
యోవేవి ఎగ్జామినేషన్ కంట్రోలర్‌ను తిట్టిన తెదేపా నేత?
కడప: బసవతారకం మెమోరియల్ లా కళాశాల అధిపతిగా ఉన్న అధికార తెదేపా నేత గోవర్ధన్ రెడ్డి సహనం కోల్పోయి యోవేవి అసిస్టెంట్ ఎగ్జామినేషన్ కంట్రోలర్‌ను మంగళవారం తిట్టినట్లు ఇవాళ ఒక పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించింది. అదే కళాశాలలో ఉన్న (లా కళాశాల) పరీక్షా కేంద్రాన్ని అధికారులు ఈ సారి యోవేవి ప్రాంగణంలోనే నిర్వహిస్తున్నారు. దాంతో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పోవడంతో చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం రాబోవు ఏడాది అడ్మిషన్లపై పడే అవకాశం ఉండటంతో గోవర్ధన్‌రెడ్డి కోపం కట్టలు తెంచుకుని యోవేవి అధికారిని దూషించినట్లు తెలుస్తోంది.
ఇదే విషయమై యోగి వేమన విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ లక్ష్మీప్రసాద్ ఒక దినపత్రికతో మాట్లాడుతూ.. ‘పరీక్షా కేంద్రం నుంచి డిపార్టుమెంట్‌కు వెళ్లగానే ఫోన్ కాల్ వచ్చింది. రీసీవ్ చేసుకోగానే బూతులు అందుకున్నారు. ఏమాత్రం సంబంధం లేని కుటుంబసభ్యుల్ని దూషించారు. అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు. ఇదే విషయాన్ని నా సహచరులకు చెప్పాను. సంఘీభావం ప్రకటించారు. రిజిస్ట్రార్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశాం. దళితుడిననే చిన్నచూపుతో కులం పేరుతో దూషించారు’ అని తెలిపారు.
ఏది ఏమైనా విశ్వవిద్యాలయ అధికారులను నాయకులు వారు ఏ పార్టీకి చెందిన వారైనా దూషించటం తప్పు. ఏదైనా నిరసన లేదా అభ్యర్థన చేయాలనుకుంటే సరైనా పద్దతిలో తెలియచేయవచ్చు. ఇటువంటి సంఘటనలు ఆయా పార్టీలకు, నాయకులకు, జిల్లాకు సైతం చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది.
కడప జిల్లా పైన (పసుపు) పచ్చని విషం
Wednesday, July 24, 2019