కడప: జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని ఆ పార్టీ నేత, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కడపకు వచ్చిన ఆయన సోమవారం బీజేపీ నాయకుడు ప్రభాకర్ నివాసగృహంలో విలేకరులతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్రమోదీ పాలనను చూస్తున్న ప్రజలు బీజేపీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. పలు పార్టీల నాయకులు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ ప్రశ్నిస్తుందని, వ్యక్తిగత విమర్శలకు దూరమని పేర్కొన్నారు.
ప్రభుత్వం, పార్టీ వేర్వేరని, ఏ పార్టీకి సంబంధించిన సభ్యత్వం ఆ పార్టీదేనన్నారు. జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో పర్యటించనున్నారన్నారు.