వార్తా విభాగం

పద్యాలు

బడి పిల్లోళ్ళు రాయాల్సిన భాగవత పద్యాలివే!

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి1, 2015న ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో నిర్వహిస్తున్న పోతన భాగవత పద్యార్చనకు వచ్చే 9,10 తరగతులు చదువుతున్న బడి పిల్లోళ్ళు నేర్చుకొని రాయవలసిన పద్యాలు ఇవే అని బమ్మెర పోతన సాహితీ పీఠం సభ్యులు విద్వాన్ కట్టా నరసింహులు తెలియచేశారు. భాగవత పద్యార్చనకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే కింది నెంబర్లలో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు – +91-9441337542 (విద్వాన్ కట్టా నరసింహులు), +91-9440200358 (కార్యనిర్వహణాధికారి మరియు సహాయ కమీషనర్, ధర్మ ప్రచార మండలి). పై పద్యాలను […]పూర్తి వివరాలు ...

కథలు

సిన్నిగాడి శికారి (కథ) – బత్తుల ప్రసాద్

పడమటి పక్క పొద్దు నల్లమల కొండల్లోకి సిన్నగ జారిపాయ. జంగిలిగొడ్లు కాయను మిట్టకు పోయిన ఆవుల రామన్న, మేకల్ను తోలకపోయిన చెవిటి కమాల్ అప్పుడే ఊళ్ళోకి బరుగొడ్లను, మేకల్ను తోలకచ్చిరి, సవరాలు, గడ్డాలు, చెయ్యడానికి పక్క పల్లెలకు పోయిన మంగళోల్ల రామన్న సంకకు పెట్టె,భూజాన మూటె ఎత్తుకుని వచ్చినాడు. ఏట్టో గుడ్డలుతకడానికి బొయిన సాకలోల్లు ఉతికిన గుడ్డల మూటల్ను ఈపునెత్తుకొని వర్సగా గూడ్సుబండ వచ్చినట్లు వచ్చాండిరి. చేలల్లోకి పన్లకు పోయిన ఆడోళ్ళునెత్తిన గడ్డిగంపలెత్తుకుని కొందరు, కూరాక్కు తమేటాలో, […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

‘ఉక్కు’ నివేదిక ఏమైంది?

కడప: కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై  నవంబరు 30లోగా స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించవలసి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 23-07-2014 తేదీన కేంద్ర ఉక్కు, గనులశాఖమంత్రి తోమార్‌కు లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన కేంద్రమంత్రి 21-08-2014న ప్రతి లేఖ రాస్తూ, నవంబర్‌ 30లోగా సెయిల్‌ తన నివేదికను సమర్పిస్తుందని తెలియచేశారు. ఇవాళ డిసెంబర్ 20. అంటే బిల్లులో పేర్కొన్న ఆరు నెలల గడువు […]పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు

ఆచార్య డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి

పూర్తి పేరు : డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి పుట్టిన తేదీ: 16 అక్టోబర్, 1948 వయస్సు: 66 సంవత్సరాలు వృత్తి : ఆచార్యులు ప్రవృత్తి: సాహితీ వ్యాసంగం విద్యార్హత: తెలుగులో శ్రీ వెంకటేశ్వర విద్యాలయం నుండి  డాక్టరేట్ (Ph.D) ప్రస్తుత హోదా: భాద్యులు, సర్ సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం, కడప మరియు గౌరవ అధ్యాపకులు, తెలుగు విభాగం, యోగి వేమన విశ్వవిద్యాలయం నిర్వహించిన హోదాలు: తెలుగు విభాగపు అధిపతిగా పదవీ విరమణ (శ్రీకృష్ణ దేవరాయ […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

రాచపాలెం చంద్రశేఖరరెడ్డికి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు

ప్రముఖ సాహితీ విమర్శకులు, సాహితీవేత్త ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు ఈ ఏడాది కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రచించిన “మన నవలలు, మన కథలు” అనే విమర్శనా గ్రంథానికి ఈ అవార్డు ఇస్తున్నట్లు శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రకటించింది. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ప్రస్తుతం కడపలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనాకేంద్రం భాద్యులుగా వ్యవహరిస్తూ ఇక్కడి యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో గౌరవ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని కుంట్రపాకం(తిరుపతి సమీప గ్రామం)లో జన్మించిన […]పూర్తి వివరాలు ...

వార్తలు

మహిళా డెయిరీల మూసివేతకు రంగం సిద్ధం?

కడప జిల్లాలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నడుస్తున్న పాలశీతలీకరణ కేంద్రాల(బీఎంసీయూ) మూసివేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. మహిళలను లక్షాధికారులను చేసే ఉద్దేశంతో బ్యాంకులింకేజీ, వడ్డీలేని రుణాలు తదితర కార్యక్రమాలతో పాటు బీఎంసీయూలను ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించేందుకు వీటిని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినారు. జిల్లాలో గతంలో 32 వేల లీటర్లకు పైగా పాలను సేకరించగా ప్రస్తుతం అన్ని బీఎంసీయూలు కలిపి 6,500 లీటర్లకు మించి సేకరణ జరగడం లేదు. జిల్లాలో 21 […]పూర్తి వివరాలు ...

వార్తలు

దాల్మియా గనుల తవ్వకాల నిలుపుదల

జమ్మలమడుగు: మైలవరం మండలం నావాబుపేట సమీపంలోని దాల్మియా సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన గనుల తవ్వకాలను కలెక్టర్ ఆదేశాల మేరకు నిలుపుదల చేశారు. స్థానిక ఇన్‌ఛార్జి తహశీల్దార్ సాయినాథరెడ్డి గురువారం మాట్లాడుతూ పెద్దకొమెర్ల, హనుమంతరాయునిపేట గ్రామాల్లో కార్బన్ వాయువు ప్రభావంచేత పంటలు నల్లగా మసకబారిపోతుండటంతో, అలాగే ప్రజల ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. పరిశ్రమ కోసం కొనుగోలు చేసిన భూముల్లో మండల పరిధిలోని నవాబుపేట గ్రామానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోనే సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన మైనింగ్ […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

జనవరి1న ఒంటిమిట్టలో పోతన భాగవత పద్యార్చన

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి1, 2015న ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో నిర్వహిస్తున్న పోతన భాగవత పద్యార్చనకు వేలాదిగా తరలిరావాల్సిందిగా 9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు నిర్వాహకులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక తితిదే కల్యాణమండపంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను తితిదే ధర్మప్రచార మండలి సభ్యులతో కలిసి పోతన సాహితీ పీఠం సభ్యులు విద్వాన్ కట్టా నరసింహులు ఆవిష్కరించి ప్రసంగించారు. లోకహితాన్ని తెలిపిన పోతన భాగవత పద్యాలను విద్యార్థులకు పరిచయం చేసే కార్యక్రమం ఇదన్నారు. తెలుగు వికాసాన్ని కోరుకునే తల్లిదండ్రులు, పవిత్ర భారతీయ […]పూర్తి వివరాలు ...

వార్తలు

జిల్లాలో 48 కరువు మండలాలు

కడప: జిల్లాలో 48 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సగటు వర్షపాతం లేని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తిస్తూ రాష్ట్ర రెవిన్యూ విభాగం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో కరవు పీడిత మండలాలుగా గుర్తించినవి ఇవీ…. రామాపురం, చక్రాయపేట, సింహాద్రిపురం, పెనగలూరు, గాలివీడు, వీరబల్లి, జమ్మలమడుగు, కడప, తొండూరు, పుల్లంపేట, లక్కిరెడ్డిపల్లె, అట్లూరు, వేంపల్లె, బద్వేలు, గోపవరం, చిన్నమండెం, రాయచోటి, పులివెందుల, […]పూర్తి వివరాలు ...

error: