వార్తా విభాగం

సంకీర్తనలు

పరగు బహుసజ్జన్మపరిపక్వ హృదయుఁడై

॥పల్లవి॥పరగు బహుసజ్జన్మపరిపక్వ హృదయుఁడైమరికదా వేదాంతమార్గంబు గనుట॥చ1॥కలుషహరమగువివేకమ్ము గలిగినయట్టి-ఫలముగాదా కృపాపారీణుఁడౌటతలపోసి సకలభూతదయా విశేషంబుకలిగికాది గుణవికారంబు గనుట॥చ2॥యెదిరిఁ దనవలెనె తా నెఱఁగనేర్చినఫలముఅదిగదా ద్రవ్యమోహంబు గడచనుటపదిలమగు నాశానుభవము పాపినయట్టి-తుదగదా తాను సంతోషంబు గనుట॥చ3॥రతిపరాజ్ముఖమహరాజ్యమబ్బినఫలము –మతిగదా తాను కర్మత్యాగియౌటతతితోడ ఫలపరిత్యాగి చిత్తవ్యాపి-ధృతిగదా వేంకటాధిపు దాసుఁడౌట రాగము: నారణి రేకు: 0022-01 సంపుటము: 1-131 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, నారణిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎంతటివారలు నెవ్వరును హరిఁ

  ॥పల్లవి॥ ఎంతటివారలు నెవ్వరును హరిఁ జింతిచక నిశ్చింతులు గారు ॥చ1॥ అతిజితేంద్రియులు ననశనవ్రతులు- నతుల తపోధనులగువారు చతురానన గురుస్మరణము దొరకక తతి నూరక పుణ్యతములుగారు ॥చ2॥ అనఘులు శాంతులు నధ్యాత్మతతులు- ననుపమ పుణ్యులు యాజకులు వనజోదరు ననవరతముఁ దలఁచక వినుతి స్మృతికిని విభుదులుగారు ॥చ3॥ దురిత విదూరులు దుర్మతిహీనులు నిరతానందులు నిత్యులును తిరువేంకటగిరిదేవుని గొలువక పరమార్గమునకు బ్రహ్మలు గారు రాగము: గుండక్రియ రేకు: 0005-03 సంపుటము: 1-32 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య [&పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పరమాత్ముని నోరఁబాడుచును యిరు-

॥పల్లవి॥పరమాత్ముని నోరఁబాడుచును యిరు-దరులు గూడఁగఁ దోసి దంచీ మాయ॥చ1॥కొలఁది బ్రహ్మాండపు కుందెనలోనకులికి జీవులను కొలుచు నించికలికి దుర్మోహపు రోఁకలివేసితలంచి తనువులను దంచీ మాయ॥చ2॥తొంగలి రెప్పలు రాత్రులుఁ బగలునుసంగడి కనుఁగవ సరిఁ దిప్పుచుచెంగలించి వెసఁ జేతులు విసరుచుదంగుడు బియ్యముగా దంచీ మాయ॥చ3॥అనయముఁ దిరు వేంకటాధీశ్వరునిపనుపడి తనలోఁ బాడుచునువొనరి విన్నాణి జీవులనెడి బియ్యముతనర నాతనికియ్య దంచీ మాయ రాగము: కేదారగౌళ రేకు: 0021-06 సంపుటము: 1-130 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎన్ని లేవు నా కిటువంటివి

॥పల్లవి॥ఎన్ని లేవు నా కిటువంటివికన్నులెదుట నిన్నుఁ గనుగొనలేనైతిgoreadread॥చ1॥అరయ నేఁజేసిన యపరాధములు చూచికరుణించి వొకడైనాఁ గాచునాకరచరణాదులు కలిగించిననిన్నుఁబరికించి నీసేవాపరుఁడ గాలేనైతి॥చ2॥యేతరినై నేనెఱిఁగి సేసినయట్టి-పాతక మొకఁడైనా బాపునాఆతుమలోనుండి యలరి నీవొసఁగిన-చేతనమున నిన్నుఁ జెలఁగి చేరనైతి॥చ3॥శ్రీవేంకటేశ నేఁ జేసిన యితరుల-సేవ కొకఁడు దయసేయునానీవే యిచ్చినయట్టి నే నీశరీరముతోడనీవాఁడ ననుబుద్ధి నిలుపనేరనైతి రాగము: గౌళ రేకు: 0005-03 సంపుటము: 1-31 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

బయలు వందిలి వెట్టి పరగఁ జిత్తముగలిగె

॥పల్లవి॥బయలు వందిలి వెట్టి పరగఁ జిత్తముగలిగెదయమాలి తిరుగ నాత్మజుఁ డొకఁడు గలిగెlink॥చ1॥కనుచూపువలన నుడుగనికోరికలు గలిగెతనుకాంక్షవలనఁ బరితాపంబు గలిగెఅనుభవనవలన మోహంధకారము గలిగెతనివి దీమివలన తలపోఁత గలిగె॥చ2॥అడియాసవలన పాయనిచలంబునుఁ గలిగెకడుమమతవలన చీఁకటి దవ్వఁగలిగెకడలేని తమకమునఁ గాఁతాళమునుఁ గలిగెనడుమ నంతటికి మాననిప్రేమ గలిగె॥చ3॥తరితీపు వలన చిత్తభ్రాంతి తగఁ గలిగెవిరహంబువలన పురవేదనలుఁ గలిగెతిరువేంకటాచలాధిపుని కరుణామృతముపరిపూర్ణమైన యాపద నీఁదఁ గలిగె రాగము: శ్రీరాగం రేకు: 0021-05 సంపుటము: 1-129 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఆలాగుపొందులును నటువంటికూటములు

॥పల్లవి॥ఆలాగుపొందులును నటువంటికూటములుయీలాగులౌట నేఁడిదె చూడనయితి॥చ1॥అడియాసచూపులకు నాసగించితిఁగానివెడమాయలని లోను వెదకలేనైతికడువేడుకలఁ దగిలి గాసిఁ బొందితిఁగానియెడలేనిపరితాప మెఱఁగలేనైతి॥చ2॥చిరునగవుమాటలకుఁ జిత్తగించితిఁగానితరితీపులని లోనుఁ దలఁపలేనైతివరుస మోహపుఁ బసలవలలఁ జిక్కితిఁగానిగరువంపుఁ బొలయలుక గానలేనైతి॥చ3॥శ్రీవేంకటేశ్వరునిఁ జింత సేసితిఁగానిదేవోత్తమునిలాగుఁ దెలియలేనైతియీవైభవముపై నిచ్చగించితిఁగానియీవైభవానంద మిది పొందనైతి రాగము: ఆహిరి రేకు: 0005-02 సంపుటము: 1-30 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

తానే తెలియవలె తలఁచి దేహి తన్ను

॥పల్లవి॥తానే తెలియవలె తలఁచి దేహి తన్నుమానుపువారలు మరి వేరీ॥చ1॥కడలేని భవసాగరము చొచ్చినతన్నువెడలించువారలు వేరీకడుబందములచేతఁ గట్టుపడినతన్నువిడిపించువారలు వేరీ॥చ2॥కాఁగినినుము వంటికర్మపు తలమోపు –వేఁగు దించేటివారు వేరీమూఁగిన మోహపుమూఁకలు తొడిఁబడవీఁగఁ దోలేటివారలు వేరీ॥చ3॥తిరువేంకటాచలాధిపునిఁ గొలుపుమనివెరపు చెప్పెడువారు వేరీపరివోని దురితకూపములఁ బడకుమనివెరపు చెప్పెడివారు వేరీ రాగము: గుండక్రియ రేకు: 0021-04 సంపుటము: 1-128 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, గుండక్రియపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పెంచఁబెంచ మీఁదఁ బెరిగేటిచెలిమి

॥పల్లవి॥పెంచఁబెంచ మీఁదఁ బెరిగేటిచెలిమిఇంచుకంత తాలిముల కెడలేనిచెలిమిlisinopril and drivinglisinopril and drivinglisinopril and driving॥చ1॥అంటుముట్టులేక మనసులంటుకొన్న చెలిమికంటఁగంట నవ్వించేఘనమైనచెలిమివెంటవెంటఁ దిరిగాడు వెఱ్ఱిగొన్న చెలిమియింటివారిచిత్తములకు నెడరైనచెలిమి॥చ2॥చెక్కుచెమట పెక్కు వలనే చిక్కనై నచెలిమియెక్కడౌటా తమ్ముఁదమ్ము నెఱఁగనీనిచెలిమిచక్కఁదనమే చిక్క మేనుచిక్కినట్టిచెలిమిలెక్కలేని యాసలెల్ల లేఁతలయినచెలిమి॥చ3॥అంకురించినట్టితలఁపు లధికమయినచెలిమిలంకెలయినయాసలెల్లా లావుకొన్న చెలిమివేంకటాద్రివిభునిఁ గూడి వేడుకయినచెలిమిపంకజాననలకెల్లఁ బాయరానిచెలిమి రాగము: ఆహిరి రేకు: 0005-01 సంపుటము: 1-29 Tags: పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఆదిదేవుఁడై అందరిపాలిటి

॥పల్లవి॥ఆదిదేవుఁడై అందరిపాలిటికీ దేవుఁడై వచ్చె నితఁడుis-aber.net॥చ1॥కోరిన పరమ యోగుల చిత్తములలోనయేరీతి నుండెనో యీతఁడుచేరవచ్చిన యాశ్రితులనెల్లఁ బ్రోవయీరీతి నున్న వాఁడీతడు॥చ2॥కుటిల దానవుల కోటానఁగోట్లయెటువలెఁ ద్రుంచెనో యీతఁడుఘటియించి యిటువంటి కారుణ్యరూపుఁడైయిటువలె నున్న వాఁడీతడు॥చ3॥తక్కక్క బ్రహ్మాండ తతులెల్ల మోచితా-నెక్కడ నుండెనో యీతఁడుదిక్కుల వెలసిన తిరువేంకటేశుఁడైయిక్కడ నున్న వాఁడీతఁడు రాగము: సామంతం రేకు: 0021-03 సంపుటము: 1-127 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...