
ఆదినారాయణ రెడ్డి చదిపిరాళ్ల – జమ్మలమడుగు
జమ్మలమడుగు ఎమ్మెల్యేని అరెస్టు చేశారు
కౌన్సిలర్లను దూషించిన కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డిని శనివారం సాయంత్రం ఎర్రగుంట్ల పోలీసు స్టేషన్ లో లొంగిపోయినట్లు సీఐ కేశవరెడ్డి తెలిపారు. అనంతరం పూచీకత్తుపై స్టేషన్‌లోనే బెయిల్ ఇచ్చి విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో కౌన్సిలర్లను దూషిస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఐపీసీ సెక్షన్ 153, 504, 506ల క్రింద ఎర్రగుంట్ల పోలీసులు ఎమ్మెల్యే, మరో అయిదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని శనివారం సాయంత్రం లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.
జూన్ 16న ఎర్రగుంట్లలో వైకాపా తరఫున గెలుపొంది టీడీపీకి మద్దతు పలికిన ఎర్రగుంట్ల నగర పంచాయతీ కౌన్సిలర్లకు వ్యతిరేకంగా ర్యాలీ, ధర్నా, బైఠాయింపులు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు నిర్వహించారు.