100 మందికి ప్రత్యక్ష ఉపాధి కేంద్ర ప్రభుత్వం ‘పవర్ ఫర్ ఆల్’ పథకంలో భాగంగా గాలివీడు వద్ద 500 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ‘సహజవనరులు మరియు పునరుత్పాదక’ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైదరాబాదులో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టులో భారత ప్రభుత్వం 50 శాతం, ఏపి జెన్‌కో 41 శాతం, నెడ్‌క్యాప్ 9 శాతం పెట్టుబడులు పెడతాయి. […]పూర్తి వివరాలు ...
కమలాపురం: కడప జిల్లా పై ప్రభత్వ వివక్షకు నిరసనగా మరియు జిల్లా సమగ్రాభివృద్ధిని కోరుతూ.. ఈ నెల 22, 23, 24 తేదీల్లో అన్ని మండల కార్యాలయాల ఎదుట సీపీఐ, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని, ప్రజలు కూడా పాల్గొని ఆయా కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. వనరుల ఆధారంగా సమగ్రంగా అభివృద్ధి చేయకపోతే.. జిల్లా శాశ్వత ఏడారిగా మారే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు కేటాయించకుండానే జిల్లాను […]పూర్తి వివరాలు ...
దొరవారి నరసింహ్వరెడ్డి! నీ దొరతనము కూలిపోయె రాజా నరసింహ్వ రెడ్డి! || దొర || రేనాటి సీమలోనా రెడ్డోళ్ళ కులములోనా దొరవారీ వమిశానా ధీరుడే నరసింహ్వ రెడ్డి || దొర || కొయిల్ కుంట్లా గుట్టలెంటా కుందేరూ వొడ్డూలెంటా గుర్రమెక్కీ నీవు వస్తే కుంపిణీకీ గుండె దిగులూ || దొర || కాలికీ సంకెండ్లు వేసీ చేతీకీ బేడీలు వేసీ పారాతో పట్టి తెచ్చీ బందికానులొ పెట్టిరీ || దొర || కండ్లకూ గంతాలు గట్టీ నోటినిండా […]పూర్తి వివరాలు ...
వారిద్దరూ సీమ ద్రోహులే బంగరు భూములకు సాగునీరూ లేదు కడప జిల్లా అభివృద్దిపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది పర్యాటక రంగంలోనూ జిల్లాపైనవివక్ష ప్రభుత్వ తీరుపై ఉద్యమించాలి కడప: రాయలసీమకు తరతరాలుగా అన్యాయం జరుగుతోందని, ఈ ప్రాంతం నాయకులు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూ ముఖ్యమంత్రి పదవులను వెలగపెడుతున్నారే కానీ ఇక్కడి అభివృద్ధిని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని జిల్లాపరిషత్ సమావేశ హాలులో సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐల సంయుక్త […]పూర్తి వివరాలు ...
వర్గం : కోలాటం పాట బళ్ళారి జిల్లరా … బళ్ళారి జిల్లరా ఆదోని తాలూకురా రాసెట్టి వీరన్న కొడుకే రాయల వాడే రామయ్య రామా రామా కోదండరామా భై రామా రామా కోదండరామా రాసెట్టి వీరన్నకయితే ఎంతమంది కొడుకుల్లు ఒగరి పేరు రామయ్య ఒగరి పేరు సుబ్బయ్య అందరికంటే చిన్నావాడు అందగాడూ విశ్వనాధు పన్నెండామడ గడ్డలోన పేరుగల్ల రామయ్య ||రామా|| రామయ్య నేస్తులైన ఎంతమంది ఉన్నారు కొంగనపల్లి కిష్టరావు కోసిగానుమప్ప రా ||రామా|| బుద్ధిశాలి రామయ్య బూమ్మింద […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలోని చారిత్రక ప్రదేశమైన గండికోట పరిసరాల్లో సంచరిస్తూ, గొర్రెలనూ,మేకలనూ చంపివెస్తున్న క్రూరజంతువు పులికాదని, అది హైనా అనే జంతువని అటవీ అధికారులు స్పష్టం చేశారు. గండికోట పరిసరాలనూ, పెన్నా లోయనూ పరిశీలించిన అధికారు ఈ మేరకు ఈ ప్రకటన చేశారు. జంతువు పాదముద్రలను గుర్తించిన అధికారులు ఆ పాదముద్రలు హైనా అనే జంతువు పాదముద్రలుగా పేర్కొన్నారు. హైనాను పట్టుకుని జంతు ప్రదర్శన శాలకు తరలించే ప్రయత్నాలను అధికారులు ప్రారంభించారు. హైనా కు సంబంధించిన వివరాలు 28-08-2010 […]పూర్తి వివరాలు ...
18 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం జిల్లా వ్యాప్తంగా సకాలంలో వర్షం రాక పోవడం, వచ్చినా పదును కాకపోవడంతో సేద్యాలు చేసుకోలేక రైతులు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ పంటకు అను వైన జూన్, జులై నెలల్లో జిల్లాలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. నాలుగు నెలల్లో 393.5 మిల్లి మీటర్ల వర్షపాతం జి ల్లాలో నమోదు కావాల్సి ఉండగా 180.6 మిల్లి మీటర్లు మాత్రమే నమోదైంది. వాస్తవికంగా 54 […]పూర్తి వివరాలు ...
కడప: వైకాపా జిల్లా అధ్యక్షుడిగా ఆకేపాటి అమరనాథరెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్, మైదుకూరు శాసనసభ్యుడు శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలిపారు. నగరంలోని వైఎస్ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అమరనాథరెడ్డిని నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న ఆకేపాటి పార్టీని అన్ని రకాలుగా పటిష్టం చేయగలరన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర […]పూర్తి వివరాలు ...
సీమ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి అన్నారు. ‘రాష్ట్ర విభజన, జిల్లా అభివృద్ధి’ అన్న అంశంపై ఈనెల 14న కడపలో నిర్వహించతలపెట్టిన సెమినార్‌కు సంబంధించిన గోడపత్రాలను ఆయన విడుదలచేశారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గురువారం ఆర్జీయూ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా సీమ అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. ప్రత్యేకించి జిల్లాలో కరవు, నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్నట్టు చెప్పారు. సమస్య పరిష్కారానికి కృష్ణా జలాల […]పూర్తి వివరాలు ...