రాష్ట్రంలో కరువు పరిస్థితులపై చర్చ నేపధ్యంలో రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి జిల్లా స్థితిగతుల్ని వివరించారు. అనంతపురం జిల్లాలో కరువును దృష్టిలో ఉంచుకుని మెట్ట భూములు పదెకరాలు ఉన్నా పెన్షన్‌కు అర్హులుగా ప్రకటించారన్నారు. అలాంటి దుర్భర పరిస్థితులు ఉన్న వైఎస్సార్ జిల్లాకు కూడా ఆ అవకాశం కల్పించాలన్నారు. వైఎస్‌ఆర్ జిల్లాలో సగటు వర్షపాతం 50 శాతంకు మించి నమోదు కాలేదని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెన్షన్ల మంజూరులో అనంతపురం జిల్లా మాదిరిగా వెసులుబాటు […]పూర్తి వివరాలు ...
కడప: ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి శైలి విలక్షణమని విమర్శల్లో రాచమల్లు తరువాత రాచపాళెం అని జిల్లా సాహితీవేత్తలు కొనియాడారు. మన నవలలు, మన కధానికల పుస్తకానికి గాను చంద్రశేఖర్ రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా జిల్లా జనవిజ్ఞానవేదిక సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో అభినందన సభను నిర్వహించారు. ఇందులో భాగంగా జవివే కార్యదర్శి రఘునాధరెడ్డి, సాహితీ స్రవంతి అధ్యక్షుడు మస్తాన్‌వలి, సాహితీ వేత్తలు శశిశ్రీ, ఎంఎం వినోది ని తదితరులు రాచపాళెం సాహితీ […]పూర్తి వివరాలు ...
కడప: ఆచార్య డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఈ రోజు (బుధవారం, డిసెంబరు 23) సాయంత్రం స్థానిక సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో జనవిజ్ఞానవేదిక – సాహితీస్రవంతిల ఆధ్వర్యంలో అభినందన సభ జరగనుంది. ఈ సభలో రచయిత శశిశ్రీ, యోవేవి తెలుగు విభాగపు సమన్వయకర్త ఆచార్య వినోదిని ఉపన్యసిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి జరిగే ఈ సభకు సాహితీ అభిమానులందరూ రావాలని జన విజ్ఞాన వేదిక […]పూర్తి వివరాలు ...
సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం భాద్యులు ఆచార్య డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి దంపతులను కడప జిల్లా అభ్యుదయ రచయితల సంఘం మంగళవారం సత్కరించింది. రాచపాలెం రాసిన ‘మన నవలలు – మన కథానికలు’ పుస్తకానికానికి గాను కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన నేపధ్యం అరసం స్థానిక సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో అభినందన సభను జరిపింది. ఈ సందర్భంగా అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యలు శ్రీమతి పి సంజీవమ్మ మాట్లాడుతూ రాచపాలెం సాహితీ […]పూర్తి వివరాలు ...
భాకరాపేట: రుణమాఫీ కాలేదని సిద్దవటం మండలంలోని భాకరాపేట భారతీయస్టేట్‌బ్యాంకు గేట్లు మూసివేసి సోమవారం ఉదయం రైతులు ఆందోళన చేశారు. ఇక్కడి బ్యాంకు శాఖలో దాదాపు 2728 మంది రైతులు పంట రుణాలు తీసుకోగా ఒక్కరికి కూడా మాఫీ కాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు నుండి రుణాలు తీసుకున్న బొగ్గిడివారిపల్లె, పెద్దపల్లె, మేఘనాపురం పంచాయతీల పరిధిలో ఉన్న దాదాపు వంద మంది రైతులు బ్యాంకు వద్దకు చేరి నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకు అధికార సిబ్బందిని […]పూర్తి వివరాలు ...
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆచార్య డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డిని పలువురు ఆదివారం సన్మానించి అభినందనలు తెలిపారు. సీపీ బ్రౌన్ భాషాపరిశోధన కేంద్రం పూర్వ బాధ్యులు విద్వాన్ కట్టా నరసింహులు, యోవేవి లలిత కళల విభాగం సహాయాచార్యులు డా.మూల మల్లికార్జునరెడ్డి, సిబ్బంది శివారెడ్డి, భూతపురి గోపాలకృష్ణ, హరిభూషణ్ రావు, రమేష్, వెంకటరమణ తదితరులు అభినందించారు. రచయిత డా.వేంపల్లి గంగాధర్ శాలువా, పూలమాలతో రాచపాళెంను సత్కరించారు. రచయిత మధు, కొండూరు జనార్థనరాజు, జిల్లా సాహితీ స్రవంతి […]పూర్తి వివరాలు ...
మలబార్ గోల్డ్, డైమండ్ షోరూం ప్రారంభం ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్ ఆదివారం కడపకొచ్చారు. స్థానిక కోటిరెడ్డిసర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్, డైమండ్ షోరూంను సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించారు. షోరూం ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కాజల్‌ను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. షోరూంను ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన పలు డిజైన్ల ఆభరణాలను కస్టమర్లకు చూపించారు. దాదాపు అరగంట షోరూంలోనే సందడి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాజల్ అగర్వాల్ మలబార్ గోల్డ్, డైమండ్ భారతీయ […]పూర్తి వివరాలు ...
బత్తుల ప్రసాద్ వెలువరించిన కథా సంపుటి ‘గంజిబువ్వ’ ఆవిష్కరణ శనివారం రాత్రి హైదరాబాదులోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో జరిగింది. హైదరాబాదు బుక్ ఫెయిర్‌లో భాగంగా జరిగిన కార్యక్రమంలో చలనచిత్రాల నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆవిష్కరించి మొదటి పుస్తకాన్ని తెలంగాణా దర్శకుల సంఘం అధ్యక్షుడు అల్లాణి శ్రీధర్‌కు అందించారు. ఈ సంకలనంలో బత్తుల ప్రసాద్ రాసిన 16 కథలు ఉన్నాయి.ఇవి ఇంతకు ముందు వివిధ పత్రికలలో ప్రచురితమైన కథలు. గతంలో బత్తుల ప్రసాద్ కథలు ‘సగిలేటి కథలు’ పేర […]పూర్తి వివరాలు ...
అనగనగా మంగాపురం అని ఒక ఊరు. ఆ ఊర్లో జనాలంతా కూలీ నాలీ చేసుకుని రెక్కల కష్టం మీద బతికేవోల్లు. ఉన్నట్టుండి ఒక రోజు ఆ ఊరికి వచ్చిన కొంతమంది స్థానిక యాపారులకి అక్కడ ఉన్న భూముల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తెలిసింది. వెంటనే వాళ్ళు ఆ దేశపు రాజు దగ్గరికి పోయి ఇలా అడిగినారు.. ‘రాజా… మేము మంగాపురంలో ఉన్న బంగారు నిక్షేపాలను కనుగొన్నాం. మీరు అనుమతిస్తే ఆ నిక్షేపాలను వెలికితీసి అమ్ముతాం. తద్వారా వచ్చిన […]పూర్తి వివరాలు ...