
ఇక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ మనోడే!
కడప జిల్లాకు చెందిన ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం దక్కనుంది. డిప్యూటీ చైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ సతీష్ ఒక్కరే బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.
రాజకీయ సమీకరణల నేపధ్యంలో టీడీపీ నుంచి ఎన్నికైన అభ్యర్థిని రంగంలోకి దింపితే తాము పోటీలో ఉండమనే సంకేతాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లాయి. దీంతో అనూహ్యంగా ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆమేరకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఎమ్మెల్సీ సతీష్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ లేకుండా పోయింది. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మొత్తానికి రాయలసీమ ఉద్యమం వేడెక్కుతున్న సమయంలో ఎట్టకేలకు మంత్రిత్వ హోదా ఉన్న డిప్యూటీ చైర్మన్ పదవి సతీష్‌రెడ్డిని వరించనుంది.
విశ్లేషకుల అంచనా ప్రకారం సతీష్‌రెడ్డిని పదవికి ఎంపిక చేయడంలో తెదేపా వ్యూహాత్మకంగా వ్యవహరించి, సీమ నాయకులకు ఒక సందేశం పంపింది – ‘రాజధాని లేదా ఇతరత్రా విషయాలలో ప్రభుత్వ వైఖరిని సమర్ధిస్తే అందలం ఎక్కిస్తామని’! – అదీ కేవలం రాజధాని ప్రకటనకు ఒక్క రోజు ముందుగా , సభలో ప్రతిపక్షం చర్చను కోరుతున్న సందర్భంలో..
పులివెందుల అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా సతీష్ మూడు పర్యాయాలు పోటీచేసి ఓటమి చెందారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. వైఎస్సార్ జిల్లాకు ప్రాధాన్యత కల్పిస్తే తనకే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అయితే బాబు అప్పట్లో కడప జిల్లాకు మొండి చెయ్యి చూపటం సతీష్ భంగపడాల్సి వచ్చింది.
కడప జిల్లా పైన (పసుపు) పచ్చని విషం
Wednesday, July 24, 2019