జేసీ దివాకర్‌రెడ్డికి, పులివెందులకు ఉన్న సంబంధం…

కోవరంగుంటపల్లె: ప్రముఖుల పుట్టినిల్లుగా పేరొందిన కోవరంగుంటపల్లెకు స్వాతంత్య్ర సమర యోధుల గడ్డగా కూడా పేరుంది. కడప గాంధీగా పేరొందిన దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి స్వగ్రామం ఇదే. స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఈయన ఇంగ్లాండ్‌లో బారిష్టర్ చదివారు. గాంధీ ఆశయాలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. స్వాతంత్య్రం కోసం జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు అరెస్టు చేసి ఒక ఏడాది పాటు జైలులో ఉంచారు. రామసుబ్బారెడ్డి జైలు నుంచి విడుదలయిన కొద్ది రోజులకే గాంధీ విదేశీవస్తు బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామసుబ్బారెడ్డిని పోలీసులు మళ్లీ అరెస్టు చేసి జైలుకు పంపారు.

చదవండి :  పులివెందుల నుంచి వైఎస్ జగన్ పోటీ
Devi Reddy Rama SUbba Reddy
దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి

అనంతరం స్వాతంత్య్రం వచ్చాక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా, ఎమ్మెల్సీగా, తొలి జడ్పీ అధ్యక్షునిగా ఉన్నారు. ఈయనతో పాటు డీఆర్ సుబ్బారెడ్డి,డీవీ సుబ్బారెడ్డి, చవ్వా రామిరెడ్డి, పాలెం గంగిరెడ్డి, నల్లబల్లె గంగిరెడ్డి స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. గడ్డం రామకృష్ణారెడ్డి, గంగిరెడ్డి, సోమక్క పులివెందుల కాలువ కోసం పోరాటం సాగించారు. డి.రామకృష్ణారెడ్డి పులివెందుల సమితి అధ్యక్షులుగా ఉన్నారు. డీ.ఎన్.రెడ్డి జడ్పీ చైర్మన్‌గానూ, కడప పార్లమెంటు సభ్యునిగా, పబ్లిక్ సర్వీస్ చైర్మన్‌గా ఉన్నారు. రాయచోటి నియోజకవర్గ శాసన సభ్యునిగా పనిచేసిన రాచమల్లు నారాయణరెడ్డి ఈ గ్రామవాసే. డీ.నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా పనిచేశారు. హైకోర్టు జడ్జి బసిరెడ్డి ఈ గ్రామం అల్లుడే. దర్శకులకే దర్శకుడిగా పేరుగాంచిన కె.వి.రెడ్డి కుమార్తెను ఈ గ్రామ వాసికి ఇచ్చారు.

చదవండి :  యోవేవికి ఒకేసారి ఆరు రామన్ ఫెలోషిప్‌లు

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన జేసీ దివాకర్‌రెడ్డి ఈ గ్రామంలో వివాహం చేసుకున్నారు. ఇలా ఎందరో ప్రముఖులకు, రాజకీయ చైతన్యానికి కోవరంగుంటపల్లె పురిటిగడ్డగా నిలిచింది. దివాకర్‌రెడ్డి సతీమణి, పులివెందుల ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి తల్లికి స్వయానా సోదరి.

ఇదీ చదవండి!

పులివెందుల రంగనాథ స్వామి

పులివెందుల రంగనాథ స్వామి వారి చరిత్రము – లగిసెట్టి వెంకటరమణయ్య

పుస్తకం : పులివెందుల రంగనాథ స్వామి వారి చరిత్రము ,  రచన: లగిసెట్టి వెంకటరమణయ్య,  ప్రచురణ : 1929లో ప్రచురితం.  …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: