
వైవీయూసెట్-2015 దరఖాస్తుల సమర్పణకు ఏప్రెల్ 28 చివరి తేదీ
కడప: యోగివేమన విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ కళాశాల, అనుబంధ కళాశాలల్లో పోస్టుగ్రాడ్యుయేషనులో ప్రవేశం పొందగోరే విద్యార్థుల నుండి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు స్వీకరణకు ప్రకటన విడుదల చేశారు.
ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, పీజీ డిప్లొమా ఇన్ థియేటరు ఆర్ట్సు కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా సమర్పించేందుకు ఏప్రెల్ 28వ తేదీ వరకు గడువు ఉంది. అపరాధ రసుం చెల్లించి మే 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశార్హత, సిలబస్ ఇతర వివరాలు www.yvudoa.in వెబ్‌సైట్ను సందర్శించి తెలుసుకోవచ్చన్నారు.