హీనదశలఁబొంది యిట్ల నుండుటకంటె

॥పల్లవి॥
హీనదశలఁబొంది యిట్ల నుండుటకంటె
నానావిధులను నున్ననాఁడే మేలు
॥చ1॥
అరుదైన క్రిమికీటకాదులందుఁ బుట్టి
పరిభవములనెల్లఁ బడితిఁ గాని
యిరవైనచింత నాఁడింతలేదు యీ-
నరజన్మముకంటె నాఁడే మేలు
॥చ2॥
తొలఁగక హేయజంతువులయందుఁ బుట్టి
పలువేదనలనెల్లఁ బడితిఁగాని
కలిమియు లేమియుఁ గాన నేఁ డెఱిఁగి
నలఁగి తిరుగుకంటె నాఁడే మేలు
॥చ3॥
కూపనరకమున గుంగి వెనకకు నేఁ
బాపవిధులనెల్లఁ బడితిఁగాని
యేపునఁ దిరువేంకటేశ నా కిటువలె
నాపాలఁ గలిగినాఁడే మేలు
రాగము: దేసాక్షి
రేకు: 0001-03
సంపుటము: 1-3

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, దేసాక్షి

చదవండి :  వలపులధికము సేయు వైభవములు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: