వార్తా విభాగం

ప్రసిద్ధులు వ్యాసాలు

రాయలసీమ సాంస్కృతిక రాయబారి

కన్నడం మాతృభాష అయినా తెలుగు భాష కోసం 70 వసంతాల జీవితకాల అంకిత సేవలందించిన మహానుభావుడు, భాషోద్ధారకుడు, బహుభాషావేత్త, వ్యవస్థీకృత వ్యక్తిత్వ సంపన్నుడు డాక్టర్ జానమద్ది హనుమఛ్ఛాస్త్రి. అనంతపురం జిల్లా, రాయదుర్గంలో 1926 సెప్టెంబర్ 5న జన్మించారు. జానకమ్మ, సుబ్రమణ్యశాస్త్రి తల్లిదండ్రులు. ఆంగ్లంలోను, తెలుగులోను రెండు పీజీలు చేశారు. తొలుత విద్యాశాఖలో అధ్యాపకునిగా, స్కూళ్ళ ఇన్‌స్పెక్టర్‌గా, జిల్లా విద్యావిషయక సర్వే ఆఫీసర్‌గా, ఆ తర్వాత ఇంగ్లీషు ఆచార్యులుగా 1984 వరకు ప్రభుత్వ సేవలందించారు. గాడిచర్ల స్ఫూర్తే జానమద్ది […]పూర్తి వివరాలు ...

వార్తలు

బంద్ సంపూర్ణం

కడప : వెనుకబడిన రాయలసీమను రతనాల సీమగా మార్చాలంటే.. సీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని గురువారం తలపెట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. అన్నిచోట్ల పాఠశాలలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించి మద్దతు ప్రకటించాయి. జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద కూడా ప్రత్యేక బలగాలను మోహరించారు. అంబులెన్స్‌లతో భారీ ర్యాలీ : రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ కడపలో రాయలసీమ రాజధాని […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం రాజకీయాలు

ఉత్తుత్తి వాగ్దానాలతో మళ్ళా కడప నోట మట్టికొట్టిన ప్రభుత్వం

రాష్ట్ర రాజధానిగా విజయవాడను నిర్ణయిస్తూ ఇచ్చిన ప్రకటనలో కడప జిల్లాకు విదిల్చిన ముష్టిలోని మెతుకులేమిటో ఒకసారి చూద్దాం: 1. స్టీల్ ప్లాంట్: ఇది కొత్తగా కడుతున్నదేమీ కాదు. ఏడేళ్ల కిందట ప్రారంభించి, మధ్యలో ఆగిపోయిన నిర్మాణాన్ని ఇప్పుడు కొనసాగించి పూర్తిచేస్తారు, అంతే. ఐతే దీన్ని సాకుగా చూపి, కేంద్ర ప్రభుత్వ విద్య, పరిశోధనా సంస్థలేవీ కడప జిల్లా ఛాయలకు రాకుండా చేశారు. కానీ కేవలం 11 పరిశ్రమలున్న కడప జిల్లాలో(Src:www.apind.gov.in/library/district/kadapa.pdf) పన్నెండో పరిశ్రమ నిర్మిస్తున్నందుకే ఇంకేమీ లేకుండా […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు రాజకీయాలు

ఇక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ మనోడే!

కడప జిల్లాకు చెందిన ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం దక్కనుంది. డిప్యూటీ చైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ సతీష్ ఒక్కరే బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. రాజకీయ సమీకరణల నేపధ్యంలో టీడీపీ నుంచి ఎన్నికైన అభ్యర్థిని రంగంలోకి దింపితే తాము పోటీలో ఉండమనే సంకేతాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లాయి. దీంతో అనూహ్యంగా ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆమేరకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ […]పూర్తి వివరాలు ...

కవితలు

అన్నన్నా తిరగబడు… (కవిత) – సడ్లపల్లె చిదంబరరెడ్డి

రాయల సీమజనాల్లో రగత మురికిపారాల రాజకీయ రంకుల్ని ఈడ్చి ఈడ్చి తన్నాల. ఈపొద్దు ఇంటిలోన రేపేమో మంటిలోన ఏదొకటో కాకుంటే మనకింకా ముక్తి లేదు. ఒకకంటికి సున్నము వెన్న మరో కంటికి ఆదినుండి మనసీమకు అంతులేని అన్యాయం. ప్రాజెక్టును ఇస్తామని మదరాసునుండి పిల్చినారు చుక్క నీరు ఇవ్వకుండ కిందకు మళ్లించినారు . సీమ రైతు గుండెలన్ని ముళ్లచెట్ల కంపలాయె ఎన్నాళ్లీఅగచాట్లు అన్నన్నా తిరగబడు. రైతు కంటి నీళ్లతో పంటలెలా పండుతాయి మభ్య పెట్టు మాటలతో పరిపాలనెలా సాగుతుంది. […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

ఈశ్వర్‌రెడ్డి సేవలు ఆదర్శనీయం

కడప: కామ్రేడ్‌ ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి సేవలు మరువలేనివని – ఆయన పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతితో పాటు, కర్షకులు, కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశ లు పాటుపడ్డారని ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు అభిబాషించారు. ఎద్దుల ఈశ్వరరెడ్డి జయంతి సందర్భంగా నూతన ఆంధ్రప్రదేశ్‌ లో రాయలసీమ సమగ్రాభివృద్ధి అనే అంశం పై స్థానిక నూర్‌-ఏ-జహాన్‌ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన సదస్సుకు ఎన్‌ఆర్‌ ఆర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ పూర్వ సంచాలకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎద్దుల […]పూర్తి వివరాలు ...

కవితలు

జై రాయలసీమ (కవిత) – సొదుం శ్రీకాంత్

తోరణాలు దిగేయండి పావురాలు ఎగిరేయండి బారులుగా కూరండి మాలలుగా మారండి అడుగుల మడుగై అరవండి జోరుగా జై రాయలసీమ ( నేను అరుచ్చనా, అన్నా ఇనపచ్చాంది గదా? మళ్ళా అర్సాల్నా? ) జై జై రాయలసీమ ( ఇది మీరు -నాకినపల్యా, ఎది ఇంగోసారి, గా……ట్టిగ, గూబ పగల్లాల కొడుకులకు ) ఇంగా ఏముంది ఎదురుజూడ్దానికి? కొట్టం కాలిపాయ బతుకు బుగ్గైపాయ కరువు పుండాయ బతుకు ఎండిపాయ నిండా మునిగినాక సలేంది, గిలేంది! ఇంగ మన బాట […]పూర్తి వివరాలు ...

వార్తలు

ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం సీమ జిల్లాల బంద్‌

కడప: రాయలసీమ ప్రజల చారిత్రక హక్కు అయిన రాజధానిని రెండు జిల్లాల కోస్తాంధ్రకు తరలించి సీమ ప్రజల ఆకాంక్షలను, హక్కులను ప్రభుత్వం హరిస్తున్నందుకు నిరసనగా రాయలసీమ విద్యార్థి వేదిక (ఆర్.ఎస్.ఎఫ్) గురువారం రాయలసీమ జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు వేదిక కన్వీనరు ఎం.భాస్కర్, కోకన్వీనరు దస్తగిరి, జిల్లా కన్వీనరు ప్రసాద్, వైవీయూ కన్వీనరు నాగార్జున ఓ ప్రకటన విడుదల చేశారు. రాయలసీమలోని అన్ని పాఠశాలలు, కాలేజీలకు చెందినా విద్యార్థులు, కవులు, కళాకారులు, ప్రజలు మరియు మేధావులు […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఈ పొద్దు నుంచి శ్రీ నారాపుర వేంకటేశ్వరుని పవిత్రోత్సవాలు

తితిదే పరిధిలోని వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బుధవారం నుంచి ఈ నెల 5వతేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 9 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, యాగశాల పూజ, పుణ్యావచనం, పవిత్ర ప్రతిష్ట నిర్వహిస్తారు. 4వతేదీన ఉదయం 8.30 నుండి 12 గంటల వరకు పవిత్ర సమర్పణ, 5వతేదీన ఉదయం 8.30 నుండి 12 గంటల వరకు స్నపన […]పూర్తి వివరాలు ...

error: