మాడుపూరు చెన్నకేశవ స్వామిపై అన్నమయ్య సంకీర్తన

ఈ ఊరు కడప జిల్లా సిద్దవటం తాలూకాలో లో వుంది. అన్నమయ్య మేనమామ గారి ఊరు మాడుపూరు.ఇక్కడి స్వామి చెన్న కేశవ స్వామి. అన్నమయ్య సంకీర్తనలపై పరిశోధన చేసిన శ్రీ మల్లెల శ్రీహరి గారు మాడుపూరు చేన్నకేశవునిపై ఇదొక్క సంకీర్తన మాత్రమె అందుబాటులో ఉన్నట్లు తేల్చారు.

చేరి యందెలమోతతో చెన్నకేశవా
యీ రీతి మాడుపూరిలో నిట్లాడేవా

మున్ను యశోదవద్దను ముద్దు గుని శాడితివి
పన్ని రేపల్లెవీధుల బారాడితివి
పిన్నవై గోపాలులతో బిల్లదీపులాడితివి
యెన్నిక మాడుపూరిలో యిట్లాడేవా

చదవండి :  చెయ్యరాని చేతల వోచెన్నకేశ్వరా - అన్నమయ్య సంకీర్తన

గాళింగుపడిగెలపై కడునాట్యమాడితివి
కేలి యమునలో రాసక్రీడ లాడితి
చేలలంటి గోపికల చెట్టాపట్టాలాడితివి
యీ లీల మాడుపూరిలో యిట్లాడేవా

తగువిభాండకునితో దాగిలి ముచ్చలాడితి
అగడుగా బండివిరిచాటలాడితి
వొగి శ్రీ వేంకటగిరినుండి వచ్చి మాడుపూర
నెగసెగసి గతుల కిటులాడేవా

ఇదీ చదవండి!

అన్నమయ్య

అన్నమయ్య కథ : ఐదో భాగం

అన్నమయ్య ఆలయ ప్రవేశం: అన్నమయ్య ఆదివరాహస్వామిని సేవించుకొని వేంకటేశ్వరస్వామి కోవెలకు వెళ్లాడు. పెద్ద గోాపురాన్ని ఆశ్చర్యంగా చూశాడు. అక్కడ పెద్ద …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: