వార్తా విభాగం

రాజకీయాలు

‘ఇప్పుడు స్పందించకపోతే తాగునీరూ దక్కదు’

ఒంటిమిట్ట స్ఫూర్తితో ఉద్యమించాల 25, 26వ తేదీల్లో ప్రాజెక్టుల పరిశీలన కడప: జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోతే జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని అఖిలపక్షం నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్మికనేత సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ప్రభుత్వ లాంఛనాలతో నవమి వేడుకలు నిర్వహించాలని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి వచ్చారన్నారు. ఫలితంగా […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఒంటిమిట్ట రాముడికే : దేవాదాయ శాఖా మంత్రి

ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటిమిట్టలో అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు శుక్రవారం హైదరాబాదులో తెలిపారు. ఆ రోజు స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. 11వ శతాబ్దంలోనే ఈ దేవాలయం నిర్మించినట్లు ఆధారాలున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కోదండరామాలయాన్నిపరిశీలించిన ప్రిన్పిపల్ సెక్రటరీ స్థానిక కోదండరామాలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్పిపల్ కార్యదర్శి ఏవీఎస్ ప్రసాద్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

గంగమ్మను దర్శించుకున్న నేతలు

అనంతపురం: గంగమ్మ జాతరలో గురువారం నేతల సందడి కనిపించింది. అమ్మవారిని దర్శించుకోడానికి నాయకులు తరలిరావడంతో సాధారణ భక్తులు క్యూలైన్లలో గంటలకొద్దీ వేచి ఉండాల్సి వచ్చింది. శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు.రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు జరిపించారు. మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. జాతర సందర్భంగా అనంతపురం గంగమ్మను న్యాయమూర్తులు దర్శించుకున్నారు. లక్కిరెడ్డిపల్లె న్యాయమూర్తి చెంగల్‌రాయనాయుడు, […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

గంగమ్మకు కల్లు ముంతలతో ప్రత్యేక పూజలు

లక్కిరెడ్డిపల్లె: రాయలసీమలోనే ప్రసిద్ది గాంచిన లక్కిరెడ్డిపల్లె మండలంలోని అనంతపురం గంగమ్మ జాతర ఉత్సవాలు గురువారం వైభవంగా జరిగినాయి. జాతరకు భక్తజనం పోటెత్తారు. గురువారం తెల్లవారుజామున చాగలగుట్టపల్లి నుంచి అమ్మవారి చెల్లెలైన కుర్నూతల గంగమ్మ భారీ వూరేగింపు నడుమ అనంతపురంలోని ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. దారి పొడవునా వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం సమీపంలోకి చాగలగుట్టపల్లె అమ్మవారు చేరుకోగానే అనంతపురం గంగమ్మ ఆలయ అర్చకులైన చెల్లు వంశీయులు అమ్మవారికి కల్లు ముంతలతో […]పూర్తి వివరాలు ...

పర్యాటకం శాసనాలు

పౌరాణిక భౌగోళిక చారిత్రక ప్రాధాన్యాన్ని నింపుకొన్న ఒంటిమిట్ట

పౌరాణికం 1. సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్నపుడు సీతమ్మ కోసం రామయ్య బాణం సంధించి భూమి నుంచి నీరు తెప్పించిన చోటు ఇక్కడుంది. అక్కడే నేడు రామతీర్థం వెలసింది. 2. సీతమ్మ కోసం వెతుకుతూ జాంబవంతుడు ఇక్కడ ఒక రాత్రి నిద్రించాడు. మరునాటి ఉదయం ఒక శిలలో సీతారామలక్ష్మణుల్ని, భావించి నమస్కరించి అన్వేషణకు బయలుదేరాడు. ఈ గుట్ట మీద నిర్మాణం అయిందే కోదండరామాలయం. భౌగోళికం తిరుమల నుంచి కడపకు వస్తున్న శేషాచలం కొండలు ఒంటిమిట్టను దాటుకొంటూ విస్తరించాయి. ఆ […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఒంటిమిట్ట రామయ్యకు ప్రభుత్వ లాంఛనాలు?

కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయానికే శ్రీరామనవమి నాడు ప్రభుత్వ లాంఛనాలు అందజేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు సమాచారం. ప్రభుత్వం వైపు నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాష్ర్టం విడిపోయిన నేపధ్యంలో రాష్ట్రంలోని అత్యంత పురాతనమైన, గొప్ప ప్రశస్తి గల ఒంటిమిట్ట కోదండ రామయ్యకు ప్రభుత్వ లాంచనాలు అందుతాయని జిల్లా ప్రజలు ఆశించారు. విజయనగరం జిల్లాలోని రామతీర్థం రామాలయానికి ఆ హోదా దక్కనుందని ఒక వర్గం మీడియాలో ప్రచారం జోరందుకుంది. దీంతో ఒంటిమిట్టకే రాజ […]పూర్తి వివరాలు ...

పర్యాటకం

పుష్పగిరి ఆలయాలు

వైష్ణవులకిది మధ్య ఆహోబిలమూ శైవులకిది మధ్య కైలాసమూ కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో పుష్పగిరి క్షేత్రం కొండపై ఉంది. కింద పుష్పగిరి గ్రామం ఉంది. ఇది హరిహరాదుల క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో ప్రాచీన కాలంలో వందకు పైగా ఆలయాలు ఉండేవన్న పురాణగాధ ప్రచారంలో ఉంది. బ్రహ్మాండ, వాయు పురాణాల్లో ఈ క్షేత్ర మహిమను వ్యాస మహర్షి ప్రస్తావించారుట. ఆది శంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం, విద్యారణ్యస్వామి ప్రతిష్ఠించిన శ్రీచక్రంతో దర్శనీయ క్షేత్రంగా […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

లక్కిరెడ్డిపల్లి గంగ జాతర మొదలైంది

రాయచోటి: అనంతపురం (లక్కిరెడ్డిపల్లి) గంగమ్మ జాతర ఈ పొద్దు (బుధవారం) ప్రారంభమైంది. గుడిలో గంగమ్మవారికి శాస్త్రోక్తంగా దీపం వెలిగించి పూజలు నిర్వహించి చెల్లోల్ల వంశీయులు అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం బుధవారం తెల్లవారుజామున బోనాలు సమర్పించారు. ఆలయానికి సమీపంలో ఉన్న గొల్లపల్లిలోని చెల్లోల్లు వంశీయులు అమ్మ వారికి సోమవారం అర్ధరాత్రి ప్రత్యేకంగా పూజలు జరిపించారు. అనంతరం గ్రామంలో వూరేగింపు నిర్వహించి చౌటపల్లి, కొత్తపల్లిల మీదుగా గంగమ్మను ప్రధాన ఆలయానికి తీసుకొచ్చారు బుధ, గురు, శుక్రవారాల్లో గంగమ్మ జాతర నిర్వహిస్తారు. భక్తులకు […]పూర్తి వివరాలు ...

కైఫియత్తులు

పీనాసి మారాబత్తుడు

తెలుగు వారు మరువలేని ఆంగ్లేయులు కొందరున్నారు.సాహిత్యానికి సేవ చేసిన బ్రౌన్,లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన కాటన్,స్థానిక చరిత్రలను ఏకరించిన కల్నల్ కాలిన్ మెకంజి.1810-15 మధ్య మద్రాస్ surveyor general గా 1816-21 వరకు భారతదేశ మొదటి surveyor generalగా పనిచేసిన ఈయన గ్రామ చరిత్రలను సేకరించాడు.వీటినే కైఫియత్లు,దండెకవిలె లు అంటారు.వీటిలో కడప కైఫియత్లను 5 భాగాలు గా కడప c.p.brown memorial పూర్తి వివరాలు ...

error: