గైర్హాజరుపై వైకాపా నేతల వివరణ

కడప: గురువారం కడపలో కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగితే కొంతమంది కీలక నేతలు పార్టీ మారే ఆలోచనతోనే సమావేశానికి రాలేదని మీడియాలో వచ్చిన  కథనాలను వైకాపా నేతలు ఖండించారు.శుక్రవారం రాత్రి స్థానిక వైకాపా కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ గూడూరు రవి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కుమారుడు నాగిరెడ్డి సమక్షంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

చదవండి :  జగన్‌కు సాయం చేస్తా....

ఎమ్మెల్సీ నారాయణరెడ్డి అనారోగ్య కారణంగా సమావేశానికి రాలేక పోతున్నానని…మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా గొంతులో సమస్య ఏర్పడిందని ముందే చెప్పినట్లు అమర్ వెల్లడించారు. మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి అమెరికాలో ఉన్న ఫలితంగా రాలేకపోయారని ఆయన వివరించారు. అంతేకాకుండా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి సౌత్ ఆఫ్రికాకు వెళ్లారని, ఈ నేపధ్యంలోనే రాలేదని అమర్‌నాథ్‌రెడ్డి వివరించారు. చిత్తూరులో కార్యకర్తల సమీక్షా సమావేశాన్ని మిథున్‌రెడ్డికి సంబంధించిన కళ్యాణ మండపంలోనే ఏర్పాటు చేయడంతోపాటు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విషయం మీడియాకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు.

చదవండి :  జగన్ కే ఓటు వేసిన వివేకా భార్య ?

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగినా పార్టీ మారుతున్నట్లు దుష్ర్పచారం చేయడం తగదని ఆయన హితవు పలికారు. కేవలం మైండ్ గేమ్ ఆడుతూ….పార్టీని దెబ్బతీయడానికి కొన్ని దుష్టశక్తులు పనిగట్టుకొని పనిచేస్తున్నాయని ఆయన దుమ్మెత్తిపోశారు. శాసనమండలి సభ్యుడు దేవగుడి నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌రెడ్డి, అల్లుడు జయసింహారెడ్డిలు సమావేశానికి హాజరైనా ఆ మీడియాకు ఎందుకు కనబడలేదని ఆయన ప్రశ్నించారు.

అలాగే రాయచోటి, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు వారివారి నియోజకవర్గాల్లో అత్యవసర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి రావడంతో ముందుగానే ఆలస్యంగా వస్తామని సమాచారం ఇచ్చారని, ఇంతలోపే టీవీలలో స్కోరింగ్‌లు పెట్టి దుష్ర్పచారం చేయడం తగదని ఆయన హితవు పలికారు.మొత్తానికి వైకాపా నాయకులు తగిన విధంగా స్పందించి ఊహాగానాలకు ముగింపు పలికారనుకోవాలి.

చదవండి :  అందులోనూ వివక్షే!

తాను సమావేశానికి రాలేక పోతున్నానని ముందే అధ్యక్షులకు ఫోన్ చేసి చెప్పినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ గూడూరు రవి మీడియాకు తెలియజేశారు.

ఇదీ చదవండి!

వైకాపా-లోక్‌సభ

కడప జిల్లా వైకాపా లోక్‌సభ అభ్యర్థుల జాబితా – 2019

కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: