మంగళవారం , 17 సెప్టెంబర్ 2024

మార్చి 17వతేదీవరకు కడపలో టెలీసీరియల్‌ చిత్రీకరణ

కడప :  ఆహ్వానం టెలీ సీరియల్‌కు సంబంధించి ఈనెల 17వతేదీవరకు కడప నగరంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నారు.

ప్రారంభ సన్నివేశాలను శనివారం దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయంలో సినీనటుడు మురళీమోహన్‌పై చిత్రీకరించారు. ప్రార్థనా సన్నివేశాన్ని శ్రీవారి పాద మండపం వద్ద చేశారు. సీరియల్‌లో కథానాయకి నవ్యశ్రీ, శ్రీరామ్‌ తదితరులపై కొన్ని సన్నివేశాలను దర్శకుడు చిరంజీవి చిత్రీకరించారు.

రమా ఫిలిమ్స్‌ బ్యానర్‌పై 10ఎపిసోడ్ల టెలిఫిలిం నిర్మిస్తున్నామని నిర్మాత మోపూరి వెంకటసుధాకర్‌ తెలిపారు. మురళీమోహన్‌ను చూడడానికి ప్రజలు ఆసక్తి చూపారు. చిత్రీకరణ ఈనెల 17వతేదీవరకు కడప నగరంలో వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ ఉంటుందని నిర్మాత తెలిపారు.

చదవండి :  సంప్రదాయం ప్రకారమే కోదండరాముని పెళ్లి

ఇదీ చదవండి!

రాయలసీమపై టీడీపీ

రాయలసీమపై టీడీపీ కక్ష తీర్చుకుంటోంది : బిజెపి

కడప : రాయలసీమ కోసం తెలుగుదేశం నేతలు దొంగ దీక్షలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్‌ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: