ఏప్రిల్ 3 నుండి కడపలో పాస్‌పోర్ట్ సేవలు
కడపలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు
విదేశాంగ మరియు తపాల శాఖల మధ్య అవగాహనా ఒప్పందం
జిల్లా వాసులకు తిరుపతి పోయే బాధ తప్పనుంది
కడప: ఏప్రిల్ మూడవ తేదీ నుండి కడప జిల్లా వాసులకు స్థానికంగా పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక మీదట నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో (హెడ్ పోస్టాఫీసు) పాస్‌పోర్ట్ సేవలు అందిస్తారు. దీంతో జిల్లా వాసులు పాస్‌పోర్ట్ కోసం తిరుపతి లేదా హైదరాబాదు పోవాల్సిన బాధ తప్పుతుంది.
ఏప్రిల్ 3 నుండి పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు పత్రాల తనిఖీ, గుర్తింపు నమోదును పూర్తిచేసుకునే దానికి పాస్‌పోర్ట్ సేవల వెబ్ సైట్లో కడపను ఎంపిక చేసుకోవచ్చు.
పాస్‌పోర్ట్ సేవలు అందించడానికి వీలుగా కడప హెడ్ పోస్టాఫీసులో అవసరమైన మార్పులు చేశారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. 3వ తేదీన ఈ పాస్‌పోర్ట్ సేవల కేంద్రం ప్రజలకు అందుబాటులోకి రానుంది.
జనవరి 24న కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు తపాల శాఖల మధ్య జరిగిన అవగాహనా ఒప్పందం మేరకు కడపలో పాస్‌పోర్ట్ సేవల కేంద్రం ఏర్పాటవుతోంది. (ఆధారం: http://www.mea.gov.in/press-releases.htm?dtl/28054/Opening_of_the_first_batch_of_new_Post_Office_Passport_Seva_Kendras)
ఈ ఒప్పందంలో భాగంగా మొదటి విడతగా ఆంధ్రప్రదేశ్ లోని కడప, కర్నూలు నగరాలలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తపాల శాఖ ముందుకు వచ్చింది. పోస్టాఫీసుల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు అందించే ఈ కేంద్రాలను పీవో పీఎస్కేలుగా వ్యవహరించనున్నారు.
****
ఏప్రిల్ మూడవ తేదీ నుండి కడప జిల్లా వాసులకు స్థానికంగా పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక మీదట నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో (హెడ్ పోస్టాఫీసు) పాస్‌పోర్ట్ వ్యవహారాలకు సంబంధించిన సేవలు అందిస్తారు. దీంతో జిల్లా వాసులు పాస్‌పోర్ట్ కోసం తిరుపతి లేదా హైదరాబాదు పోవాల్సిన బాధ తప్పుతుంది.
ఏప్రిల్ 3 నుండి పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు పత్రాల తనిఖీ, గుర్తింపు నమోదును పూర్తిచేసుకునే దానికి పాస్‌పోర్ట్ సేవల వెబ్ సైట్లో కడపను ఎంపిక చేసుకోవచ్చు.
పాస్‌పోర్ట్ సేవలు అందించడానికి వీలుగా కడప హెడ్ పోస్టాఫీసులో అవసరమైన మార్పులు చేశారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. 3వ తేదీన ఈ పాస్‌పోర్ట్ సేవల కేంద్రం ప్రజలకు అందుబాటులోకి రానుంది.
జనవరి 24న కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు తపాల శాఖల మధ్య జరిగిన అవగాహనా ఒప్పందం మేరకు కడపలో పాస్‌పోర్ట్ సేవల కేంద్రం ఏర్పాటవుతోంది. (ఆధారం: http://www.mea.gov.in/press-releases.htm?dtl/28054/Opening_of_the_first_batch_of_new_Post_Office_Passport_Seva_Kendras)
ఈ ఒప్పందంలో భాగంగా మొదటి విడతగా ఆంధ్రప్రదేశ్ లోని కడప, కర్నూలు నగరాలలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తపాల శాఖ ముందుకు వచ్చింది.