రాసెట్టి రామయ్యను (ఆదోని) గురించిన జానపదగీతం

    రాసెట్టి రామయ్యను (ఆదోని) గురించిన జానపదగీతం

    వర్గం : కోలాటం  పాట

    బళ్ళారి జిల్లరా … బళ్ళారి జిల్లరా
    ఆదోని తాలూకురా
    రాసెట్టి వీరన్న కొడుకే
    రాయల వాడే రామయ్య

    రామా రామా కోదండరామా
    భై రామా రామా కోదండరామా

    రాసెట్టి వీరన్నకయితే
    ఎంతమంది కొడుకుల్లు
    ఒగరి పేరు రామయ్య
    ఒగరి పేరు సుబ్బయ్య
    అందరికంటే చిన్నావాడు
    అందగాడూ విశ్వనాధు
    పన్నెండామడ గడ్డలోన
    పేరుగల్ల రామయ్య ||రామా||

    రామయ్య నేస్తులైన
    ఎంతమంది ఉన్నారు
    కొంగనపల్లి కిష్టరావు
    కోసిగానుమప్ప రా ||రామా||

    చదవండి :  డొక్కల కరువును తెలిపే జానపదగీతం

    బుద్ధిశాలి రామయ్య
    బూమ్మింద యెట్ల జచ్చె
    మంచివాడు రామయ్య
    మంది పా లెట్లాయే ||రామా||

    మారెమ్మ జాత్రనుంటి
    మరణాము కద్దని
    శ్రీశైలము చెంచుదొరా
    చెయ్యిజూసి చెప్పినాడు ||రామా||

    పుట్ట చెండూ బట్టుకోని
    నట్టానడి బజారుకు
    వొంటిగాను పోతావే
    జంటెవరు లేరు తండ్రి ||రామా||

    తలవాకిలి దాటుతూనే
    తల్లీదండ్రి తుమ్మినారు
    సందుగొందులు దాటుతూనె
    చాకలి మాదలడ్డమాయే ||రామా||

    జోడుగుండ్లు బారుజేసి
    కాల్చెనమ్మ బలిజోడు
    కొండ కూలిపోయినట్లు
    కూలిపోయే రామయ్య ||రామా||

    పాట పాడినవారు : సెక్కిరాళ్ళ, గొల్ల సుంకప్ప (పత్తికొండ తాలూకా , కర్నూలు జిల్లా )

    చదవండి :  బేట్రాయి సామి దేవుడా! - జానపద గీతం

    ఆదోని (కర్నూలు జిల్లాలోని ఒక పట్టణము)లో రాచోటి వారు కోటికి పడగలెత్తిన కోమటులు. రామయ్య అప్పటి (19౩౦ లేదా  40 వ దశకంలో ఆదోని పురపాలక సంఘాధ్యక్షుడు. మారెమ్మ దేవత ఉత్సవము కారణముగా రగిలిన కొట్లాటలు ముదిరి, హతుడయినాడు.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *