ఈ రోజు నుంచి పుష్పగిరి బ్రహ్మోత్సవాలు

    ఈ రోజు నుంచి పుష్పగిరి బ్రహ్మోత్సవాలు

    మే 2 నుంచి తిరుణాళ్ళ

    హరిహరులు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం పుష్పగిరి వైద్యనాదేశ్వరస్వామి, చెన్నకేశవస్వాముల బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. మేనెల 6 వరకూ 10 రోజులపాటు సాగుతాయి. ఇందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ ఛైర్మన్ వెంకటసుబ్బారెడ్డి, ఆలయ ప్రధానర్చకులు సుమంత్‌దీక్షితులు తెలిపారు. పది రోజులపాటు క్షేత్రాధిపతి శ్రీవైద్యనాదేశ్వరస్వామి, క్షేత్రపాలకుడు శ్రీలక్ష్మీచెన్నకేశవస్వాములకు ఉదయం సాయంత్రం వాహనసేవలు నిత్యపూజలు అభిషేకాలు, తోమాలసేవలు, హోమాలు నిర్వహిస్తారు.

    మూడురోజుల తిరునాళ్ల

    బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 30న చెన్నకేశవస్వామికి అష్టోత్తర కలశాభిషేకం, మే 1న చందనోత్సవం నిర్వహిస్తారు.

    చదవండి :  11 రోజులపాటు పుష్పగిరి బ్రహ్మోత్సవాలు

    మూడురోజుల తిరునాళ్ల మే 2న అక్షయతదియతో ప్రారంభం అవుతుంది. 3న హరిహరులకు కల్యాణం, 4న రథోత్సవం ఉంటాయి.

    పుష్పగిరి దేవాలయాల ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *