బాధ్యతలు స్వీకరించిన ఉపకులపతి

    బాధ్యతలు స్వీకరించిన ఉపకులపతి

    యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య బేతనభట్ల శ్యామ్‌సుందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాళ్లు, డీన్‌లతో సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… విశ్వవిద్యాలయంలోని కుటుంబసభ్యులందరినీ కలుపుకుని తన శాయశక్తులా అభివృద్ధికి కష్టపడి పనిచేస్తానని తెలిపారు.

    యోగి వేమన పేరుతో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయంలో పనిచేయడం అదృష్టమన్నారు. ఆయన ప్రబోధనలను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధికి పాటుపడతామన్నారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు సంపూర్ణ శక్తిసామర్థ్యాలను వినియోగించి విశ్వవిద్యాలయానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

    చదవండి :  పరీక్షలు జరిగిన 24 గంటల్లోపే పీజీసెట్ ఫలితాలు

    విశ్వవిద్యాలయ అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు కన్నారన్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతో వైవీయూను అభివృద్ధి బాట పట్టిస్తామన్నారు. భవన నిర్మాణాలకు నిధులు రాబట్టేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.

    పరిశోధక విద్యార్థులు, వైవీయూలో ప్రవేశాల తగ్గుదల, క్రీడామైదానం, క్రీడల్లో వెనుకబాటు, నాన్‌టీచింగ్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది సమస్యలపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆయన త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.

    అనంతరం అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రైవేట్ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, ఆర్ అండ్ బీ సీఈ మనోహర్‌రెడ్డి తదితరులు వైస్ చాన్స్‌లర్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎం. రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపాళ్లు వాసంతి, జయచంద్రారెడ్డి, ఓఎస్డీ ధనుంజయనాయుడు, ఇంజినీర్ నాగరాజు, డీన్లు పాల్గొన్నారు.

    చదవండి :  యోవేవికి ఒకేసారి ఆరు రామన్ ఫెలోషిప్‌లు

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *