కడప: జిల్లా పట్ల వివక్ష చూపుతున్న ప్రభుత్వం శ్రీరామనవమి ఉత్సవాలను ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో చేపడితే సహించేదిలేదని, ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలను కచ్చితంగా ఒంటిమిట్టలోనే నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… భద్రాచలంలోని శ్రీరామచంద్రమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు, పీతాంబరాలు సమర్పించేదని, ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో భద్రాచలం తెలంగాణ ప్రభుత్వంలోకి వెళ్లిందన్నారు. ఈ నేపథ్యంలో […]పూర్తి వివరాలు ...
దేవుని కడప బ్రహ్మోత్సవాలలో బేస్తవారం (గురువారం) నాటి కార్యక్రమాలు… ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం ఉదయం సూర్య ప్రభవాహనంపైన స్వామి భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ సాయంత్రం సింహ వాహనంపైన దేవుని కడప వీధులలో ఊరేగుతారు. పూర్తి వివరాలు ...
కడప: 93 మంది సభ్యులతో కూడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి పదిమంది ప్రధాన కార్యదర్శులు, పన్నెండు మంది కార్యదర్శులు, పద్దెనిమిది మంది సంయుక్త కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, కోశాధికారి, క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఇద్దరు, 44 మంది కార్యనిర్వాహక సభ్యులతో భారీ కార్యవర్గాన్ని ప్రకటించారు. స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం నగర మేయర్ కె.సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే […]పూర్తి వివరాలు ...
దేవుని కడప: కడప రాయడు శ్రీలక్ష్మీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా సాగినాయి. భక్తుల గోవింద నామస్మరణలతో దేవుని కడప మార్మోగింది. ఉత్సవాలలో భాగంగా ఉదయం తిరుచ్చి గ్రామోత్సవం, ధ్వజారోహణం కార్యక్రమాలను నిర్వహించినారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామి వారు శేషవాహనం పైన దేవిని కడప వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చినారు. ఉదయం తితిదే తిరుచానూరు నుంచి వచ్చిన వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారికి అభిషేకోత్సవం నిర్వహించినారు. దివ్య అలంకార శోభితులైన శ్రీదేవి, భూదేవి […]పూర్తి వివరాలు ...
కడప: దేవుని కడప లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం దీక్షాతిరుమంజనం, సాయంత్రం సేనాధిపతి ఉత్సవంతో ఉత్సవాలను ప్రారంభించారు. పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శోభ వచ్చింది. వాస్తుహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం చేశారు. రాత్రి శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు జరిగాయి. కార్యక్రమంలో తితిదే డిప్యూటీ ఈవో బాలాజీ ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఈ రోజు కార్యక్రమాలు ఉదయం 10 గంటలకు – తిరుచ్చి ధ్వజారోహణం 10.30 గంటలకు – స్నపన […]పూర్తి వివరాలు ...
కడప: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో జిల్లాకు చెందిన కందుల సోదరులు ఆదివారం భాజపాలో చేరారు. ఈ సందర్భంగా నగరంలోని పురపాలిక మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోకందుల శివానంద రెడ్డి మాట్లాడుతూ…విభజన వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందన్నారు. విభజన హామీలను సాధించడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. వైఎస్సార్ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉక్కు కర్మాగారం వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. రాయలసీమ […]పూర్తి వివరాలు ...
కడప: ఆదివారం ఉదయం కడప నగరంలోని అమీన్‌పీర్(పెద్ద) దర్గాను సినిమా కథానాయకుడు నారా రోహిత్ దర్శించి గురువులకు పూలచాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే ఆలోచన తనకు లేదన్నారు.రాష్ట్ర ప్రజలందరికి మేలు జరగాలని పెద్దదర్గాలో ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. నారా రోహిత్ అం.ప్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోదరుడైన రామ్మూర్తి నాయుడు కుమారుడు. ఈయన బాణం, సోలో, సారోచ్చారు, ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెలో మొదలైన చలనచిత్రాలలో కథానాయకుడిగా నటించారు.పూర్తి వివరాలు ...
కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట లోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం ఎంతో ప్రాచీనమైనది. చింతకుంట గ్రామ శివార్ల లోని చెరువు , గ్రామంలో శిధిలావస్థలో ఉన్న శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం చింతకుంట గ్రామ పురాతన చరిత్రకు, గతంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక వైభవానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. చెన్నకేశవ ఆలయం జనమేజయుని కాలంలో నిర్మించబడిందని గ్రామస్తులు చెబుతున్నప్పటికీ ఆలయ వాస్తు, నిర్మాణ రీతులను పరిశీలిస్తే ఈ ఆలయం విజయనగర రాజులకాలంలో 13,14 శతాబ్దాల కాలంలో నిర్మించ బడినట్లుగా దాఖలాలున్నాయి […]పూర్తి వివరాలు ...
సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. […]పూర్తి వివరాలు ...