24న రిమ్స్‌లో వాక్-ఇన్-ఇంటర్వ్యూలు

    కడప : రిమ్స్ వైద్య కళాశాలలో ట్యూటర్స్, జూనియర్ రెసిడెంట్ డాక్టర్లగా కాంట్రాక్టు పద్దతిన పనిచేసేందుకు ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ (ఉదయం 10.30 గంటలకు) జరిగే వాక్-ఇన్-ఇంటర్వ్యూకు  హాజరు కావాలని కళాశాల ఇన్‌చార్జి డెరైక్టర్ డాక్టర్ ఓబులేశు ఒక ప్రకటనలో తెలిపారు.

    అర్హతలు:

    ట్యూటర్స్‌కు ఎంబీబీఎస్ డిగ్రీ, ఎంఎస్సీ మెడికల్ ఫిజియాలజీ, ఫెథాలజీ, మైక్రో బయాలజీ అర్హత కలిగి ఉండాలన్నారు.

    ప్రాధాన్యత:

    ఎంబీబీఎస్ డిగ్రీ (పీజీ డిప్లొమా, డిగ్రీ) అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.

    చదవండి :  గాంధీజీకి, కడప హరిజన మిత్రులకు మధ్య జరిగిన సంభాషణ

    ఖాళీల సంఖ్య:

    ట్యూటర్స్:‌ 07

    జూనియర్ రెసిడెంట్స్:‌ 46

    అర్హత కలిగిన అభ్యర్థులు అసలు సర్టిఫికెట్లతో పాటు నిర్ణీత సమయానికి హాజరు కావాలని తెలిపారు. ఇతర వివరాలకు కడప రిమ్స్ వైద్య కళాశాల డెరైక్టర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

    రిమ్స్ ఛాయా చిత్రమాలిక

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *