వార్తా విభాగం

చరిత్ర

కడప ప్రాంత శాసనాలలో రాయల కాలపు చరిత్ర !

విజయనగర చరిత్రలో కడప ప్రాంతానికి కూడా విశిష్టమైన స్థానం ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వివిధ చోట్ల లభించిన శాసనాల వల్ల అవగతం అవుతోంది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన గండికోట సీమ, సిద్దవటం సీమ, ములికినాటి సీమ, సకిలిసీమ ప్రాంతాలలోని దేవాలయాలూ, బురుజులూ, శాసనాలూ, కైఫీయతుల ద్వారా కడప జిల్లా చారిత్రక విశేషాలు వెలుగుచూస్తున్నాయి. సాహితీ సమరాంగణ చక్రవర్తిగా చరిత్రకెక్కిన శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ప్రస్తుత కడప ప్రాంతం రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రధాన భూమికను పోషించింది. కడప ప్రాంతంలో లభించిన […]పూర్తి వివరాలు ...

వార్తలు

జిల్లాలో నేరాల సంఖ్య తగ్గుముఖం

కడప: జిల్లాలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ఇది శుభపరిణామమని జైళ్ల శాఖ రీజియన్ డీఐజీ జయవర్దన్ అన్నారు. మంగళవారం స్థానిక బద్వేలు సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ… గతంలో జమ్మలమడుగు సబ్‌జైలులో 100మంది ఖైదీలు ఉండేవారని, ప్రస్తుతం 13 మంది ఉన్నారన్నారు. అలాగే ప్రొద్దుటూరు సబ్‌జైలు పరిధిలో గతంలో 80మంది ఖైదీలుండగా, ప్రస్తుతం 30-40మధ్యలో ఉంటున్నారని, దీనికి ప్రధాన కారణం నేరాలు తగ్గుముఖం […]పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు

తెలుగు సినిమా వైతాళికుడు పద్మవిభూషణ్ బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి

తెలుగు సినిమా దర్శకుల్లో గొప్పవాళ్ళు ఎవరనే ప్రశ్న వస్తే మనం ముందుగా వినే పేరు “బి.ఎన్‌. రెడ్డి”. నిజానికి 30 ఏళ్ళ సినీ జీవితంలో ఆయన తీసింది పదకొండు సినిమాలే. కాని ప్రతి ఒక్కటీ పేరు గడించిందే! “బి.ఎన్‌” గా సుపరిచితులైన బి.ఎన్.రెడ్డి అసలు పేరు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. కడపజిల్లా – పులివెందుల తాలూకాలోని ఎద్దులయ్యగారి కొత్తపల్లిna 16.11.1908 న ఆయన జన్మించారు. బి.ఎన్‌ ప్రాథమిక విద్యాభ్యాసం రైల్వేకోడూరు తాలూకాలోని పొట్టిపాడులో జరిగింది. ఆయన తండ్రి Rallis, […]పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు వ్యాసాలు

హృదయమున్న విమర్శకుడు – రారా!

రా.రా .గా ప్రసిద్ధుడయిన విమర్శకుడూ, సంపాదకుడూ, కథకుడూ, అనువాదకుడూ సిసలయిన మేధావీ – రాచమల్లు రామచంద్రారెడ్డి (1922-88) హృదయమున్న రసైకజీవి! స్వపరభేదాలు పాటించని విమర్శకుడు. పిసినారి అనిపించేటంత పొదుపరి కథకుడు. ముళ్లలోంచి పువ్వులను ఏరే కళలో ఆరితేరిన సంపాదకుడు. మూలరచయిత మనసును లక్ష్యభాషలోని పాఠకుడికి సమర్థంగా చేర్చిన అనువా దకుడు. అక్షరాంగణంలో నిలువెత్తు విగ్రహాలుగా పాతుకు పోయిన ‘ప్రముఖుల’ గుట్టురట్టు చెయ్యడానికి క్షణమాత్రం జంకని విగ్రహ విధ్వంసి. ఒక్కమాటలో చెప్తే- మూడున్నర దశాబ్దాల సాహిత్య జీవితంలో ఒక […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం పర్యాటకం

“కడప దేవుని గడప” అని ఎందుకంటారో …

ఒంటిమిట్ట – దీన్నే ఏకశిలానగరం అంటారు. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో ఇక్కడకు వచ్చి దీనిపైన మూడురోజులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికి ఇంకా వారికి ఆంజనేయస్వామీ పరిచయం కాకపోవటంతో ఇక్కడ సీతారామలక్ష్మణుల విగ్రహాలే ఉంటాయి. ఆంజనేయస్వామీ విగ్రహం విడిగా ఆలయఆవరణలో ఒకప్రక్కన ఉంటుంది. ఈ విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్ట చేసాడని అంటారు. ఈ క్షేత్రానికి చాలా ప్రశస్తి ఉంది. పోతన ఇక్కడే ఉండి భాగవతాన్ని వ్రాసాడని చెప్తారు. ఆయన నివసించిన ఇల్లు కూడా ఉందికాని […]పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు

యోగిపుంగవులు “జ్యోతి” శ్రీ కాశిరెడ్డి నాయన !

శ్రేష్టమైన సద్గురు పరంపరలో భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ దీన జనసేవ, గోసేవ, శిథిలమైన దేవాలయాల జీర్ణోద్ధరణ చేస్తూ ఆజన్మాంతం ఆధ్యాత్మిక మార్గమే శరణ్యమని ఆచరణలో చూపిన మహనీయుడు కాశిరెడ్డి నాయన. నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెడుసుపల్లి గ్రామంలోని మునెల్లి వంశంలో మునెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించిన పుణ్యమూర్తి కాశరెడ్డి నాయన. అమావాస్యనాడు అర్ధరాత్రివేళ జన్మించిన కాశినాయన ప్రజలను అజ్ఞానాంధకారంనుంచి జ్ఞానమార్గం వైపు మళ్లించిన ఒక దివ్య జ్యోతి నృసింహాపాసకులు.పూర్తి వివరాలు ...

పల్లెలు

ఖాజీపేట మండలంలోని గ్రామాలు

ఖాజీపేట మండలంలోని పల్లెల వివరాలు – గణాంకాలు మరియు చాయాచిత్రాల సహితంగా. ఒక్కో గ్రామానికి సంబందించిన చరిత్ర, వ్యక్తులు, దర్శనీయ స్థలాల వివరాలు. [feed url=”https://kadapa.info/villages/category/khajipeta/feed/” number=”30″ ] కడప జిల్లాలోని మిగతా గ్రామాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.పూర్తి వివరాలు ...

పర్యాటకం

గుండాల కోన

పరుచుకున్న పచ్చదనం.. పక్షుల కిలకిలా రావాలు.. గలగలపారే సెలయేరు.. నింగికి నిచ్చెన వేసినట్లున్న కొండలు.. కనువిందు చేసే కమనీయ దృశ్యాలు.. మేను పులకరించే ప్రకృతి అందాలు.. ఈ అందాలను తనివితీరా చూసి తరించాలంటే గుండాల కోనను దర్శించాల్సిందే. పచ్చని చెట్లు, ఎత్తైన కొండల మధ్యలో కొలువు దీరిన నీలకంఠేశ్వరుడు ఈ కోనకు ప్రత్యేక ఆకర్షణ. ఓబులవారిపల్లి మండలం వై.కోటనుంచి 15 కిలోమీటర్లు, రైల్వేకోడూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో శేషాచల అడవుల్లో గుండాల కోన క్షేత్రం ఉంది. […]పూర్తి వివరాలు ...

కథలు

అంజనం (కథ) – వేంపల్లె షరీఫ్

పైన ఫ్యాను తిరుగుతోంది. తిరిగేది చిన్నగే అయినా కిటకిటా మంటూ శబ్దం పెద్దగా వస్తోంది. ఆ ఫ్యాను గాలిని ఏమాత్రం లెక్కచేయకుండా ఈగలు బొయ్యిమంటూ అటూ ఇటూ తిరుగుతున్నాయి. నట్టింట్లో కాళ్లు బార్లా చాపుకుని దిగులుగా కూచోనుంది జమ్రూత్. “పెద్దోడు తిరిగొచ్చాడని పెద్దాసుండ్యా…” అంది ఉన్నట్టుండి. “ఇప్పుడు ఆ ఆసకు ఏమైంది?” అన్నట్టు చూశాడు పక్కనే ఎర్రటి వైరు మంచంపై కూర్చొని ఉన్న ఆమె కొడుకు గౌస్. “ఆ పావురం వొచ్చినట్టే నా బిడ్డకూడా వొచ్చాడనుకొంటి” అంది […]పూర్తి వివరాలు ...