటిని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ అమెరికాలో కొనుగోలు చేసిందని, ఆ విదేశీ కెమేరాలను ఇక్కడకు తీసుకొచ్చేందుకు అటవీశాఖ సిబ్బంది గురువారం ముంబైలోని బీఎన్‌హెచ్ఎస్‌కు వెళ్లారని సిద్దవటం రేంజి అటవీక్షేత్రాధికారి సుబ్బరాయుడు తెలిపారు. కలివికోడి కదలికలను గుర్తించేందుకు ఇప్పటికే 50 డిజిటల్ కెమేరాలు రెడ్డిపల్లి చుట్టుపక్కల గ్రామాలలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే!.పూర్తి వివరాలు ...
నిన్నటి వరకు తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో, తెలంగాణా సంస్కృతి పేరుతొ ఉద్యమం చేపట్టిన గులాబీ దళపతి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గద్వాల్ లో సీమ సంస్కృతిని కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేయడం గమనార్హం! మాజీ మంత్రి డికె అరుణ ప్రాతినిద్యం వహిస్తున్న గద్వాలలో ఆమెకు సమీప బందువైన కృష్ణమోహన్ రెడ్డిని అబ్యర్ధిగా ప్రకటించిన కచరా గద్వాలలో రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతి ఉందని,అది పోవాలని అన్నారు. అంతే కాకుండా కెసిఆర్ దెబ్బ ఏమిటో చూపిస్తా..ఆర్.డి.ఎస్.ద్వారా కావాల్సినంత నీరు […]పూర్తి వివరాలు ...
తెలుగువారి ఆత్మగౌరవం కోసం కొత్త పార్టీని పెడుతున్నామని రాయలసీమకే చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలుగువారి కి అవమానాలు ఎదురైతే ఎదుర్కోవడమే తమ పార్టీ లక్ష్యమని కిరణ్ అన్నారు. పన్నెండో తేదీ సాయంత్రం రాజమండ్రిలో సభ పెట్టి పార్టీ విధానాలను ప్రకటిస్తామని కిరణ్ అన్నారు.తన జీవితం తెరచిన పుస్తకం అని అన్నారు.తనపై ఆరోపణలను రుజువు చేయాలని కిరణ్ సవాల్ చేశారు.అన్ని నిబంధల ప్రకారమే జరిగాయని అన్నారు. రాయలసీమకే చెందిన జగన్, చంద్రబాబులు ఇప్పటికే […]పూర్తి వివరాలు ...
27న కడపలో ప్రజాగర్జన నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో 27న ప్రజాగర్జన నిర్వహించడం వల్ల ఎన్నికల్లో లాభిస్తుందని తెదేపా నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు హాజరయ్యే గర్జనకు భారీ ఎత్తున జన సమీకరణ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజాగర్జన సభలో చేరతారా, లేక అంతకుముందే సైకిలెక్కుతారా అన్నది తెలియాల్సి ఉంది.పూర్తి వివరాలు ...
డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (20.10.1925-28.02.2014) ఇవాళ ఒక లెజెండ్ మాత్రమే కాదు సెలబ్రిటీ కూడా. ఈ రెండు నిర్వచనాలకు ఆయన తగిన వారనడంలో కొంచెమైనా అతిశయోక్తి లేదు. వేమనను సీపీ బ్రౌన్ వెలుగులోకి తెస్తే, సీపీ బ్రౌన్‌ను జానమద్ది వెలుగులోకి తెచ్చారు. కడపలోని తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగా వచ్చిన బ్రౌన్ తెలుగు సాహిత్యానికి సేవ చేసి తెలుగు సూర్యుడిగా ప్రసిద్ధుడైతే బ్రౌన్‌ను వెలుగులోకి తెచ్చిన జానమద్ది సాహితీ సూర్యుడిగా ప్రసిద్ధి చెందాడు. సీపీ బ్రౌన్ జీవితం, […]పూర్తి వివరాలు ...