
రాజీవ్‌గాంధి వైద్య విద్య, విజ్ఞాన సంస్థ – కడప
రిమ్స్ వైద్యకళాశాలకు సెలవులు
ఈరోజు నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు రిమ్స్ వైద్య కళాశాలకు సెలవులను ప్రకటించారు. సమైక్య సమ్మె నేపధ్యంలోనే సెలవులు ప్రకటించారని విద్యార్థులు భావిస్తుండగా అది వాస్తవం కాదని కళాశాల వర్గాలు ధ్రువీకరించాయి.
కేవలం దసరా పండుగను పురస్కరించుకుని మాత్రమె కళాశాలకు పది రోజుల సెలవు ప్రకటించినట్టు కళాశాల వర్గాలు ధ్రువీకరించాయి. పది రోజుల సెలవు దొరకటంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.