భారతదేశ కీర్తిని ఇనుమడింపజేస్తున్న మంగంపేట

ఆం.ప్ర రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు తలమానికం మంగంపేట (ఓబులవారిపల్లి మండలం, కడప జిల్లా) ముగ్గురాళ్ళ గనులు – ఇవి ప్రపంచంలోనే ప్రసిద్దిగాంచిన ముగ్గురాళ్ళ గనులు. 1980కి ముందు రాష్ట్ర ప్రభుత్వం మంగంపేటలో సర్వే చేసినప్పుడు 72 మిలియన్ టన్నుల ముగ్గురాయి నిక్షేపాలు ఇక్కడ ఉన్నట్లు వెల్లడయ్యింది.

ఆనాటి నుండి ఈనాటి వరకు కేవలం పది మిలియన్ల పైచిలుకు టన్నుల ముగ్గురాళ్ళను మాత్రమే ఇక్కడ వెలికి తీశారు. ఇంకా సుమారు 60 మిలియన్ టన్నుల ముగ్గురాయి నిక్షేపాలు మంగంపేటలో ఉన్నాయి. ఈ గనుల వల్ల రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు ప్రతి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది.

Barytesముగ్గురాళ్ళ వ్యాపారం ద్వారా దేశంలోకి కోట్లాది రూపాయల విదేశీమారకద్రవ్యం కూడా వస్తోంది. మనగంపేటలో ప్రభుత్వానికన్నా ముందు వివిధ రాజకీయపార్టీలకు చెందిన డా||వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, కందుల రాజమోహన్ రెడ్డి, రామనాధ రెడ్డి తదితరులు సబ్ లీజులుగా తీసుకొని ముగ్గురాళ్ళ తవ్వకం చేసేవారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ప్రభుత్వం సబ్ లీజులను రద్దు చేయడంతో ప్రభుత్వ రంగ సంస్థ ఏ.పి.ఏం.డి.సి ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏ.పి.ఏం.డి.సికి సుమారు 223.23 హెక్టార్ల విస్తీర్ణంలో మైనింగ్ లీజులున్నాయి.

చదవండి :  మూడు రోజులు కాదు వారానికి నాలుగు రోజులు

ప్రత్యేకత

ప్రపంచంలోకెల్లా మంగంపేట ముగ్గురాయి (బైరైటీస్) నిక్షేపాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒకే ఖనిజం 4.5 మీటర్ల కనిష్ట మందం నుంచి 40 మీటర్ల గరిష్ట మందంలో ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా ఇంత మందంతో కూడిన ముగ్గురాయి నిక్షేపాలు లేవు. రసాయనిక విశ్లేషణలో మంగంపేట ముగ్గురాల్లలో 98.3 శాతం బేరియం సల్ఫేట్ ఉన్నట్లు తేలింది. సాంద్రత ఆధారంగా ఇక్కడి ముగ్గురాళ్ళను ఏ,బి,సి,డి గ్రేడ్ లు గా వర్గీకరించారు.

ఆయిల్ డ్రిల్లింగ్, బేరియం సల్పేట్, పెయింట్‌లో సైనింగ్, పేపర్ పరిశ్రమల్లో ముగ్గురాళ్ళను వినియోగిస్తున్నారు. భూఉపరితలం, సముద్ర గర్భంలో పెట్రోల్ ఉత్పత్తుల కోసం, భారీ ఎత్తున బోరు బావుల్లో డ్రిల్లింగ్ చేపట్టినప్పడు గ్యాస్ (మంటలు) వత్తిడిని తగ్గించడంతో పాటు బోరు బావుల లోపల కూలింగ్ ఏజెంట్‌గా బెరైటీస్ ఉపయోగపడుతుంది. పాశర్లపూడి వద్ద ఆయిల్ డ్రిల్లింగ్ చేపట్టినప్పడు బ్లోఔట్‌కు కారణం కేవలం అక్కడ బెరైటీస్ పౌడర్ వాడకం తగ్గిపోవడమే!

చదవండి :  మంగంపేట ముగ్గురాయి గనుల ప్రయివేటీకరణ?

మంగంపేటలో ముగ్గురాయి నిక్షేపాలున్నట్లు మొదటగా 1872లో డబ్ల్యు.కింగ్ అనే బ్రిటీషు అధికారి చేసిన సర్వే ద్వారా వెల్లడయ్యింది. ప్రపంచంలోనే 28శాతం ముగ్గురాయి (బైరైటీస్) నిక్షేపాలు మంగంపేటలో ఉన్నాయి. భారతదేశంలో లభ్యమయ్యే ముగ్గురాయిలో 98 శాతం మంగంపేట గనుల నుండే లభ్యమవుతోంది.

ప్రపంచంలో రెండవ స్థానం

ముగ్గురాళ్ళ ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశానిది రెండవ స్థానం – నిక్షేపాల నిల్వలలో మూడవ స్థానం. ముగ్గురాయి నిక్షేపాల నిల్వల విషయంలో అమెరికా, చైనాలు ఒకటి, రెండు స్థానాలలో ఉన్నాయి.

చదవండి :  అవి చిరుతపులి పాదాల గుర్తులే!

ఏది ఏమైనప్పటికీ ముగ్గురాయి ఉత్పత్తి, నిల్వల విషయంలో ప్రపంచ యవనికపై భారతదేశానికి కీర్తిని ఇనుమడింపజేసిన ఘనత మన మంగంపేట సొంతం!

కడప జిల్లా – ఖనిజాల ఖిల్లా అని చాటడానికి మన మంగంపేట ముగ్గురాయి నిలువెత్తు నిదర్శనం!!

4 వ్యాఖ్యలు

  1. సంతోషం. మంగంపేటను వెంటనే తెలంగాణాలో కలపటానికి ప్రయత్నించటం జరుగవచ్చును.
    అది భౌగోళికకారణాల వలన సాధ్యపడని పక్షంలో సీమాంధ్రకు 30% తెలంగాణాకు 70% చొప్పున పంచటానికి తెలంగాణా బిల్లులో సవరణలు చేయవలసి రావచ్చును.

  2. OK from Mangampet we are getting lot of money, as per to your news article,but where is this money I am from this location, I don not see any development nothing improvment, no clean and stable roads are there, if some one want to travel from that place he definitlly afraid because of road condittions, living conditions of peoples are very low. I do not have words mention about the conditions of of Mangampet.I am sure the Gov and the politicians are looting money,sending that money to swiss or any other country.That is why I am asking the question why we need of mines, or God given wealth when it is not use for the welfare of the prime location and its location peoples.I am writing these words with my heart broken.I pray to God let him take his wealth back to him.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: