2014-15 విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపధ్యంలో జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల వివరాలను జిల్లా విద్యాధికారి అంజయ్య వెల్లడించారు. ఎంఈవోలు మండల తహసీల్దార్ల సహకారంతో మండలంలో గుర్తింపులేని పాఠశాలలను మూసివేయాలని డీఈవో ఆదేశాలిచ్చారు. ఈ పాఠశాలలో పిల్లలను చేర్పించాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. లేనిపక్షంలో విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది.
విద్యాశాఖ ప్రకటించిన గుర్తింపులేని పాఠశాలలివే
కడప నగరం
– సాయిపేట మాస్టర్స్ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల
– మాసాపేటలోని సాయి ఆంగ్లమాధ్యమ ఉన్నత పాఠశాల
– కోఆపరేటీవ్ కాలనీ చైతన్య ఆంగ్ల మాధ్యమ పాఠశాల
పెనగలూరు
రాజమాత యూపీ పాఠశాల
పెండ్లిమర్రి
– ఎల్లటూరు విద్యామందిర్ ప్రాథమిక పాఠశాల
ప్రొద్దుటూరు
– మదూరు రోడ్డు కొర్రా పబ్లిక్ ఉన్నత పాఠశాల
– వైజీఎల్ బైపాస్ రోడ్డులోని బీఎంఎంఈ టెక్నో ఉన్నత పాఠశాల
రామపురం
– శ్రీమన్ నారాయణ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు ప్రాథమిక పాఠశాల
రాయచోటి
– అర్చన ప్రాథమిక పాఠశాల
– శ్రీ బాలాజి ప్రాథమిక పాఠశాల
చక్రాయపేట
– శ్రీతేజా ఆంగ్లమాధ్యమ యూపీ పాఠశాల
చిన్నమండెం
– పేరు ఖరారు చేయని ప్రాథమిక పాఠశాల
చిట్వేలి
– అరుణోదయ యూపీ పాఠశాల
సిద్దవటం
– బాక్రాపేట 9 బెటాలియన్ ఎస్టీ థామస్ ప్రాథమిక పాఠశాల
– ఉప్పరపల్లి చావన్ శిశు విహార్ యూపీ పాఠశాల
– ఫియో ఇంటర్నేషనల్ కిడ్స్ యూపీ పాఠశాల
– గీతం కిడ్స్ వరల్డ్ యూపీ పాఠశాల
వేముల
– సాయి విద్యానికేతన్ యూపీ పాఠశాల
ఒంటిమిట్ట మండలం
– మాధవరం -2 సాయి భారతి ఎలిమెంటరీ పాఠశాల
ఎర్రగుంట్ల
– కలమల్ల శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రాథమిక పాఠశాల
– శ్రీ చైతన్య పబ్లిక్ ప్రాథమిక పాఠశాల