సింగారరాయుడ
ప్రొద్దుటూరు చెన్నకేశవుడు

సింగారరాయుడ వౌదు చెన్నకేశా – అన్నమయ్య సంకీర్తన

మాచనూరు చెన్నకేశవుని సంకీర్తనలు – 1

పదకవితా పితామహుడు దర్శించిన క్షేత్రాలు అనేకం కడప జిల్లాలో ఉన్నాయి. ఆయా వైష్ణవ క్షేత్రాలను దర్శించిన అన్నమయ్య అక్కడి క్షేత్రపాలకులను కీర్తిస్తూ సంకీర్తనా గానం చేసినాడు. అటువంటి క్షేత్రాలలో మాచనూరు చెన్నకేశవాలయం ఒకటి. మాచనూరు కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని ఒక గ్రామం. ఈ ఊరికి మాచనవోలు (మాచన అనే ఆయన కట్టించడం వలన ఈ ఊరు మాచనవోలు అయింది. ఆధారం: మెకంజీ కైఫీయత్తులు-1225-10) అనే పేరు కూడా కలదు.

చదవండి :  ఏమి నీకింత బలువు - పెదతిరుమలయ్య సంకీర్తన

మాచనూరు చెన్నకేశవుని పైన అన్నమయ్య మూడు సంకీర్తనలు రాసినట్లు డా.శెట్టి శివప్ప గారు తన పరిశోధనా గ్రంధంలో పేర్కొన్నారు.  సింగారరాయుడ వౌదు చెన్నకేశా – అనే ఈ సంకీర్తన అందులో ఒకటి.

రాగము: నాదరామక్రియ
రేకు: 1027-1
సంపుటము: 20-157


‘సింగారరాయుడ …’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి.

సింగారరాయుఁడ వౌదు చెన్నకేశా యింకఁ
జెంగకుమీ మారతుల చెన్నకేశా ॥పల్లవి॥

చిమ్ములచుట్లతోనే చెన్నకేశా మాకు
చిమ్మిరేఁచేవు వలపు చెన్నకేశా
చెమ్మఁజెమటచెక్కుల చెన్నకేశా: మాపైఁ
జిమ్మకు గోళ్ళ నీవు చెన్నకేశా ॥సింగార

చదవండి :  నరసింహ రామకృష్ణ : అన్నమయ్య సంకీర్తన

సెలవిలేనగవుల చెన్నకేశా:
సెలవనెవు వయసు చెన్న కేశా
చెలఁగి పసిడిదట్టి చెన్నకేశా: యీ-
చెలువము నీకే చెల్లె చెన్నకేశా ॥సింగార

చెప్పరాని మహిమల చెన్నకేశా మాకు
చెప్పిలేమోవి యిచ్చితి చెన్నకేశా
యిప్పుడే శ్రీవేంకటాద్రి నిందు మాచనవోలిలో
చెప్పఁగా నన్నేలితివి చెన్నకేశా ॥సింగార


‘సింగారరాయుడ …’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి.

ఇదీ చదవండి!

ముక్కొండ

ముక్కొండ కథ

“ కడప జిల్లాలోని ప్రతి కొండకు ఒక కథ ఉంది. ప్రతివాగుకూ ఓ పాట ఉంది ” –  జే. …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: