
ప్రొద్దుటూరు శాసనసభ బరిలో 13 మంది
ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి గాను మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 13 మంది అభ్యర్థులు తుది పోరులో నిలువనున్నారు. తుదిపోరులో నిలువనున్న 13 మంది అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తులను కేటాయించింది. ప్రొద్దుటూరు శాసనసభ స్థానం నుండి తలపడుతున్న అభ్యర్థుల జాబితా మరియు వారికి కేటాయించిన గుర్తులు …
1 రాచమల్లు శివప్రసాద్ రెడ్డి – వైకాపా – సీలింగ్ ఫ్యాన్
2 నంద్యాల వరదరాజులురెడ్డి – తెదేపా – సైకిల్
3 నూకా వెంకట శానమ్మ – జైసపా – చెప్పులు
4 గొర్రె శ్రీనివాసులు – కాంగ్రెస్ – చెయ్యి
5 రాచమల్లు గురుప్రసాద్ రెడ్డి – వైఎస్సార్ బహుజన పార్టీ – కరెంటు స్థంభం
6 చౌటపల్లి సుజనాదేవి – పిరమిడ్ పార్టీ – టీవీ
7 ఆది సూర్యనారాయణ – లోక్ సత్తా – పీక (ఈల)
8 పెట్లు శ్రీనివాసులు – బసపా – ఏనుగు
9 బండి శ్రీహరి – అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ – బ్యాట్
10 కె సునీల్ సాగర్ – స్వతంత్ర అభ్యర్థి – అల్మారా
11 మాదాసు మురళీమోహన్ – స్వతంత్ర అభ్యర్థి – కొబ్బరికాయ
12 కానాల సామేల్ – స్వతంత్ర అభ్యర్థి – ఆటో రిక్షా
13 పాతకోట బంగారుమునిరెడ్డి – నేకాపా – గడియారం