
అది నాయపరాధ మిది నాయపరాధ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అది నాయపరాధ మిది నాయపరాధ మదియు నిదియు నాయపరాధము ॥చ1॥ నెరయ రూపములెల్ల నీరూపమేకా నరయని యది నాయపరాధము పరిపూర్ణుఁడగు నిన్నుఁ బరిచ్ఛిన్నునిఁగా- నరయుట యది నాయపరాధము ॥చ2॥ జీవాత్మునిఁగాఁ జింతింపఁ దలఁచుట యావంక నది నాయపరాధము సేవించి నిను నాత్మఁ జింతింపకుండుట ఆవల నిది నాయపరాధము ॥చ3॥ యీడెరఁగక వేంకటేశుఁడ నినుఁ గొని- యాడుట యది నాయపరాధము యేడఁ జూచిన నాయెదుర నుండఁగ నిన్ను నాడ నీడ వెదకుటపరాధము |
రాగము: మాళవి రేకు: 0044-04 సంపుటము: 1-271 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, మాళవి