కడప జిల్లాలో 48 కులాలను సూచించే ఊర్ల పేర్లున్నాయి. కులాల పేర్లను సూచించే ఆయా ఊర్లలో ఆ కులస్తులే ఉంటారనుకోవడం ఊహే అవుతుంది. కులాల పేర్లు సూచించే గ్రామ నామాలను ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారు తన పరిశోధనా గ్రంధం ‘కడప ఊర్లు – పేర్లు’లో విశదీకరించారు. ఆ వివరాలు కడప.ఇన్ఫో వీక్షకుల కోసం …
ఆసాది – ఆసాదివాండ్లపల్లె (6)
ఈడిగ – ఈడిగపల్లె (17)
ఉప్పర – ఉప్పరపల్లె (13), ఉప్పరకొట్టాలు
ఏకరి – ఏకర్లపాలెం
వడ్డె – వడ్డిల్లు, వడ్డిండ్లమిట్ట (2), వడ్డె అగ్రహారం, వడ్డెపల్లె (57), వడ్డెపాలెం (2), వడ్డెవాండ్లపల్లె, వడ్డెవారిపల్లె
కంసాలి (ప. వడ్ల) – కంసలపల్లె, కంసలవాండ్లపల్లె, కంసలవారిపల్లె, వడ్లవాండ్లపల్లె (2)
కమ్మ (పర్యాయ పదం : నాయుళ్ళు) – కమ్మగుట్టపల్లె, కమ్మపల్లె (10), కమ్మపాలెం, కమ్మవారిపల్లె (5), కమ్మవారి బ్రాహ్మణపల్లె, నాయునిఎర్రపల్లె, నాయునిపల్లె (2), నాయునివాండ్లపల్లె, నాయునివారిపల్లె (10), నాయుని వారి సుగాలితాండ
కాపు (పర్యాయపదం : రెడ్లు) – కాంబల్లె (2), కాపుపల్లె (2), రెడ్డికొట్టాల, రెడ్డిగారిపల్లె (8), రెడ్డినగరం, రెడ్డిపల్లె (5), రెడ్డిపల్లె పేట, రెడ్డిమల్లువాండ్లపల్లె, రెడ్డివారిపల్లె (30), కొడిదెపల్లె (రెడ్లలో ఒక శాఖ కొడిదె)
కుమ్మర – కుమ్మరపల్లె (23), కుమ్మరరావులపల్లె, కుమ్మరవాండ్లపల్లె, కుమ్మరవానిపల్లె, కుమ్మరవారిపల్లె (3), కుమ్మరకొట్టాలు
కోమటి (పర్యాయపదం : శెట్లు) – కోమటికుంట,కోమటిపల్లె, కోమటిపేట, కోమన్నూతల, శెట్టిగుంట, శెట్టిపల్లె, శెట్టివాండ్లపల్లె (2), శెట్టివారిపల్లె (4)
గాండ్ల (పర్యాయపదం : తెలగ ) – గాండ్ల తిమ్మాయపల్లె, గాండ్లపల్లె (7), గాండ్లవాండ్లపల్లె, గాండ్లవారిపల్లె, తెలగాపురం
తెలికి – తెలికి
గాజుల – గాజులపల్లె (2), గాజులపేట (2)
గూడ – గూడావాండ్లపల్లె
గొరగ – గొరిగెనూరు
గొల్ల (పర్యాయపదం : యాదవ, రేడు) – గొల్లఓబాయపల్లె (33), గొల్లబాలసానివాండ్లపల్లె, గొల్లలఉప్పలపాడు, గొల్లలగూడూరు, గొల్లవాండ్లపల్లె (2), గొల్లవారిపల్లె (2), యాదవకుంట, యాదవరాజుపల్లె, యాదవాపురం (2), రేపల్లె (4)
గౌడు – గౌనివాండ్లపల్లె
చాకలి – చాకలపల్లె, చాకలవాండ్లపల్లె, సాకిబండ లేదా చాకిబండ
జంగం – జంగంపల్లె (8), జంగాలపల్లె (4)
జోగి – జోగాపురం
తంబల్లు – తంబల్లగొంది, తంబల్లవారిపల్లె
తొగట – తొగటపల్లె (3)
దాసరి – దాసరిపల్లె (3), దాసరివాండ్లపల్లె
దూదేకుల – దూదేకులపల్లె (4), దూదేకులపాలెం
దొమ్మర – దొమ్మరనంద్యాల
మేదర – మేదరపల్లె
నేదర – నేదరపేట
పంబల – పంబలపల్లె
పిచ్చిగుంట్ల – పిచ్చిగుంట్ల (6), పిచ్చిగుంట్లవాండ్లపల్లె
పూసల – పూసలకొట్టాలు
పైడి – పైడిపాలెం
బలిజ – బలిజపల్లె (17)
బింగి – బింగివాండ్లపల్లె
బెస్త – బెస్తపల్లె (10), బెస్తవారిపల్లె, బెస్తవేముల
బేరి – బేరిపల్లె (3)
బైనేని – బైనేనివాండ్లపల్లె
బొందిలి – బొందలకుంట, బొందిల్లపల్లె
బోగం – బోగంపల్లె
బోయ – బోయపల్లె (5), బోయిల్లవారిపల్లె, బోళ్ళగొందిచెరువు
బ్రాహ్మణ (పర్యాయపదం : అయ్యవార్లు) – బ్రాహ్మణ ఎర్రగుడి, బ్రాహ్మణపల్లె (5), అయ్యవారి కంబాలదిన్నె, అయ్యవారిపల్లె (8), అమ్మగారిపల్లె, అమ్మయ్యగారిపల్లె (2)
భట్రాజులు – భట్టువారిపల్లె, భట్రాజులపల్లె, బొట్లచెరువు, భట్ల ఒంటిపల్లె
మంగళ – మంగళపల్లె (8), మంగళవాండ్లపల్లె, మంగలివారిగరుగుతాండ
మరాటి – మరాటిపల్లె (2)
ముత్తరాచ – ముత్తరాచుపల్లె (3)
మొండి – మొండిండ్లు
రాచ (పర్యాయపదం : క్షత్రియ) – రాచగొల్లపల్లె, రాచపల్లె (21), రాచపాలెం, రాచవారిపల్లె (2), రాజుకుంట, రాజుపల్లె (2), రాజుపాలెం (12), రాజుపేట (2), రాజువారిపల్లె (2), రాజువారిపేట
వెలమ – వెలమవారిపల్లె (2)
సాతాని – సాతానిపల్లె
సాతు – సాతపల్లె
సాలె – సాలెవారి ఉప్పలపాడు
సింగం – సింగంవాండ్లపల్లె