సిద్దవటం కోట
సిద్దవటం కోట దక్షిణ భాగపు తైలవర్ణ చిత్రం (పెన్నా నది ఒడ్డు నుండి కనిపించే దృశ్యం)

శత్రుదుర్భేద్యమైన సిద్ధవటం కోట

వై.ఎస్.ఆర్ జిల్లాలోని మండల కేంద్రమైన సిద్ధవటంలో ఉన్న శత్రుదుర్భేద్యమైన కోట ఆ నాటి స్మృతులను నేటికీ కళ్లకు కట్టినట్టు ఆవిష్కరిస్తుంది. రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ సిద్ధవటం కోట మన చారిత్రక సంపదల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. పూర్వకాలంలో సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో సిద్ధులు ఎక్కువగా నివసిం చేవారట. వారు నివాసం ఉండే వట వృక్షాలు (మఱ్ఱి చెట్లు) విస్తారంగా ఉండేవట. అందుకే ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతుంటారు.

 సిద్ధవటం కోట
సిద్ధవటం కోట

సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో జెైనులు కూడా నివసిస్తూ ఉండేవారు. మొదట్లో (1807 నుంచి 1812) సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఉండే ది. అయితే పెన్నానది ఉప్పొంగిన ప్రతిసారి ఈ ప్రాంతానికి బయటి ప్రపంచం తో సంబంధాలు తెగిపోతూ ఉండడంతో జిల్లా కేంద్రాన్ని అక్కడి నుంచి కడపకు మార్చారు. అయినప్పటికీ తనలో ఇముడ్చుకున్న చారిత్రక సాక్ష్యాలతో సిద్ధవ టం మరింత పేరుగాంచింది. ఇక్కడ నిర్మించబడిన శత్రు దుర్భేద్యమైన కోట పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ కోటను 1956లో పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసు కుంది.

కేవలం పురాతన కోటలకే కాదు ఆలయాలకు కూడా ప్రసిద్ధిగాంచింది సిద్ధవటం. దీనిని బలపరుస్తూ… సమీపంలో ఏటి పొడవునా దేవాలయాలుండడం విశేషం. ఇందులో రంగనాథస్వామి ఆలయం ఎంతో కీర్తిగడిచింది. ఇక్కడి స్మశానవాటికలో భాకరాపంతులు పేరుతో నిర్మించిన 16 స్తంభాల మంటపం ఉంది ఎంతో విశిష్టమైనది. ఇవి సందర్శకులను ఆకర్షించడంలో ప్రధానపాత్ర పోషిస్తున్నాయి.

చదవండి :  కడప, పులివెందుల ఉపఎన్నికల తాజా సమాచారం

శ్రీ కృష్ణదేవరాయలు అల్లుడైన వరదరాజు పరిపాలనలో ఈ కోట ఎంతో అభి వృద్ధి చెందినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. మట్లి రాజులు ఈ కోటను పాలించే నాటికి ఇది మట్టి కోట. ఆ తరువాత వరదరాజు ఆధీనంలోకి వచ్చింది. అంతకు ముందు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో ఉండేది. రెండవ వెంకటపతి రాయలకు మట్లి ఎల్లమరాజు యుద్ధాలలో ఎప్పుడూ సహకరించేవాడు. అందు కు గుర్తుగా సిద్ధవటాన్ని ఎల్లమరాజుకుకు కానుకగా ఇచ్చాడు. అంతేకాకుండా మరికొన్ని ప్రాంతాలను సిద్ధవటానికి చేర్చాడు. మట్లి అనంతరాజు మట్టికోటను శతృదుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. ఈయన తన తండ్రి పేరున ఎల్లమ రాజు చెరువు, తన పేరుతో అనంతరాజు చెరువులను త్రవ్వించాడు. కవిగా కూడా పేరుగాంచిన అనంతరాజు ‘కకుస్థ విజయం’ లాంటి కొన్ని కావ్యాల్ని రచిం చాడు. ఉప్పుగుండూరు వెంకటకవి, కవి చౌడప్ప లాంటి పేరొంది న కవులు ఈయన ఆస్థానంలో ఉండేవారు.

మట్లి రాజుల పతనం తరువాత గోల్కొండ సేనాపతి మీర్‌ జుమ్లా సిద్ధవటంపెై దండెత్తి ఆక్రమించుకున్నాడు. అటు పిమ్మట ఆర్కాటు నవాబులు సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడపను పాలిస్తున్న అబ్దుల్‌ నబీఖాన్‌ 1714 లో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొన్నాడు. అంతేకాకుండా మయానా నవాబులు కూడా సిద్ధవటాన్ని పాలించినవారిలో ఉన్నారు. చివరకు 799లో సిద్ధవటం ఈస్టిండియా కంపెనీ చేతుల్లోకి వెళ్లింది.

చదవండి :  కడప శాసనసభ తుదిపోరులో 15 మంది

సిద్ధవటం కోటకు రెండు ద్వారాలున్నాయి. పడమటి దిశగా ఒకటి, తూర్పు దిశగా మరొక ద్వారాన్ని ఎంతో పటిష్టంగా నిర్మించారు. ముఖద్వాద్వారానికి ఆంజనేయస్వామి, గరుత్మంతుడి శిల్పా లు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి. పశ్చిమ ద్వారం ఇరు వెైపులా నాట్య భంగిమలో ఉండే అందమైన శిల్పాలు అప్పటి పాల కుల కళాభిరుచికి అద్దం పడుతున్నాయి. ఈ శిల్పాలు సందర్శకు లను ఇట్టే ఆకర్షిస్తాయి. పశ్చిమ ద్వారం లోపలి పెై భాగంలో… రాహువు గ్రహణం పట్టడం నుండి వీడే వరకు అన్ని దశలు ఇక్కడ దృశ్యరూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తు న్న ఈ కోట మధ్య భాగంలోని అంతఃపురం శిథిలమై ఉండడం విచార కరం. రాణి దర్బార్‌, ఈద్గా మసీదు, సమీపంలో నగారాఖానా ఉన్నాయి. నగారాఖానా వెనుక కోట గోడకు మధ్య తాగునీటి కోనేరు ఉంది.

కోటలో సిద్ధవటేశ్వరస్వామి ఆలయం, ఎదురుగా నంది విగ్రహం ఉన్నాయి. నానాటికీ శిథిలమవుతున్న కామాక్షి ఆలయాన్ని కొన్నేళ్ళ క్రితం మరమ్మత్తు లు చేసి అద్భుతంగా మలచారు. తూర్పు ద్వారానికి సమీపంలో… టిప్పు సుల్తాన్‌ కాలంలో నిర్మించిన బిస్మిల్లా షావలి దర్గా ఉంది. దాని పక్కనే మసీ దు ఉంది. మసీదుకు తూర్పుగా కోటగోడలో ఏట్లోకి వెళ్ళే సొరంగ మార్గాన్ని నిర్మించారు. చక్రయంత్రం ద్వారా ఏట్లో నీటిని మసీదు తొట్టిలోకి తోడేవార ట. ఇంకా చెప్పాలంటే ఇక్కడ నెలకొని ఉన్న ప్రతి రాయిలో ఏదో ఒక విశిష్టత దాగుందని చెప్పవచ్చు.

చదవండి :  అల్లసాని పెద్దన చౌడూరు నివాసి

జిల్లా కేంద్రం కడప నుంచి భాకరాపేట మీదుగా బద్వేలు వెళ్ళే మార్గంలో పెన్నా నది ఒడ్డున సిద్ధవటం ఉంది. కడప నుంచి ఇక్కడికి 20 కిమీల దూరం. హైదరాబాద్‌ నుండి కడప వరకు విరివిగా నడిచే బస్సులతో పాటు రెైలు సౌకర్యం కూడా ఉంది.

దగ్గరి విమానా శ్రయాలు:

దూరప్రాంతం నుండి వచ్చే పర్యాటకుల దగ్గరి విమానా శ్రయాలు కడప, తిరుపతి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌.

అనువైన కాలం:

సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాలు ఈ కోటను సందర్శించడానికి ఎంతో అనుకూలమైన సమయం. వేసవికాలంలో కూడా సిద్ధ వటం కోటకు సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది.

ఇదీ చదవండి!

పాస్‌పోర్ట్ సేవలు

ఏప్రిల్ 3 నుండి కడపలో పాస్‌పోర్ట్ సేవలు

కడపలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు విదేశాంగ మరియు తపాల శాఖల మధ్య అవగాహనా ఒప్పందం జిల్లా వాసులకు తిరుపతి …

ఒక వ్యాఖ్య

  1. now the fort is not good condition it was very bad to say that i am the native of siddhout. govt has realesed lot of funds but orcialozy department was not utliseing the funds .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: